రోహిత్‌ని హార్దిక్ పాండ్యా అవమానించాడా? | Rohit Sharma avoids Hardik Pandya hug? gets into animated chat with MI captain after GT Loss-IPL 2024
Rohit Sharma avoids Hardik Pandya hug? gets into animated chat with MI captain after GT Loss: గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిన తర్వాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్ హార్దిక్ పాండ్య వెనుక నుంచి వాటేసుకున్నాడు. ఇది నచ్చని రోహిత్.. వెంటనే హగ్ నుంచి విడిపించుకొని కెప్టెన్‌తో ఏదో సీరియస్‌గా మాట్లాడాడు. రోహిత్ చెబుతుండగా.. చాలా వరకు వినడానికే హార్దిక్ పరిమితమయ్యాడు. కానీ అతడి ముఖంలో మాత్రం రంగులు మారిపోయాయి.
ముఖ్యాంశాలు:
- రోహిత్ శర్మను వెనుక నుంచి హగ్ చేసుకున్న హార్దిక్ పాండ్య
- వెంటనే విడిపించుకున్న హిట్ మ్యాన్
- సీరియస్ మాట్లాడని రోహిత్.. ఇద్దరి మధ్య గొడవంటూ ప్రచారం
Rohit Sharma avoids Hardik Pandya hug?
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యకు నాయకత్వ పగ్గాలు అప్పగించిన నాటి నుంచి.. వారిద్దరూ ఐపీఎల్ సమయంలో ఒకరితో మరొకరు ఎలా మెలుగుతారనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ సమయంలో.. ఫలితం కంటే ఎక్కువగా హార్దిక్ పాండ్యపైనే ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారంటే అతిశయోక్తి కాదు.
ముంబై ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లమని హార్దిక్ చెప్పిన తీరు.. ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. పదేళ్లకుపైగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. హార్దిక్ సూచనతో చాలా సంవత్సరాల తర్వాత బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆకాశ్ అంబానీ, రషీద్ ఖాన్ తదితరులతో రోహిత్ శర్మ మాట్లాడుతుండగా.. హార్దిక్ పాండ్య వచ్చి వెనుక నుంచి హిట్ మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. భయ్యా.. అంటూ తాను హగ్ చేసుకుంటే.. రోహిత్ అరే యార్.. అంటూ ప్రేమగా మాట్లాడుతాడని హార్దిక్ ఎక్స్పెక్ట్ చేశాడు కాబోలు. కానీ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న హిట్ మ్యాన్‌కు మాత్రం ఇది చిరాకు తెప్పించింది.
Why is this MDC Chapri trying to hug everyone? Rohit should have slapped this MDC .
HARDIK PANDYA KI MKB pic.twitter.com/vEQHmNhYtt
— Jyran (@Jyran45) March 24, 2024
వెంటనే హార్దిక్ కౌగిలి నుంచి విడిపించుకున్న రోహిత్.. వెనక్కి తిరిగి హార్దిక్‌తో సీరియస్‌గా ఏదో విషయమై మాట్లాడాడు. దీంతో ముంబై కెప్టెన్ ముఖంలో హవభావాలు మారిపోయాయి. రోహిత్ శర్మ సీరియస్‌గా మాట్లాడుతుంటే.. హార్దిక్ దాదాపుగా ఏమీ మాట్లాడకుండా అలా వింటూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో.. నెటిజన్లు వీడియోను పోస్ట్ చేసి.. రోహిత్, హర్దిక్ మధ్య సంబంధాలు బాగోలేనట్టున్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ కోసం మార్చి 18న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరగా.. రెండు రోజుల తర్వాత రోహిత్ శర్మను హార్దిక్ పాండ్య హగ్ చేసుకుంటున్న దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే రోహిత్ షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూశాడని కానీ హార్దిక్ కావాలనే హగ్ చేసుకున్నాడని.. వాళ్లిద్దరి మధ్య సంబంధాలు బాగోలేవని.. ఏదో తేడా కొడుతోందని ఫ్యాన్స్ గుసగుసలాడుకోవడం గమనార్హం.
ముంబై జట్టును సుదీర్ఘ కాలంపాటు ముందుకు నడిపించిన రోహిత్ శర్మను పక్కనబెట్టేసి.. హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడం హిట్ మ్యాన్ అభిమానులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. రోహిత్ ఫ్యాన్స్‌ను చల్లబరిచేందుకు హార్దిక్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వారు మాత్రం పాండ్యను చీటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
రోహిత్‌ని హార్దిక్ పాండ్యా అవమానించాడా?
చూస్తుంటే… హార్దిక్‌కు టైమ్ కలిసి రావడం లేదని అనిపిస్తోంది! లాస్ట్ రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్‌కి ఆడిన అతను.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌లోకి వచ్చేశాడు. అది గుజరాత్ టైటాన్స్ అభిమానులకు నచ్చలేదు. ఇక ముంబై ఇండియన్స్‌కి ఎప్పటి నుంచో కెప్టెన్‌గా ఉంటూ, టీమ్‌కి 5 ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను సారథ్య బాధ్యతలను తప్పించి, పాండ్యా చేతిలో పెట్టడం.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఫలితంగా.. రెండు జట్ల అభిమానులు.. హార్దిక్ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ ఘటన ఓ ఉదాహరణ.
Rohit Hardik viral video : ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఓవర్ల మధ్యలో ఫీల్డింగ్ సెట్ చేశాడు హార్దిక్ పాండ్యా. రోహిత్ శర్మను లాంగ్ ఆఫ్ దగ్గరికి వెళ్లాలని చెప్పాడు. తనకే చెబుతున్నాడని రోహిత్‌కి అర్థమవ్వడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత.. హార్దిక్ చెప్పిన చోట నిలబడ్డాడు రోహిత్. సాధారణంగా.. ఇంతకాలం సారథిగా ఉన్న రోహిత్, ఇప్పుడు ఒకరు చెబుతుంటే పని చేయడాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో.. రోహిత్‌కు పాండ్యా చెప్పిన తీరు నెటిజన్లకు నచ్చలేదు. రోహిత్‌ని పాండ్యా అవమానించాడని అందరు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :
Hardik Pandya sent Rohit Sharma to boundary line
After a long time I saw Rohit Sharma fielding at the boundary line #MIvsGT #GTvMI #IPL2024 pic.twitter.com/Oe4wdAt1hU
— Krish Na (@iamsai494) March 24, 2024
ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు గడిచేకొద్దీ రోహిత్, హార్దిక్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రచారాలు జరుగుతాయో చూడాలి .
Also Read 👇👇
Rohit Sharma avoids Hardik Pandya hug? #Rohit Sharma Vs Hardik Pandya
GT vs MI, IPL 2024