Transportation Minister Ponnam Prabhakar Announced That TSRTC Will Hire 3000 New Employees
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని.. వాటిల్లోకి 3 వేల మంది సిబ్బందిని తీసుకోనున్నట్లు తెలిపారు.
Table of Contents
ప్రధానాంశాలు:
- నిరుద్యోగులకు శుభవార్త
- టీఎస్ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు
- మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టీఎస్ ఆర్టీసీలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ నెల 31వ అందుకు సంబంధించిన శుభవార్త వస్తుందని చెప్పారు.
కరీంనగర్-2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు ఆదివారం ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడిన పొన్నం.. ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని అన్నారు. గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై..
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇటీవల సంస్థ ఎండీ సజ్జనార్ కూడా ప్రకటన చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందన్నారు.
కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు చెప్పారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని.. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని సజ్జనార్ స్పష్టం చేశారు. ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఆర్టీసీ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Transportation Minister Ponnam Prabhakar Announced That TSRTC Will Hire 3000 New Employees.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి..
TSRTC Apprenticeship Notification-2024 | డిగ్రీతో 150 ఖాళీల (lsrupdates.com)
APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com
Transportation Minister Ponnam Prabhakar Announced That TSRTC Will Hire 3000 New Employees
[…] Bandi Sanjay Kumar Funny Comments On Tenth Hindi Paper […]
[…] […]