Latest Multibagger Stocks 2024:
Multibagger Stocks 2024: గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తూనే ఉన్నాయి. స్వల్పంగా కరెక్షన్ జరిగినప్పటికీ ఐపీవోల రాకతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగటం పెట్టుబడుల ఆకర్షనకు తోడయ్యాయి.
Table of Contents
Jensol Engineering Stock-జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్:
ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొని తన పెట్టుబడిదారులకు సూపర్ లాభాలను అందించిన కంపెనీల జాబితాలో జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ కూడా నిలిచింది. కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కంపెనీని తిరిగి వేగంగా పుంజుకునేలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో బలమైన రాబడిని అందించిన కంపెనీల్లో జెన్సోల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. 4 ఏళ్లలో కంపెనీ షేర్ల ధర 5200 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో లక్ష ఇన్వెస్ట చేసి దీర్ఘకాలం కొనసాగించిన పెట్టుబడిదారులు రూ.50 లక్షల కంటే ఎక్కువ రాబడిని అందుకున్నారు.
ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో పెరుగుదల ట్రెండ్ నేటికీ కొనసాగుతోంది. గత నెలలో కంపెనీ షేర్ల ధర 32 శాతం పెరగగా.. 6 నెలలుగా స్టాక్స్ హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులు 91 శాతం రాబడులను అందుకున్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.1110గా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 62.59 శాతంగా ఉంది. మిగిలిన వాటా ప్రజల వద్ద పెట్టుబడుల రూపంలో ఉంది. అలాగే డిసెంబర్ 2023 నాటికి కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ 1.51 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ EBITDA 312 శాతం పెరిగి రూ.70 కోట్ల స్థాయికి చేరుకుంది.
2012లో స్థాపించబడిన జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ వాస్తవానికి ఇంజనీరింగ్ & నిర్మాణ సేవలను అందించే సంస్థ. అయితే ఇది సోలార్ పవర్ ప్లాంట్లను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 240 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ పూణేలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మూడు-నాలుగు చక్రాల వాహనాలు ఎక్కడ తయారు చేయబడుతున్నాయి.
IFCI Shares-ఐఎఫ్‍సిఐ:
IFCI Shares: గందరగోళంగా ఉన్న మార్కెట్ పరిస్థితుల్లోనూ మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం తమపని తాము చేసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఏడాది కూడా పూర్తి కాకముందే పెట్టుబడిదారులకు కాసుల పంట కురిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రైస్ షాకర్స్ స్టాక్ ఐఎఫ్‍సిఐ(IFCI) కంపెనీ గురించే. 10 నెలల కిందట షేర్ ధర కేవలం రూ.9 మాత్రమే. అయితే నేడు మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.61.05 వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో స్టాక్ ఇవాళ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ఎవరైనా ఇన్వెస్టర్ మార్చి 28, 2023న కంపెనీ షేర్లలో లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం వారి మెుత్తం పెట్టుబడి విలువ రూ.6,78,333కి చేరుకుని ఉండేది. అంటే ఏడాది కూడా నిండ కుండానే పెట్టుబడి విలువ ఏడు రెట్లు పెంపును పొందేవారు.
గడచిన ఐదు రోజుల్లో స్టాక్ ఏకంగా 40 శాతం బంపర్ గెయిన్ ఇన్వెస్టర్లకు అందించింది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.63.85గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ రేటు రూ.9గా ఉంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో చాలా మంది చూపు ఈ కంపెనీ షేర్లపై ఉంది. ప్రస్తుతం కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న చాలా మంది పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వాటాలను విక్రయించేందుకు సుముఖంగా లేరు. దీంతో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,200 కోట్లుగా ఉంది.
