ఎన్ఎస్ఈ పెద్ద శుభవార్త.. లేటు లేకుండా ట్రేడర్ల ఖాతాల్లోకి డబ్బులు..| SEBI to start T+0 trading settlement on optional basis by March 28
SEBI to start T+0 trading settlement on optional basis by March 28: భారత స్టాక్ మార్కెట్లను నియంత్రించే సంస్థ సెబీ ఇటీవల నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్న వేళ సరికొత్త విధానాలతో వేగాన్ని, సేవల్లో సమర్థతను పెంచుతూ ముందుకు సాగుతోంది.
SEBI to start T+0 trading settlement on optional basis by March 28
T+0 Trade Settlement: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షేర్ల కొనుగోలు, అమ్మకం విధానంలో పెద్ద మార్పును తీసుకొస్తోంది. దీని కింద ట్రేడర్లు చేసే ట్రాన్సాక్షన్లు అదే రోజున సెటిల్ చేయబడతాయని తెలుస్తోంది. ఇందుకోసం T+0 పద్ధతిలో షేర్ డీల్స్‌ను సెటిల్ చేసే విధానాన్ని సెబీ ఆమోదించింది. అంటే షేర్లు అమ్మిన రోజే ఖాతాదారుడి ఖాతాకు డబ్బులు వస్తాయి. ఈ విధానాన్ని తొలుత మార్చి 28 నుంచి ప్రారంభించనున్నారు. T+0 సెటిల్‌మెంట్ సిస్టమ్ బీటా వెర్షన్‌ను అమలు చేయడానికి SEBI ఆమోదించింది. తొలుత ఇది 25 షేర్లకు అమలు చేయబడుతుంది. అలాగే పరిమిత బ్రోకర్లు మాత్రమే దీనిని ఉపయోగించగలరని సమాచారం.
కొత్త విధానం పనితీరును రానున్న 6 నెలల పాటు సెబీ క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఈ టెస్టింగ్ పిరియడ్ తర్వాత పూర్తి స్థాయిలో విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధన వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరగడంతో పాటు రిస్క్ కూడా తగ్గుతుందని సెబీ పేర్కొంది. T+1 సెటిల్‌మెంట్ సిస్టమ్(T + 1 Settlement System) ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ T అంటే ట్రేడింగ్ జరిగిన రోజు.
T+0 విధానంలో స్టాక్ మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగిన రోజునే షేర్ డీల్ సెటిల్ అవుతుంది. అంటే పెట్టుబడిదారుడు ఉదయం షేర్లను విక్రయిస్తే సాయంత్రానికి అతని ఖాతాలో డబ్బు మొత్తం జమ అవుతుంది. టీ+0(T+0) విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని సెబీ ప్రతిపాదించింది. ఇందులో మధ్యాహ్నం 1:30 గంటలకు డీల్ కుదిరితే సాయంత్రం 4:30 గంటలకు సెటిల్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరిగే అన్ని లావాదేవీలకు ప్రత్యామ్నాయ పరిష్కార సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) నగదు, ఫ్యూచర్స్ విభాగాలలో ట్రేడింగ్ కోసం లావాదేవీల ఛార్జీలను ఒక శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇకపై వారు చౌకగా షేర్లను క్రయవిక్రయాలు చేపట్టగలరు. ఎన్ఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏడాదికి ఆదాయం దాదాపు రూ.130 కోట్ల మేర ప్రభావితం అవుతుందని సమాచారం.
SEBI to start T+0 trading settlement on optional basis by March 28 # T+0 trade settlement.
SEBI to start T+0 trading settlement on optional basis by March 28