ఐపీఎల్ 2024 లైవ్ అప్‌డేట్స్..!| IPL 2024 Live Updates-PBKS vs MI Live
IPL 2024 Live Updates-PBKS vs MI Live: పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్, తిలక్ వర్మ, రోహిత్ శర్మ చెలరేగడంతో పంజాబ్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
23:38(IST)
Punjab vs Mumbai: పంజాబ్ ఆలౌట్.. ముంబయి విజయం
23:36(157)
Punjab vs Mumbai సిక్సర్ బాదిన రబాడ.. ఉత్కంఠగా మారిన మ్యాచ్
• హార్దిక్ వేసిన 19 ఓవర్ లో ఐదో బంతికి రబాడ (7) సిక్సర్ బాదాడు.
• 19 ఓవర్లకు స్కోరు 181/9.
• పంజాబ్ విజయానికి 6 బంతులలో 12 పరుగులు అవసరం.
23:32(IST)
Punjab vs. Mumbai: తొమ్మిదో వికెట్ కోల్పోయిన పంజాబ్
• హర్ ప్రీత్ బ్రార్ (21) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య వేసిన 18.34 ఓవర్కు నబీకి క్యాచ్ ఇచ్చాడు.
23:23(IST)
Punjab vs Mumbai:ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్
• అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.
• కౌయెట్టీ వేసిన 18 ఓవర్లో తొలి బంతికి అతడు నబీకి క్యాచ్ ఇచ్చాడు.
• దీంతో 168 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది..
22:22(IST)
Punjab vs Mumbai కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బుమ్రా
• బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
• అతడు వేసిన 17 ఓవర్ లో మూడు పరుగులే వచ్చాయి.
• 17 ఓవర్లకు స్కోరు 168/7. అశుతోష్ శర్మ (61), హర్ ప్రీత్ (17) పరుగులతో ఉన్నారు..
23:17(IST)
Punjab vs Mumbai:
• ఆకాశ్ మధ్వాల్ వేసిన 16 ఓవర్లో 24 పరుగులు వచ్చాయి.
• అశుతోష్ శర్మ (59) వరుసగా రెండు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
• హర్ ప్రీత్ బ్రార్ (16) కూడా ఓ సిక్స్ కొట్టాడు..
• ఈ ఓవర్ లో మూడు వైడ్లు, ఒక నో బాల్ కూడా వచ్చాయి.
• 16 ఓవర్లకు స్కోరు 165/7.
23:16(1ST)
Punjab vs Mumbai: 15 ఓవర్.. మూడు ఫోర్లు బాదిన పంజాబ్ బ్యాటర్లు
• గెరాల్డ్ కొయెట్టీ వేసిన 15 ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి.
• తొలి రెండు బంతులను హర్ ప్రీత్ బ్రార్ (10) బౌండరీకి పంపాడు.
• ఐదో బంతికి ఆశుతోష్ శర్మ (47) బౌండరీ బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు.
• 15 ఓవర్లకు స్కోరు 141/7.
23:01(IST)
Punjab vs Mumbai దూకుడుగా ఆడుతున్న అశుతోష్ శర్మ
• అశుతోష్ శర్మ (43: 19 బంతుల్లో) దూకుడు ప్రదర్శిస్తున్నాడు.
• షెఫర్డ్ వేసిన 14 ఓవర్లో తొలి బంతిని స్టాండ్స్లోకి పంపాడు.
• 14 ఓవర్లకు స్కోరు 128/7.
22:56(IST)
Punjab vs Mumbai:
• బుమ్రా వేసిన 13 ఓవర్లో తొలి బంతికి శశాంక్ ఔటయ్యాడు.
• తర్వాత ఇదే ఓవర్ లో ఐదో బంతి నో బాల్ కాగా.. ఫ్రీ హిట్ను అశుతోష్ శర్మ (36) సిక్సర్గా మలిచాడు.
• 13 ఓవర్లకు స్కోరు 120/7. హర్ ప్రీత్ బ్రార్ (1) క్రీజులో ఉన్నాడు.
22:45(IST)
Punjab vs Mumbai: శశాంక్ సింగ్ (41) ఔట్.. పంజాబ్ ఏడో వికెట్
• పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. శశాంక్ సింగ్ (41, 25 బంతుల్లో) ఔటయ్యాడు.
• బుమ్రా వేసిన 13 ఓవర్లో తొలి బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చాడు.