IFCI షేర్లు గత 3 నెలల్లో 181% రాబడిని ఇచ్చాయి. గత ఏడాది కాలంలో రూ.లక్ష పెట్టుబడిదారులను రూ.4.81 లక్షలకు మార్చింది. ఈ కాలంలో ఇది 384% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఈ చిన్న స్టాక్ గత మూడేళ్లలో సుమారు 593 శాతం, గత ఐదేళ్లలో 348 శాతం రాబడిని ఇవ్వడం ద్వారా తన పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చేసింది. డిసెంబర్ త్రైమాసిక డేటా ప్రకారం కంపెనీలో సంస్థాగత విదేశీ ఇన్వెస్టర్లు(FII) తమ వాటాను 1.87 నుంచి 2.08 శాతానికి పెంచుకున్నారని వెల్లడైంది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వాటాను 1.97 నుంచి 1.98 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు కంపెనీలో 70.32 శాతం వాటా ఉంది.
మిష్టన్ ఫుడ్స్-Mishtann Foods Ltd:
ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ స్టాక్ మార్కెట్ డెలివరీ చేసిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో మిష్టన్ ఫుడ్స్ షేర్లు ఒకటి. ఈ ఎఫ్ఎంసీజీ బీఎస్ఈలో దాదాపు రూ.9 నుంచి రూ.23.35 వరకు పెరిగింది. అంటే ఈ కంపెనీ తన వాటాదారులకు 150 శాతానికి పైగా రాబడిని అందజేస్తుంది. అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్ రాబోయే సెషన్లలో మరింత పైకి ఎత్తుగడలను ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటీవల ఈ కంపెనీ స్టా్ ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.24.84 కి చేరుకుంది.
Latest Multibagger Stocks 2024: ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో రాబడి వరద.. మూడేళ్లల్లో ఏకంగా 700 శాతం లాభం
భారతదేశంలో సాంప్రదాయ పెట్టుబడులు వైపు వెళ్లని కొంత మంది స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మల్టీబ్యాగర్ స్టాక్స్ అధిక రాబడినిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ స్టాక్ మార్కెట్ డెలివరీ చేసిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో మిష్టన్ ఫుడ్స్ షేర్లు ఒకటి. ఈ ఎఫ్ఎంసీజీ బీఎస్ఈలో దాదాపు రూ.9 నుంచి రూ.23.35 వరకు పెరిగింది. అంటే ఈ కంపెనీ తన వాటాదారులకు 150 శాతానికి పైగా రాబడిని అందజేస్తుంది.
అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్ రాబోయే సెషన్లలో మరింత పైకి ఎత్తుగడలను ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటీవల ఈ కంపెనీ స్టా్ ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.24.84 కి చేరుకుంది. ఇది ప్రస్తుతం ఉన్న 52 వారాల గరిష్ట స్థాయి రూ. 26.50 నుండి దాదాపు 6 శాతం దూరంలో ఉంది . ముఖ్యంగా క్యూ 3 ఫలితాలు 2024 ప్రకటన తర్వాత ఈ మల్టీబ్యాగర్ స్టాక్ అప్‌ట్రెండ్‌లో ఉంది. క్యూ3 ఎఫ్‌వై 24 ఫలితాల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీ ఈబీఐటీడీఏలో 325 శాతం వైవైవై పెరుగుదలను నమోదు చేసింది. అయితే ఈ సమయంలో ఈ స్టాక్ పీఏటీ ధర దాదాపు 580 శాతం పెరిగింది.
మిష్టన్ ఫుడ్స్ క్యూ 3 ఫలితాలు:
అక్టోబర్ నుంచి డిసెంబర్ 2023 త్రైమాసికంలో మిష్టన్ ఫుడ్స్ లిమిటెడ్ తన కార్యకలాపాల ద్వారా రూ.330.52 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం సంబంధిత కాలంలో రూ.163.64 కోట్ల కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంలో 101 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఈబీఐటీడీఏ రూ.996.51 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2022 త్రైమాసికంలో రూ.22.63 కోట్ల ఈబీఐటీడీఏకు వ్యతిరేకంగా 325 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ కంపెనీ ఈబీఐటీడీఏ మార్జిన్లు క్యూ3 ఎఫ్‌వై 23లో 13.82 శాతం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 29.20 శాతానికి మెరుగుపడ్డాయి.
