TDP-Janasena Released First List of Candidates for AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించారు.
Table of Contents
TDP-Janasena Released First List of Candidates for AP Assembly Elections 2024
వాస్తవానికి టీడీపీ, జనసేనలతో బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. తొలి జాబితాలో టీడీపీ 94, జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన పార్టీకి మొత్తం 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
టీడీపీ అభ్యర్థులు-TDP Candidates
- ఆముదాలవసల – కూన రవికుమార్
- ఇచ్చాపురం – బెందాళం అశోక్
- టెక్కలి – అచ్చెన్నాయుడు
- రాజాం – కొండ్రు మురళీమోహన్
- అరకు – సియూరి దొన్ను దొర
- కురుపాం – జగదీశ్వరి
- పార్వతీపురం – విజయ్ బొనెల
- సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
- బొబ్బిలి – ఆర్.ఎస్.వి.కె.కె. రంగారావు (బేబీ నాయన)
- గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
- విజయనగరం – పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
- నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు
- పాయకరావుపేట – వంగలపూడి అనిత
- విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
- విశాఖ వెస్ట్ – పీజీవీఆర్ నాయుడు (గణబాబు)
- ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
- పి గన్నవరం – సరిపెల్ల రాజేష్ కుమార్ (మహాసేన రాజేష్)
- కొత్తపేట – బండారు సత్యానందరావు
- మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
- రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
- జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు (జ్యోతుల నెహ్రూ)
- పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
- తుని – యనమల దివ్య
- అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
- ఆచంట – పితాని సత్యనారాయణ
- పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
- ఉండి – మంతెన రామరాజు
- తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
- చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
- తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
- నూజివీడు – కొలుసు పార్థసారథి
- ఏలూరు – బడేటి రాధాకృష్ణ
- గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
- గుడివాడ – వెనిగండ్ల రాము
- పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
- మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
- పామర్రు – వర్ల కుమార్ రాజా
- విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
- విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్ రావు
- జగ్గయ్య పేట – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
- నందిగామ – తంగిరాల సౌమ్య
- తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
- మంగళగిరి – నారా లోకేష్
- పొన్నూరు – ధూళిపాళ్ల నరేందర్ కుమార్
- వేమూరు – నక్కా ఆనంద్ బాబు
- బాపట్ల – వేగేశ్న నరేంద్ర కుమార్
- ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
- చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
- సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
- వినుకొండ – జీవీ ఆంజనేయులు
- మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
- రేపల్లె – అనగాని సత్యప్రసాద్
- ఎర్రగొండపాలెం – గూడూరి ఎరిక్సన్ బాబు
- పర్చూరు – ఏలూరి సాంబశివరావు
- సంతనూతలపాడు – బీఎన్ విజయ్‌కుమార్
- అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
- ఒంగోలు – దామచర్ల జనార్థనరావు
- కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
- కొండెపి – డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
- కావలి – కావ్య కృష్ణారెడ్డి
- నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
- నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- గూడూరు – పాశం సునీల్ కుమార్
- సూళ్లూరుపేట – నెలవల విజయశ్రీ
- ఉదయగిరి – కాకర్ల సురేష్
- కడప – రెడ్డప్పగారి మాధవి రెడ్డి
- రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- పులివెందుల – మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)
- మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
- ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ రెడ్డి
- శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
- కర్నూలు – టీజీ భరత్
- పాణ్యం – గౌరు చరితా రెడ్డి
- నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్
- బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి
- డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
- పత్తికొండ – కేఈ శ్యాంబాబు
- కొడుమూరు – బొగ్గుల దస్తగిరి
- రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
- ఉరవకొండ – పయ్యావుల కేశవ్
- తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
- శింగనమల – బండారు శ్రావణిశ్రీ
- కళ్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
- రాప్తాడు – పరిటాల సునీత
- మడకశిర – ఎంఈ సునీల్ కుమార్
- హిందూపురం – నందమూరి బాలకృష్ణ
- పెనుకొండ – సవితమ్మ
- తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
- పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
- నగరి – గాలి భాను ప్రకాష్
- గంగాధర నెల్లూరు – డాక్టర్ వీఎం థామస్
- చిత్తూరు – గురజాల జగన్‌మోహన్
- పలమనేరు – ఎం. అమర్‌నాథ్ రెడ్డి
- కుప్పం – నారా చంద్రబాబునాయుడు
జనసేన అభ్యర్థులు-Janasena Candidates
- నెల్లిమర్ల – లోకం మాధవి
- అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
- కాకినాడ రూరల్ – పంతం నానాజీ
- తెనాలి – నాదెండ్ల మనోహర్
- రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
అంతకుముందు టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల పేర్ల అంశంపై చర్చించారు.TDP-Janasena Released First List of Candidates for AP Assembly Elections 2024
వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేనలు చాలా రోజుల క్రితమే తయారుచేశాయి. వందకు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల రెండో వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్నా.. బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదావేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు.
ఇవాళ్టి ముహూర్తం దాటితే మళ్లీ రెండు వారాల వరకూ మళ్లీ అంత మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో శనివారాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చేరవేశారట. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాబితా విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగసభకు ముందు కొందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేస్తున్నారట. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం అసెంబ్లీ సీట్లల్లో అభ్యర్థుల ప్రకటనకే టీడీపీ – జనసేన పరిమితం కానుంది. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చాక ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశముందని కూటమి పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాతో పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
NTPC Deputy Manager Recruitment 2024 Apply Online For 110 Posts – Lsrallinonenews.com
TDP-Janasena Released First List of Candidates for AP Assembly Elections 2024
AP TRT Recruitment-2024 for 4,579 SA/SGT Posts – Lsrallinonenews.com
TDP-Janasena Released First List of Candidates for AP Assembly Elections 2024
AP DSC Notification 2024 for 6100 Posts – Lsrallinonenews.com
Know the full Specifications and Price Details of Jio Book Laptop-2024 – Lsrallinonenews.com
TDP-Janasena Released First List of Candidates for AP Assembly Elections 2024