22:43(1ST)
Punjab vs Mumbai II ఓవర్లకు పంజాబ్ స్కోర్ 100/6
• షెఫర్డ్ వేసిన రెండో బంతికి ఫోర్, ఐదో బంతికి సిక్స్ బాదిన అశుతోష్ శర్మ
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగుల 13
• పంజాబ్ విజయ లక్ష్యం 54 బంతుల్లో 93 పరుగులు
22:39(1ST)
జితేశ్ శర్మ ఔట్.. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 87/6
మధ్వాల్ వేసిన రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన జితేశ్ శర్మ(9)
• క్రీజులోకి వచ్చిన అశుతోష్ (9)
• ఐదో బంతికి సిక్స్ బాదిన అశుతోష్ శర్మ
• ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 11
22:25(1ST)
Punjab vs Mumbai వరుసగా రెండు సిక్స్లు బాదిన శశాంక్ సింగ్
• 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 70/5
• ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 15
• క్రీజులో శశాంక్ సింగ్ (35), జితేశ్ శర్మ (9)
22:25(IST)
Punjab vs Mumbai ఒకే ఓవర్లో మూడు వైడ్లు వేసిన హార్దిక్
• 8 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 60/5
• ఐదో బంతికి ఫోర్ బాదిన జితేశ్
• § ໐ (21), 23 (7)
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 10
22:16(IST)
Punjab vs Mumbai: హర్హీత్ ఔట్.. పంజాబ్ ఐదో వికెట్ డౌన్
• పంజాబ్ సగం వికెట్లు కోల్పోయింది. హర్ ప్రీత్ సింగ్ భాటియా (13) ఔటయ్యాడు..
• శ్రేయస్ గోపాల్ వేసిన తొలి బంతికి శశాంక్ సింగ్ (20) సిక్స్ బాదాడు.
• ఐదో బంతికి హర్ ప్రీత్ బౌలర్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు.
• 7 ఓవర్లకు స్కోరు 50/5. జితేశ్ శర్మ (1), శశాంక్ సింగ్ (20) పరుగులతో ఉన్నారు.
22:14(IST)
Punjab vs Mumbai కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్య
• హార్దిక్ పాండ్య చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
• అతడు వేసిన ఆరో ఓవర్లో ఒకే ఒక్క సింగిల్ వచ్చింది.
• పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ స్కోరు 40/4 హర్ ప్రీత్ సింగ్ భాటియా (12), శశాంక్ (12) క్రీజులో ఉన్నారు.
22:05(IST)
Punjab vs Mumbai: నిలకడగా అడుతున్న శశాంక్, హర్త్
పంజాబ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.
• బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ఏడు పరుగులు రాబట్టారు.
ఆకాశ్ మధ్వాల్ వేసిన ఐదో ఓవర్ లో 11 పరుగులు రాగా.. శశాంక్ (11), హర్ ప్రీత్ సింగ్ భాటియా (12) చెరో బౌండరీ బాదారు.
• 5 ఓవర్లకు స్కోరు 39/4
21:53(IST)
Punjab vs Mumbai: 14 పరుగులకే పంజాబ్ నాలుగు వికెట్లు డౌన్
పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. గెరాల్డ్ కొయెట్జ్ వేసిన 2.1 ఓవర్కు లివింగ్టన్ (1) బౌలర్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో 14 పరుగులకే పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
• తర్వాత క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ (5) చివరి బంతికి బౌండరీ రాబట్టాడు.
• 3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 21/4.
21:52(187)
Punjab vs Mumbai ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా
• బుమ్రా ఈ ఓవర్ లో మరో వికెట్ పడగొట్టాడు.
అతడు వేసిన 1.6 ఓవర్కు సామ్ కరన్ (6) వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చాడు.
21:48(IST)
Punjab vs Mumbai: బుమ్రా సూపర్ యార్కర్.. రొసోవ్ క్లీన్బోల్డ్
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. రిలీ రాసోవ్ (1) ఔటయ్యాడు.
బుమ్రా (1.4 ఓవర్) సూపర్ యార్కర్ తో అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు..
21:45(IST) Punjab vs Mumbai: తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన పంజాబ్
193 పరుగుల టార్గెట్ ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్కు షాక్ తగిలింది.
కొయెట్టీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బంతికి ప్రభ్స్మిన్ సింగ్ (0) ఔటయ్యాడు.
అతడు ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చాడు.
• 1 ఓవరు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 12/1
21:24(IST)
Punjab vs Mumbai: సూర్యకుమార్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ 193
• పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి భారీ స్కోరు చేసింది.
• నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
• సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు.