ముఖ్యంగా క్యూ3 ఎఫ్‌వై 23లో రూ.13.70 కోట్ల నుంచి ఇటీవల డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.93.05 కోట్లకు చేరుకోవడంతో కంపెనీ పన్ను తర్వాత లాభం (పీఏటీ) 580 శాతానికి పెరిగింది. ఎఫ్ఎంసీజీ కంపెనీ పీఏటీ మార్జిన్లు కూడా క్యూ3 2023 ఆర్థిక సంవత్సరంలో 8.37 శాతం నుంచి క్యూ3 2024 ఆర్థిక సంవత్సరంలో 28.15 శాతానికి మెరుగుపడ్డాయి.
Latest Multibagger Stocks 2024: రూ. 2 నుంచి 405 కు పెరిగిన షేరు.. ఐదేళ్లలోనే 35 వేల శాతం రిటర్న్స్.. వరుసగా అప్పర్‌సర్క్యూటే..!
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరంలో కూడా లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదురైనా తర్వాత పుంజుకుంటున్నాయి. ఇక ఇదే సమయంలో కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తున్నాయి. కొన్ని దీర్ఘకాలంలో పుంజుకుంటుంటే ఇంకొన్నేమో షార్ట్ టర్మ్‌లోనూ మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్ మాత్రం స్థిర రాబడి అందిస్తూ వస్తోంది. దీని గురించి చూద్దాం.
ముల్తీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్- Multi Projects Share:
Stock Market Updates: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారా? సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెట్టినప్పుడే మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక నిపుణుల సలహా కూడా తీసుకోవాలి. అయితే కొంతకాలంగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో స్థిరంగా లాభాలు అందిస్తున్న ఒక స్టాక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) ఎక్కువ వాటా కలిగి ఉన్న స్టాక్ హజూర్ ముల్తీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇది గత 6 నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ రూ. 126 నుంచి రూ. 380 లెవెల్స్‌కు చేరింది. ఏకంగా 200 శాతం రిటర్న్స్ షేర్ హోల్డర్లకు ఇచ్చింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఇంకా ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
ప్రస్తుతం హజూర్ ముల్తీ షేరు రూ. 405 వద్ద ఉంది. ఇటీవల వరుసగా అప్పర్‌సర్క్యూట్ కొడతోంది. ఈ క్రమంలో 5 రోజుల్లోనే 12 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2024, జనవరి 31 నుంచి వరుసగా 5 రోజుల్లో అప్పర్‌సర్క్యూట్ తాకింది. గత 6 నెలల్లో చూస్తే ఈ షేరు రూ. 126 నుంచి రూ. 380 కి చేరింది. ఇక్కడ 200 శాతం మేర లాభాలు అందించింది. Latest Multibagger Stocks 2024:
గత ఏడాది వ్యవధిలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ. 103.50 నుంచి రూ. 380కి చేరింది. ఈ సమయంలో 265 శాతం పుంజుకుంది. గత ఐదేళ్లలో మాత్రం ఏకంగా 35,700 శాతానికిపైగా పుంజుకోవడం విశేషం. ఈ క్రమంలో రూ. 2 నుంచి రూ. 405 కు పెరిగింది.
ఇక ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసినట్లయితే 6 నెలల కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు రూ. 3 లక్షలొచ్చాయి. ఏడాది కిందట ఇందులో లక్ష ఇన్వెస్ట్ చేసిన వారి సంపద ఇప్పుడు రూ. 3.65 లక్షలకు పెరిగింది. ఇదే ఐదేళ్ల కిందట ఈ స్టాక్‌లో లక్ష పెట్టుబడి పెడితే రికార్డు స్థాయిలో రూ. 3.67 కోట్లకు సంపద పెరిగిందని చెప్పొచ్చు.
హజూర్ ముల్తీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (HMPL) కంపెనీ విషయానికి వస్తే ఇది ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ. 1992లో ప్రారంభమైంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్‌ఫ్రా షేర్లు కూడా పుంజుకుంటున్నాయి. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 428.70 కాగా కిందటి సెషన్‌లో ఈ విలువను తాకింది. కనిష్ట విలువ రూ. 78.01 కాగా.. మార్కెట్ విలువ రూ. 755.99 కోట్లుగా ఉంది.
