పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది.
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs
పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్పై(Paytm Payment Bank) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank). వాలెట్లతో పాటు క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్స్ గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది ఆర్బీఐ. వినియోగదారుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అలాగే, గతంలో ఫిబ్రవరి 29గా నిర్దేశించిన గడువును.. మార్చి 15 వరకు పొడిగించింది.
Table of Contents
ఆర్ బిఐ(RBI) FAQs :
- నగదు విత్ డ్రా-Amount Withdraw: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును 2024 మార్చి 15 తర్వాత కూడా ఖాతా ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. అలాగే, పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. 15 తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయలేరు. వడ్డీ, క్యాష్బ్యాక్స్, పార్ట్నర్ బ్యాంక్స్ నుంచి స్వీప్-ఇన్, రిఫండ్లు మాత్రమే అనుమతిస్తారు.
- వేతన ఖాతా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉంటే మార్చి 15 తర్వాత నగదును అందుకోలేరు. భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
- సబ్సిడీ: ప్రభుత్వం నుంచి ఆధార్ అనుసంధానం అయి ఉన్న నగదు బదిలీ గానీ, సబ్సిడీ గానీ వస్తుంటే అలాంటివారు కూడా నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
- ఆటో డెబిట్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో నగదు ఉన్నంతవరకు ఆటో డెబిట్ (NACH)కు అవకాశం ఉంటుంది. మార్చి 15 తర్వాత నగదు పూర్తయితే ఆటో డెబిట్ కు అవకాశం ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
- ఓటీటీ సబ్స్క్రిప్షన్-OTT Subscription: పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ తో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే మార్చి 15 తర్వాత ఖాతాలో ఉన్న నగదు పూర్తయ్యేంత వరకు మాత్రమే రెన్యువల్కు అవకాశం ఉంటుంది.
- వాలెట్-Wallet: మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్బ్యాక్, రిఫండ్లు మినహా ఇతరుల నుంచి కూడా నగదును పొందలేరు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ క్లోజ్ చేసి ఆ నగదును ఇతర బ్యాంకులకు పంపించుకోవచ్చు.
- ఫాస్టాగ్-Fastag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లను మార్చి 15 తర్వాత అందులో బ్యాలెన్స్ ఉండేంత వరకు వినియోగించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. కాబట్టి వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. ఫాస్టాగ్లో నగదును బదిలీ చేయడం కుదరదు. కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను సంప్రదించి రిఫండ్ కోరొచ్చు.
- NCMC: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలీ కార్డుదారులు (NCMC) సైతం మార్చి 15 తర్వాత అందులోని బ్యాలెన్స్ పూర్తయ్యే వరకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇతర బ్యాంకులు జారీ చేసే ఈ తరహా కార్డులను తీసుకోవచ్చు. ఇందులోని నగదును కూడా వేరే కార్డుకు బదిలీ చేయడం కుదరదు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను రిఫండ్ కోరొచ్చు.
- UPI: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు అనుసంధానం అయిఉన్న యూపీఐ/ IMPS ఖాతాలకు మార్చి 15 తర్వాత నగదు పంపలేరు. ఆ సమయంలో అందులో ఉన్న నగదును యూపీఐ/ IMPS ద్వారా విక్స్ట్రా చేసుకోవచ్చు.
- క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్లు-QR Codes & Paytm Sound Boxes: పేటీఎం క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్ లు లేదా పీఓఎస్ టర్మినల్స్ వినియోగిస్తున్న మర్చంట్స్.. ఇతర బ్యాంకులతో అనుసంధానం అయి ఉంటే వాటిని మార్చి 15 తర్వాత కూడా యథాతథంగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ వాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానం అయ్యి ఉంటే. అందులో ఎలాంటి నిధులూ జమ కావు. కాబట్టి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ఖాతాను వాటికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న ఫండ్ను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కు మళ్లించుకోవచ్చు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల పలు ఆంక్షలు విధించగా.. ఇది ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గడువును కాస్త పొడిగించింది. పేమెంట్స్ బ్యాంక్ సంబంధిత సర్వీసులు 2024, మార్చి 15 వరకు కొనసాగుతాయని ప్రకటించింది. ఇదే సమయంలో ఈ బ్యాంక్ కస్టమర్ల మదిలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలతో FAQs విడుదల చేసింది. 2024, ఫిబ్రవరి 16న దీనిపై ప్రకటన చేసింది కేంద్ర బ్యాంకు. కస్టమర్ల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కేవైసీకి సంబంధించి సరైన నిబంధనలు పాటించలేదని..