• రోహిత్ శర్మ (36; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు), తిలక్ వర్మ (34* 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడారు. హార్దిక్ పాండ్య (10), టిమ్ డేవిడ్ (14), ఇషాన్ కిషన్ (8) పరుగులు చేశారు.
• పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్ 2, రబాడ ఒక వికెట్ పడగొట్టారు.
21:23(1ST)
Punjab vs Mumbai షెఫర్డ్ (I) ఔట్.. ముంబయి ఆరో వికెట్
ముంబయి ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 19.5 ఓవర్కు రొమారియో షెఫర్డ్ (1) శశాంకు క్యాచ్ ఇచ్చాడు.
21:20(IST)
Punjab vs Mumbai: చివరి ఓవర్.. ఐదో వికెట్ కోల్పోయిన ముంబయి
• ముంబయి ఐదో వికెట్ కోల్పోయింది.
• హర్షల్ పటేల్ వేసిన 19.2 ఓవర్కు టిమ్ డేవిడ్ (14) సామ్ కరన్కు చిక్కాడు.
21:17(IST)
Punjab vs Mumbai దూకుడుగా ఆడుతున్న టిమ్ డేవిడ్
• టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడుతున్నాడు.
సామ్ కరన్ వేసిన 19 ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు.
19 ఓవర్లకు స్కోరు 185/4. డేవిడ్ (14), తిలక్ వర్మ (33) పరుగులతో ఉన్నారు.
21:09(IST)
Punjab vs Mumbai: హార్దిక్ పాండ్య (10) ఔట్.. ముంబయి నాలుగో వికెట్
• ముంబయి నాలుగో వికెట్ కోల్పోయింది.
• హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్ లో చివరి బంతికి హార్దిక్ పాండ్య (10) హర్ ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చాడు.
• ఈ ఓవర్ లో రెండో బంతికి తిలక్ వర్మ (32) సిక్స్ బాదాడు.
• 18 ఓవర్లకు స్కోరు 167/4.
21:00(IST)
Punjab vs Mumbai: సూర్యకుమార్ యాదవ్ (78) ఔట్
• 148 పరుగుల వద్ద ముంబయి మూడో వికెట్ కోల్పోయింది.
• సూర్యకుమార్ యాదవ్ (78) ఔటయ్యాడు.
• సామ్ కరన్ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి ప్రభ్స్మిన్ సింగ్కు క్యాచ్ ఇచ్చాడు.
• తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (7) చివరి బంతికి సిక్సర్ బాదాడు.
• 17 ఓవర్లకు స్కోరు 156/3. తిలక్ వర్మ (24) పరుగులతో ఉన్నాడు.
20:59(IST)
Punjab vs Mumbai: దూకుడు పెంచిన ముంబయి బ్యాటర్లు
• ముంబయి బ్యాటర్లు దూకుడు పెంచారు.
• రబాడ వేసిన 16 ఓవర్లో 18 పరుగులు రాబట్టారు.
• సూర్యకుమార్ యాదవ్ (78) వరుసగా ఫోర్, సిక్స్ బాదగా.. చివరి బంతిని తిలక్ వర్మ (23) స్టాండ్స్లో కి పంపాడు.
• 16 ఓవర్లకు ముంబయి స్కోరు 148/2. తిలక్ వర్మ (23) పరుగులతో ఉన్నాడు..
20:51(IST)
Punjab vs Mumbai: వరుసగా రెండు ఫోర్లు బాదిన తిలక్ వర్మ
• రబాడ వేసిన 14 ఓవర్ లో ఆరు సింగిల్స్ వచ్చాయి.
• అర్షదీప్ సింగ్ వేసిన 15 ఓవర్లో మూడు, నాలుగు బంతులకు తిలక్ వర్మ (17) ఫోర్లు బాదాడు.
• ఇదే ఓవర్ లో చివరి బంతికి సూర్యకుమార్ (67) బౌండరీ రాబట్టాడు.
• 15 ఓవర్లకు స్కోరు 125/2. సూర్యకుమార్ యాదవ్ (63) పరుగులతో ఉన్నాడు.
20:39(IST)
Punjab vs Mumbai: 13 ఓవర్…ఎనిమిది పరుగులు
• హర్ ప్రీత్ బ్రార్ వేసిన 13 ఓవర్ లో ఎనిమిది పరుగులు వచ్చాయి.
• 13 ఓవర్లకు స్కోరు 109/2. తిలక్ వర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (59) క్రీజులో ఉన్నారు.
20:29(1ST)
Punjab vs Mumbai: రోహిత్ శర్మ (36) ఔట్.. ముంబయి రెండో వికెట్
• ముంబయి 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
• సామ్ కరన్ వేసిన 12 ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ శర్మ (36).. హర్ ప్రీత్ బ్రారు క్యాచ్ ఇచ్చాడు.
