Live: ఐపీఎల్ 2024 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu: ఐపీఎల్ 2024లో 41వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరిగింది .
హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పై విజయం సాధించింది
23:14(IST)
SRH vs RCB: ఎట్టకేలకు బెంగళూరు విజయం.. హైదరాబాద్ గెలుపు
• వరుసగా ఆరు మ్యాచ్లో ఓడి డీలాపడిన బెంగళూరు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది.
• హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో నెగ్గింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
• ఈ లక్ష్యఛేదనలో హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 171 పరుగులే చేసింది.
23:05(1ST)
SRH vs RCB: హైదరాబాద్ ఓటమి ఖాయం
• హైదరాబాద్ ఓటమి ఖాయమైపోయింది.
• 19 ఓవర్లకు స్కోరు 163/8
23:02(EST)
SRH vs RCB: షాబాజ్ సిక్స్.. ఉనద్కత్ ఫోర్
• ఫెర్గూసన్ వేసిన 18 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.
తొలి బంతికి షాబాజ్ అహ్మద్ (33) సిక్సర్ బాదగా.. ఐదో బంతికి ఉనద్కత్ (7) బౌండరీ రాబట్టాడు.
• 18 ఓవర్లకు స్కోరు 159/8, హైదరాబాద్ విజయానికి 12 బంతుల్లో 48 పరుగులు అవసరం.
22:58(IST)
SRH vs RCB: కట్టదిట్టంగా బౌలింగ్ చేసిన సిరాజ్
• సిరాజ్ 17 ఓవర్ వేసి మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు.
• 17 ఓవర్లకు స్కోరు 144/8, షాబాజ్ అహ్మద్ (24), ఉనద్కత్ (1) క్రీజులో ఉన్నారు.
22:52(IST)
SRH vs RCB: భువనేశ్వర్ కుమార్ ఔట్..
• హైదరాబాద్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ (13) ఔటయ్యాడు.
కామెరూన్ గ్రీన్ వేసిన 16 ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన భువీ.. ఐదో బంతికి సిరాజ్కు క్యాచ్ ఇచ్చాడు.
• 16 ఓవర్లకు స్కోరు 141/8 జయేవ్ ఉనద్కత్ (0), షాబాజ్ అహ్మద్ (22) క్రీజులో ఉన్నారు.
22:46(IST)
SRH vs RCB: 15వ ఓవర్.. బౌండరీ బాదిన భువనేశ్వర్
• కర్డ్ శర్మ వేసిన 15వ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
• ఐదో బంతిని భువనేశ్వర్ కుమార్ (5) బౌండరీకి పంపాడు.
15 ఓవర్లకు స్కోరు 132/7. షాబాజ్ అహ్మద్ (21) పరుగులతో ఉన్నాడు.
22:40(IST)
SRH vs RCB: గ్రీన్ సూపర్ బౌలింగ్.. కమిన్స్ ఔట్
• గ్రీన్ వేసిన తొలి బంతి వైడ్
• తర్వాతి బంతికి క్యాచ్ ఔటైన కమిన్స్ (31: 15 బంతుల్లో)
• క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్
ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు wd, w.0,0,11,0
14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 126/7
22:35(187)
SRH vs RCB:మరోవికెట్ కోల్పోయిన హైదరాబాద్.. కమిన్స్ ఔట్
22:33(IST)
SRH vs RCB: 13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 123/6
• 13వ ఓవర్ వేసిన యశ్ దయాల్
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 4
• క్రీజులో కమిన్స్ (31), షాబాద్ అహ్మద్ (19)
• హైదరాబాద్ లక్ష్యం 42 బంతుల్లో 84
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
22:25(IST)
SRH vs RCB: దూకుడుగా ఆడుతున్న కమిన్స్
• 12 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 119/6
• కర్డ్ శర్మ వేసిన రెండో బంతికి ఫోర్ కొట్టిన కమిన్స్
• మూడో బంతికి సిక్స్ కొట్టిన కమిన్స్
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 15
22:25(IST)
SRH vs RCB: వరుసగా రెండు సిక్స్లు బాదిన కమిన్స్
• 11 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 104/6
• 11వ ఓవర్ వేసిన స్వప్నిల్
చివరి రెండు బంతులను సిక్స్లు బాదిన కమిన్స్
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 0.1,11,6,6
• క్రీజులో షాబాజ్ అహ్మద్ (15), ప్యాట్ కమిన్స్ (16)
22:21(IST)
SRH vs RCB: ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
• కర్డ్ శర్మ వేసిన తొలి బంతికి కాటన్ బౌల్డ్ అయిన అబ్దుల్ సమద్ (10)
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 4
• 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 89/0
22:18(IST)
SRH vs RCB: హైదరాబాద్కు షాక్.. సమద్ ఔట్
22:15(IST)
SRH vs RCB: 9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 85/5
తొలి బంతికి సిక్స్ కొట్టిన అబ్దుల్ సమద్
• నాలుగో బంతికి ఫోర్ కొట్టిన షాబాజ్ అహ్మద్
• ఫెర్గూసన్ వేసిన తొమ్మిదో ఓవర్ లో వచ్చిన పరుగులు 13
22:07(IST)
SRH vs RCB: సగం వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
• నితీశ్ రెడ్డి (13) ఔటయ్యాడు. కర్డ్ శర్మ వేసిన 7.2 ఓవర్కు క్లీన్బెల్ట్ అయ్యాడు.
