...
HomeBlogVirat Kohli withdraws from 1st two tests of India vs England |టీమిండియాకు...

Virat Kohli withdraws from 1st two tests of India vs England |టీమిండియాకు బిగ్‌షాక్… తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం

Virat Kohli withdraws from 1st two tests of India vs England series due to personal reasons. |టీమిండియాకు బిగ్‌షాక్… తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం.

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న వేళ.. ఆతిథ్య టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. అతడికి రీప్లేస్‌మెంట్‌ను భారత సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రకటిస్తుందని పేర్కొంది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు మూడు రోజుల ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టు నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఈ మేరకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ.. తొలి రెండు మ్యాచులకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

“ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టుల నుంచి వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. దీనికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐని కోరాడు. విరాట్ కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని కోహ్లీ చెప్పాడు. కానీ వ్యక్తిగత కారణాలు, తప్పనిసరి పరిస్థితుల్లో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. అతడి నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ.. ప్రైవసీని గౌరవించాలి. అతడి వ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు మానుకోవాలని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరుతోంది. త్వరలోనే అతడికి రిప్లేస్‌మెంట్‌ను త్వరలోనే భారత సెలక్షన్ కమిటీ ప్రకటిస్తుంది” అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

కాగా ఈనెల 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచులు టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టుకు వేదిక అయిన హైదరాబాద్‌కు చేరుకుంది. టీమిండియా సైతం.. తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతడి ప్లేసులో ఎవర్ని జట్టులోకి తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, చెటేశ్వర్ పుజారా‌ల్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.


రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్‌.

Also Read 👇👇👇👇

Indian Cricket Team On Verge Of Beating Pakistan To T20I (lsrallinonenews.com)

India vs South Africa Live Score, 2nd Test: Can Rohit and Co. level series in Newlands with India back to full strength? – Lsrallinonenews.com

Telegram: Contact @lsrallinonejobs

Features of Ayodhya Ram Mandir-Telugu-2024 (lsrallinonenews.com)

Ayodhya Ram Mandir History: A timeline of devotion (lsrallinonenews.com)

The Board of Control for Cricket in India (bcci.tv)

ALL IN ONE NEWS
ALL IN ONE NEWShttp://lsrallinonenews.com
LSR All-in-One News brings you the latest updates, insightful analysis, and diverse perspectives on a wide range of topics. Explore a world of news, from global affairs to tech trends, lifestyle, science, and beyond. Stay informed, inspired, and connected with our comprehensive coverage, thought-provoking articles, and in-depth features. LSR All-in-One News is your go-to source for staying ahead in a rapidly evolving world. Dive into the news that matters to you, all in one place.”
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

chaitanya on Hello world!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.