• 12 ఓవర్లకు స్కోరు 101/2. సూర్యకుమార్ (55), తిలక్ వర్మ (1) క్రీజులో ఉన్నారు.
20:26(IST)
Punjab vs Mumbai: రోహిత్ సెక్స్.. 100కు చేరువలో ముంబయి
• హర్షల్ పటేల్ వేసిన 11 ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
• నాలుగో బంతికి రోహిత్ శర్మ (36) లాంగాన్ మీదుగా సిక్స్ బాదాడు.
• 11 ఓవర్లకు స్కోరు 96/1 సూర్యకుమార్ యాదవ్ (51) పరుగులతో ఉన్నాడు.
20:22(IST)
Punjab vs Mumbai: సూర్యకుమార్ హాఫ్ సెంచరీ
వన్లైన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
20:21(IST)
Punjab vs Mumbai: 10 ఓవర్లు పూర్తి.. భారీ స్కోరుపై కన్నేసిన ముంబయి
• ముంబయి భారీ స్కోరుపై కన్నేసింది.
• 10 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఒకే వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది.
• లివింగ్టన్ వేసిన 10 ఓవర్ లో నాలుగో బంతికి సూర్యకుమార్ యాదవ్ (49) క్రీజు వదిలి బయటకు సిక్సర్ బాదాడు.
• రోహిత్ (29) పరుగులతో ఉన్నాడు.
20:14(IST)
Punjab vs Mumbai:అర్థ శతకం దిశగా సూర్యకుమార్ యాదవ్
• సూర్యకుమార్ యాదవ్ (41) అర్థ శతకం దిశగా సాగుతున్నాడు.
• హరీప్రీత్ బ్రార్ వేసిన తొమ్మిదో ఓవర్ లో ఐదో బంతిని స్కై బౌండరీకి పంపాడు.
9 ఓవర్లకు ముంబయి స్కోరు 77/1. రోహిత్ శర్మ (28) పరుగులతో ఉన్నాడు.
20:11(IST)
Punjab vs Mumbai: తన ట్రేడ్ మార్క్ షాట్తో సిక్స్ కొట్టిన సూర్యకుమార్
• రబాడ వేసిన ఎనిమిదో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
• సూర్యకుమార్ యాదవ్ (33) ఐదో బంతికి ఫైన్ లెగ్ మీదుగా తన ట్రేడ్ మార్క్ షాట్తో సిక్స్ బాదాడు.
• 8 ఓవర్లకు స్కోరు 63/1. రోహిత్ శర్మ (27) పరుగులతో ఉన్నాడు.
20:04(IST)
Punjab vs Mumbai: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హప్రీత్ బ్రార్
• హర్ ప్రీత్ బ్రార్ తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
• ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసి నాలుగు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు.
• 7 ఓవర్లకు స్కోరు 58/1
20:01(IST)
Punjab vs Mumbai: సూర్య ఫోర్.. రోహిత్ సిక్సర్తో పవర్ ప్లే పూర్తి
• ముంబయి బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు.
• సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్ లో 11 పరుగులు రాబట్టారు.
• రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ (22) బౌండరీ బాదాడు.
చివరి బంతిని రోహిత్ శర్మ (24) సిక్సర్గా మలిచాడు.
పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 54/1
19:57(IST)
Punjab vs Mumbai: రోహిత్ శర్మ
• హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి.
• తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ (17) ఫోర్ కొట్టాడు.
• నాలుగో బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించాడు.
• కానీ, ముంబయి రివ్యూ తీసుకుని సానుకూల ఫలితం సాధించింది.
• 5 ఓవర్లకు స్కోరు 43/1. రోహిత్ (18) పరుగులతో ఉన్నాడు.
19:50(IST)
Punjab vs Mumbai: అర్ష్ దీప్ బౌలింగ్.. రోహిత్ సూపర్ సిక్సర్
• అర్ష్దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి.
• ఈ ఓవర్ లో మూడు సింగిల్స్ రావడంతోపాటు మూడో బంతిని రోహిత్ శర్మ (17) స్టాండ్లోకి పంపాడు.
• 4 ఓవర్లకు స్కోరు 36/1. సూర్యకుమార్ (11) పరుగులతో ఉన్నాడు.
