Minister Roja Likely To Contest As Ysrcp Ongole Lok Sabha Candidate:
నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగతున్న రోజాకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోన్న వేళ ఓ ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. ఆమెను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైఎస్సార్సీపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఇటీవల విజయసాయి రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని సమాచారం.
Table of Contents
ప్రధానాంశాలు:
- రెండుసార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా
- ఈసారి నగరి నుంచి ఆమె పోటీలో ఉండరని ప్రచారం
- ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయించే యోచనలో అధిష్టానం..?
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. అభ్యర్దుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 60 మంది అభ్యర్దుల స్థానాలు మార్చిన సీఎం జగన్..తుది జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఎంపీల జాబితా దాదాపు సిద్దమైంది. మాజీ మంత్రి రోజా పైన నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో నగరి నుంచి రోజాను మార్చి పార్లమెంట్ బరిలోకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం.
కీలక మార్పులు:
అభ్యర్దుల ఎంపికలో భాగంగా సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డికి దాదాపు సీటు లేనట్లే. మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంటకు సీటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో సీట్ల మార్పు పైన ఒప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. దీని పైన జిల్లా నేతల నుంచి సానుకూల కనపించ లేదు. దీంతో, ప్రత్యామ్నాయ నేత కోసం పార్టీ నేతలు అన్వేషించారు. ఈ సమయంలోనే నగరిలో మంత్రి రోజా పేరు తెర మీదకు వచ్చింది.
Minister Roja Likely To Contest As Ysrcp Ongole Lok Sabha Candidate | ఎంపీగా బరిలో రోజా:
ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించారు. దీంతో, చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒక్కో కుటుంబంలో రెండు సీట్లు ఆశిస్తున్న వారి నుంచి పోటీ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో, పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నారు. రోజా అభ్యర్దిత్వం పైన జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డి చర్చించారు.
అందరి నుంచి సానుకూలత కనిపించటంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలినేని, బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీఎం వద్దకు వెళ్లి బాలినేనికి సీటు కేటాయింపు పైన చర్చలు చేయాలని భావిస్తున్నారు. దీని పైన సాయిరెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ తుది జాబితా:
రోజాతోనూ ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని రోజా స్పష్టం చేసారని చెబుతున్నారు. దీంతో, నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యదవ్, ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్ల ఖరారు పైన సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అదే సమయంలో రోజాను నగరి నుంచి మార్చితే అక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనే అంశం పైన ఇద్దరి పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. పోటీ చేసే అభ్యర్దుల జాబితా పైన మరింత ఆలస్యం చేయకుండా ఒకటి, రెండు రోజుల్లోనూ పూర్తి స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో, జిల్లా నేతల అభ్యర్దనలతో ఒంగోలు సీటు మాగుంటకు ఇస్తారా..రోజాను బరిలోకి దించుతారా అనేది క్లారిటీ రానుంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com
Announced Padma Awards-2024 Full List – Lsrallinonenews.com
Horoscope Today 28 January 2024 in Telugu – LSR Updates
Minister Roja Likely To Contest As Ysrcp Ongole Lok Sabha Candidate
Minister Roja Likely To Contest As Ysrcp Ongole Lok Sabha Candidate-2024
[…] Minister Roja Likely To Contest As Ysrcp Ongole Lok Sabha Candidate-2024 | నగరి నుంచ… […]