LIC Amritbaal Children Plan 874 Launched Know Details About This New Insurance Policy For Kids: ఎస్ఐసీ నుంచి కొత్త చిల్డ్రన్ ప్లాన్.. ఐదేళ్లు కడితే చాలు! LIC launches Amrithaal ఎల్ఐసీ కొత్త చిల్డ్రన్ ప్లాన్ను తీసుకొచ్చింది. అమృత్బాల్ పేరిట దీన్ని విడుదల చేసింది. చిన్నారుల ఉన్నత విద్య కోసం నిధిని సమకూర్చుకోవాలనుకునే వారి కోసం ఈ పాలసీని విడుదల చేసింది.
Table of Contents
LIC Amritbaal Children Plan 874 Launched Know Details About This New Insurance Policy For Kids
LIC launches Amrithaal : ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల చదువుల కోసం దీర్ఘకాలంలో మదుపు చేయాలనుకునే వారి కోసం ‘అమృత్బాల్’ (ప్లాన్ నం. 874) (LIC Amritbaal) పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 17 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
ప్రధాన ఫీచర్లు..
పిల్లల ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రుల కోసం ఎల్ఐసీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అతితక్కువ పాలసీ చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. పైగా ఆకర్షణీయమైన గ్యారెంటీడ్ అడిషన్ (వెయ్యి రూపాయలకు రూ.80) అందిస్తారు.
ప్రీమియం కాలవ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తం అవసరమయ్యే 18-25 ఏళ్ల వయసు మధ్య పాలసీ మెచ్యూర్ అవుతుంది. దీంతో చిన్నారుల ఉన్నత చదువులకు అవసరమయ్యే నిధిని సమకూర్చుకోవడానికి వీలు పడుతుంది. రైడర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.
Plan Details-పూర్తి వివరాలు..
- చిన్నారుల కోసం ఉద్దేశించిన ఈ పాలసీని 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా తీసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితి 13 ఏళ్లు. మెచ్యూరిటీ కనిష్ఠ వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయస్సును 25 ఏళ్లుగా ఎల్ఐసీ నిర్ణయించింది.
- అతి తక్కువ ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. 5, 6, 7 ఆప్షన్లు ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు ఉంటుంది. గరిష్టంగా 25 ఏళ్లు ఎంచుకోవచ్చు.
- ఇందులో సింగిల్ ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. కనీస పాలసీ టర్మ్ 5 ఏళ్లు ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్ల పాలసీ టర్ను కూడా ఎంచుకోవచ్చు.
- కనీస సమ్ అష్యూర్పై రూ.2 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపు సామర్థ్యం ఆధారంగా మీకు నచ్చిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
- ఎంచుకున్న బీమా హామీ (సమ్ అష్యూర్డ్) మొత్తానికి ప్రతి వెయ్యి రూపాయలకు రూ.80 చొప్పున ఏటా పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం యాడ్ అవుతూ వస్తుంది.
- పాలసీ చెల్లించే సమయంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే డెత్ బెన్ఫిట్స్ కూడా నామినీకి అందిస్తారు. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ పాటు, గ్యారెంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు. (టేబుల్ చూడండి..).
- ఈ పాలసీకి రైడర్లను కూడా జత చేసుకోవచ్చు. ప్రీమియం బెనిఫిట్ రైడర్ను గనుక ఎంచుకుంటే.. ఒకవేళ ప్రపోజర్ కు జరగరానిది ఏదైనా జరిగితే మిగిలిన కాలవ్యవధికి గాను ఆ మొత్తాన్ని ఎలసీనే చెల్లిస్తుంది.
- 8 ఏళ్లలోపు చిన్నారులపై పాలసీ తీసుకుంటే.. 2 ఏళ్ల పాలసీ గడువు తర్వాత లేదా చిన్నారికి 8 ఏళ్లు వచ్చాక (ఏది ముందైతే అది) బీమా హామీ ప్రారంభం అవుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి తీసుకుంటే.. పాలసీ జారీ చేసిన నాటి నుంచే రిస్క్ కవరేజీ అందిస్తామని ఎస్ఐసీ పేర్కొంది.
- ఈ పాలసీ కింద రుణ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ను ఆన్లైన్, ఆఫ్లైన్లో కొనుగోలు చేయొచ్చు. నెలవారీ, మూడు నెలలకోసారి, అర్ధ సంవత్సరానికి, ఏడాదికోసారి చొప్పున ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది.
పాలసీ ఉదాహరణతో..
5 ఏళ్ల బాబు పేరు మీద రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్త్పో పాలసీ తీసుకున్నారనుకుందాం. ప్రీమియం టర్మ్ 7 ఏళ్లు. పాలసీ టర్మ్ 20 ఏళ్లు ఎంచుకున్నారనుకుందాం. అప్పుడు ఏటా రూ.73,625 (జీఎస్టీ అదనం) చొప్పున ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 20 ఏళ్ల పాటు అంటే బాబుకు 25వ ఏడాది వచ్చే వరకు పాలసీ కొనసాగుతుంది. చెల్లించిన మొత్తం రూ.5.15 లక్షలు కాగా.. గ్యారెంటీడ్ అడిషన్స్ కింద రూ.8 లక్షలు సమకూరుతుంది. మెచ్యూరిటీ కింద రూ.13 లక్షలు అందుతుంది.
రూ.5 లక్షలకు ప్రీమియం వివరాలు..
For More Details Read Below Amritbaal Brochure
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
PM Surya Ghar Muft Bijli Yojana 2024: Apply Online, Benefits, Eligibility – Lsrallinonenews.com
LIC Amritbaal Children Plan 874 Launched Know Details About This New Insurance Policy For Kids-2024
LIC Amritbaal Children Plan 874 Launched Know Details About This New Insurance Policy For Kids
LIC Amritbaal Children Plan 874 Launched Know Details About This New Insurance Policy For Kids-2024
It’s actually a great and useful piece of info. I’m happy that you simply shared this useful
info with us. Please keep us informed like this.
Thank you for sharing.
Thank You..!!