కేవైసీకి సంబంధించి సరైన నిబంధనలు పాటించలేదని.. పలు నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఆడిట్ చేసి ఆర్‌బీఐ పేటీఎం బ్యాంకుపై జనవరి 31న చర్యలు తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దని.. ఫాస్టాగ్స్, వాలెట్స్ టాప్ అప్స్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఇది ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పగా ఈ క్రమంలోనే వారు ఆందోళనలకు గురవుతున్నారు.
అసలు ఈ ప్రభావం పేటీఎంపై ఎంత వరకు ఉంటుంది? ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? డబ్బుల్ని వేరే అకౌంట్లోకి పంపించవచ్చా? దీనికేమైనా గడువు ఉంటుందా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తాయి. దీనికి ఇప్పుడు కేంద్ర బ్యాంకు సమాధానాలు ఇచ్చింది. పూర్తి వివరణతో కూడిన సమాధానాల్ని విడుదల చేసింది ఆర్‌బీఐ.
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs Attached Below.
పేటీఎం బ్యాంకుపై ఆంక్షలు విధించిన తరుణంలో కేంద్ర బ్యాంకు ఇప్పుడు కస్టమర్లు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేందుకు, ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాల దృష్ట్యా.. మరికొంత సమయం ఇచ్చింది. అంటే ఈ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం లేదా డబ్బులు తీసుకోవడం ఇతర సేవల వినియోగానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తుందనే అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఇంకొంత సమయం ఇచ్చిన నేపథ్యంలో లైసెన్స్ రద్దు చేసే యోచనలోనే కేంద్ర బ్యాంకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఫాస్టాగ్ జారీ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తరఫున టోల్ వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL). ఇక్కడే ఈ బ్యాంకుకు దెబ్బ పడిందని చెప్పొచ్చు. మరోవైపు పేటీఎం షేరు భారీగా పతనం అవుతోంది. జీవన కాల కనిష్టాలకు పడిపోయింది. ఫిబ్రవరి 1,2 తేదీల్లో 20 శాతం చొప్పున పడిపోగా.. తర్వాత కూడా 5 శాతం, 10 శాతం ఇలా తగ్గుతూనే ఉంది.
Also Read:
Paytm Payments Bank Not on List Of 32 Authorized Banks | Fastag: ఫాస్టాగ్ జారీ నుంచి పేటీఎం అవుట్
Paytm: వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావం పేటీఎంపైనా గణనీయంగా పడుతుంది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో.. తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తరఫున టోల్ రుసుమును వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ సంస్థ (IHMCL) ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంక్స్ లిస్ట్ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించడం కోసం తాము పేర్కొన్న బ్యాంక్స్ నుంచి ఫాస్టాగ్స్ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. ఐహెచ్‌ఎంసీఎల్ పేర్కొన్న బ్యాంకుల జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో పేటీఎం బ్యాంక్ లేదు.
ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్‌లో డిపాజిట్లు సహా టాప్ అప్స్ స్వీకరించొద్దని పేటీఎం బ్యాంకును ఆదేశించింది ఆర్‌బీఐ. సదరు ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ డిపాజిట్లు చేసుకునేందుకు వీల్లేదని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల తరుణంలోనే ఐహెచ్ఎంసీఎల్ ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం పేటీఎం బ్యాంకు కస్టమర్ల కేవైసీకి సంబంధించి నిబంధనలు పాటించలేదన్న కారణంతోనే ఆంక్షలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లంతా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది ఐహెచ్ఎంసీఎల్.
దాదాపు 50 వేల బ్యాంక్ అకౌంట్లకు సరైన కేవైసీ డాక్యుమెంట్లు లేవని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ గుర్తించింది. వీటిల్లో 30 వేల అకౌంట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు లింక్ అయి ఉన్నట్లు తెలిసింది. మిగతా వాటిపైనా దర్యాప్తు సాగుతోంది. దీంతో మనీలాండరింగ్ అనుమానాలు రేకెత్తాయి.
కిందటి సెషన్‌లో ఆల్ టైమ్ కనిష్టాలకు పడిపోయిన పేటీఎం షేరు ఇవాళ పుంజుకుంది. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయంలో 2 శాతానికిపైగా పెరిగి రూ. 332 లెవెల్స్‌లో ట్రేడవుతోంది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 21.11 వేల కోట్ల వద్ద ఉంది.Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs
Paytm Deadline Extended To March 15 and RBI Releases Paytm Payment Bank FAQs