19:45(IST)
Punjab vs Mumbai: ఇషాన్ ఔట్.. సూర్య బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు
ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
తొలి రెండు బంతులు పరుగులేమీ చేయని అతడు.. తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
3 ఓవర్లకు స్కోరు 27/1. రోహిత్ శర్మ (10), సూర్యకుమార్ (9) పరుగులతో ఉన్నారు.
19:40(IST)
Punjab vs Mumbai: తొలి వికెట్ కోల్పోయిన ముంబయి
• ముంబయికి షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (8) ఔటయ్యాడు.
- రబాడ వేసిన 2.1 ఓవర్కు హర్ ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చాడు.
19:39(IST)
Punjab vs Mumbai: రెండో ఓవర్.. రోహిత్, ఇషాన్ చెర్ ఫోర్
• అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
• రోహిత్ (10), ఇషాన్ కిషన్ (8) చెరో ఫోర్ కొట్టారు.
• 2 ఓవర్లకు స్కోరు 18/0.
19:35(IST)
Punjab vs Mumbai: ప్రారంభమైన మ్యాచ్.. ముంబయి బ్యాటింగ్
• టాస్ ఓడి ముంబయి బ్యాటింగ్కు దిగింది.
• లివింగ్టన్ వేసిన తొలి ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి.
• చివరి బంతికి రోహిత్ శర్మ (5) బౌండరీ బాదాడు. ఇషాన్ కిషన్ (2) పరుగులతో ఉన్నాడు.
19:16(IST)
Punjab vs Mumbai: ఇరుజట్ల ఇంపాక్ట్ సబట్యూట్లు వీరే
ముంబయి: ఆకాశ్ మధ్వాల్, నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, నమన్ ధీర్. పంజాబ్: రాహుల్ చాహర్, విధ్వత్ కావేరప్ప, హర్ ప్రీత్ భాటియా, శివమ్ సింగ్, రిషి ధావన్.
పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే సామ్ కరన్ (కెప్టెన్), రిలీ రోసోవ్, ప్రభ్స్మిన్ సింగ్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్టన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్షదీప్ సింగ్.
19:11(IST) Punjab vs Mumbai:
హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కొయెట్టీ, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.
19:02(IST) Punjab vs Mumbai:
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్లో ముంబయి తలపడనుంది. పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
18:58(IST) ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు:
రోహిత్ శర్మ ఐపీఎల్ లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్ రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని, ఇది భారత క్రికెట్కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.
18:40(IST) ముంబయి గెలవాలంటే..
హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్ ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి జట్టుకు ఐపీఎల్ 17వ సీజన్ అంతగా కలిసి రావడం లేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్లో ముల్లాన్పుర వేదికగా ముంబయి తలపడనుంది. ఈక్రమంలో ముంబయి మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య పామ్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు.
18:35(IST) Punjab vs Mumbai:
చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ.. ధోనీ తర్వాత రెండో ఆటగాడిగా
• పంజాబ్లో జరిగే మ్యాచ్లో ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు.
• లీగ్ చరిత్రలో 250వ మ్యాచ్లు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలవనున్నాడు.
- ఎంఎస్ ధోనీ (256).. రోహిత్ కంటే ముందున్నాడు.
18:35(IST) Punjab vs Mumbai: ఈ సీజన్లో రెండు జట్ల పరిస్థితి ఇలా
• ముంబయి, పంజాబ్ జట్ల పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం బాగోలేదు.
• రెండు జట్లు ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు రెండేసి మ్యాచ్లు నెగ్గి మిగిలిన మ్యాచ్లల్లో ఓటమిపాలయ్యాయి.
• పంజాబ్ ఎనిమిదో స్థానంలో, ముంబయి తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
18:34(IST) Punjab vs Mumbai: ఇరుజట్ల మధ్య హోరాహోరీ
• ఐపీఎల్ లో ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 31 మ్యాచ్లు జరిగాయి.
• ముంబయి 16 మ్యాచ్లు, పంజాబ్ 15 మ్యాచ్లు గెలిచాయి.
• గత ఏడు మ్యాచ్ల్లో ముంబయి 4, పంజాబ్ మూడింట విజయం సాధించాయి.
Punjab vs Mumbai Live Updates
IPL 2024 Live Updates-PBKS vs MI Live IPL 2024 Live Updates-PBKS vs MI Live
IPL 2024 Live Updates-PBKS vs MI Live #IPL 2024 Live Updates-PBKS vs MI Live
IPL 2024 Live Updates-PBKS vs MI LiveIPL 2024 Live Updates-PBKS vs MI Live IPL 2024 Live Updates-PBKS vs MI Live IPL 2024 Live Updates-PBKS vs MI Live