టైన్ అగ్రో లిమిటెడ్ -Tine Agro Ltd:
Latest Multibagger Stocks 2024 : బోనస్ షేర్లతో పాటు స్టాక్ స్ప్లిట్ ను ప్రకటించిన మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లోనే ఏకంగా 3,059 శాతం లాభాలు..
ట్రేడింగ్ మరియూ డిస్ట్రిబ్యూటర్స్ పరిశ్రమకు స్మాల్ క్యాప్ కంపెనీ టైన్ అగ్రో లిమిటెడ్(Tine Agro Ltd) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ లో 2 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి షేరు ధర రూ 275.20 వద్ద స్థిరపడింది. కంపెనీ 1:1 బోనస్ షేర్లు, 1:10 స్టాక్ స్ప్లిట్ ను ఫిబ్రవరి 8న ప్రకటించిన తర్వాత షేరు ధర 52 వారాల గరిష్టాన్ని తాకింది. గత 6 నెలల్లోనే టైన్ ఆగ్రో షేర్లు ఏకంగా 3,059 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి.
1:10 స్టాక్ స్ప్లిట్:
ఫిబ్రవరి 8 నాటి కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ ప్రకారం, రూ. 10 ముఖ విలుగ కలిగిన ఒక్కో ఈక్విటి షేరను రూ. 1 ముఖ విలువతో 10 షేర్లుగా విభజించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే దీనికి ఇంకా రికార్డు తేదీని ఖరారు చేయాల్సి ఉంది. స్టాక్ ధరను సరసమైనది చేసి, లిక్విడిటీ పెంచుకోవడానికి కంపెనీలు స్టాక్ స్ప్లిట్ చేస్తుంటాయి. దీని ద్వారా షెర్ల సంఖ్య పెరుగుతుంది. అయితే మార్కెట్ విలువ మాత్రం అలాగే ఉంటుంది. రూ. 275 గా ఉన్న షేరు ధర 1:10 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 27.5 గా మారుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లకు అతి తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.Latest Multibagger Stocks 2024:
1:1 బోనస్ షేర్లు:
స్టాక్ స్ప్లిట్ తో పాటు 1:1 నిష్పత్తిల్లో బోనస్ షేర్లను కూడా జారీ చేయనున్నట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. అంటే ఒక్క షేరు కలిగి ఉన్న షేర్ హోల్డర్లకు మరొక షేరను ఉచితంగా అందించనుంది. దీనికి కూడా రికార్డు తేదిని త్వరలో ఖరారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
స్టాక్ పనితీరు, రాబడి:
బీఎస్ఈలో టైన్ అగ్రో షేర్ల 52 వారాల గరిష్ట ధర రూ. 275.20 గా ఉంది. ఇది శుక్రవారమే నమోదైంది. 52 వారాల కనిష్ట ధర రూ. 6.70. ఫిబ్రవరి 2 నుండి టైన్ ఆగ్రో షేర్లు వరుసగా 52 వారాల గరిష్ట స్థాయి, అప్పర్ సర్క్యూట్‌లను తాకుతున్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 691.12 కోట్లుగా ఉంది. షేర్లు గత ఒక్క సంవత్సరంలోనే 2,852 శాతం రాబడిని అందించాయి. గత రెండేళ్లలో 1005 శాతం పుంజుకున్నాయి.
Also follow below Links:👇
Best Penny Stocks-2024 | ఐదు రోజుల్లోనే 65 శాతం పెరిగిన పెన్నీ స్టాక్ .. – Lsrallinonenews.com
Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd-24 (lsrupdates.com)
Latest Multibagger Stocks 2024 : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన (lsrallinonenews.com)
Latest Multibagger Stocks 2024 # Latest Multibagger Stocks 2024 Latest Multibagger Stocks 2024:
[…] రిటర్న్స్ అందించిన కంపెనీల్లో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (Hazo…ఒకటి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ స్టాక్ […]