• దీంతో 69 పరుగులకే హైదరాబాద్ ఐదు వికెట్లు కోల్పోయింది.
• 8 ఓవర్లకు స్కోరు 72/5. షాబాజ్ అహ్మద్ (7), అబ్దుల్ సమద్ (2) పరుగులతో ఉన్నారు
22:07(15T)
SRH vs RCB: సగం వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
• నితీశ్ రెడ్డి (13) ఔటయ్యాడు. కర్డ్ శర్మ వేసిన 7.2 ఓవర్కు క్లీన్బోల్డ్ అయ్యాడు.
• దీంతో 69 పరుగులకే హైదరాబాద్ ఐదు వికెట్లు కోల్పోయింది.
22:05(IST)
SRH vs RCB: ఏడో ఓవర్ లో ఆరు సింగిల్స్
• స్వప్నిల్ సింగ్ వేసిన ఏడో ఓవర్ లో ఆరు సింగిల్స్ వచ్చాయి.
• 7 ఓవర్లకు స్కోరు 68/4 నితీశ్ రెడ్డి (13), షాబాజ్ అహ్మద్ (6) పరుగులతో ఉన్నారు.
22:01(IST)
SRH vs RCB: పవర్ ప్లే పూర్తి.. హైదరాబాద్ 62/4
సిరాజ్ వేసిన ఆరో ఓవర్ లో 6 పరుగులు వచ్చాయి.
• పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 62/4. షాబాజ్ అహ్మద్ (3), నితీశ్ రెడ్డి (10) పరుగులతో ఉన్నారు.
21:54(IST)
SRH vs RCB: హైదరాబాద్కు మరో షాక్ క్లాసెన్ ఔట్
• హైదరాబాద్కు మరో షాక్ తగిలింది. హెన్రిచ్ క్లాసెన్ (7) ఔటయ్యాడు.
• స్వప్నిల్ సింగ్ వేసిన ఐదో ఓవర్ లో రెండో బంతికి మార్ క్రమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
• మూడో బంతికి నితీశ్ రెడ్డి (7) సిక్స్ బాదాడు.
• ఐదో బంతిని లాంగాన్ మీదుగా స్టాండ్స్లో కి పంపిన క్లాసెన్.. చివరి బంతికి భారీ షాట్ ఆడి మిడాన్లో గ్రీన్కు చిక్కాడు.
• 5 ఓవర్లకు స్కోరు 50/4.
21:50(1ST)
SRH vs RCB: కష్టాల్లో పడ్డ హైదరాబాద్.. మూడు వికెట్లు డౌన్
• హైదరాబాద్ కష్టాల్లో పడింది. మార్క్రమ్ (7) ఔటయ్యాడు..
• స్వప్నిల్ సింగ్ వేసిన 4.2 ఓవర్కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
• దీంతో హైదరాబాద్ 41 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
21:42(15T)
SRH vs RCB: అభిషేక్ శర్మ (41) ఔట్.. హైదరాబాద్ రెండో వికెట్
• హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ (31) ఔటయ్యాడు.
• యక్ దయాల్ వేసిన నాలుగో ఓవర్లో నాలుగో బంతికి దినేశ్ కార్తిక్కు క్యాచ్ ఇచ్చాడు.
• 4 ఓవర్లకు స్కోరు 37/2, నితీశ్ రెడ్డి (0), మార్క్రమ్ (3) క్రీజులో ఉన్నారు.
21:33(IST)
SRH vs RCB: దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ
• విల్ జాక్స్ వేసిన మూడో ఓవర్ లో 20 పరుగులు వచ్చాయి.
• అభిషేక్ శర్మ (27) మొదటి రెండు బంతులకు వరుసగా 4, 6 బాదాడు.
• చివరి బంతిని కూడా అతడు స్టాండ్లోకి పంపాడు.
• 3 ఓవర్లకు స్కోరు 31/1 మార్ క్రమ్ (2) పరుగులతో ఉన్నాడు.
21:35(IST)
SRH vs RCB రెండో ఓవర్లో ఎనిమిది పరుగులు
• సిరాజ్ వేసిన రెండో ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి.
• నాలుగో బంతికి అభిషేక్ శర్మ (8) బౌండరీ బాదాడు.
• 2 ఓవర్లకు స్కోరు 11/1 మార్ క్రమ్ (1) క్రీజులో ఉన్నాడు.
21:28(IST)
SRH vs RCB: హైదరాబాదు బిగ్ షాక్.. హెడ్ ఔట్
• లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.
• విల్ జాక్స్ వేసిన మొదటి ఓవర్ లో చివరి బంతికి ట్రావిస్ హెడ్ (1) కర్ట్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
21:10(IST)
SRH vs RCB: కోహ్లి, పటిదార్ హాఫ్ సెంచరీలు.. హైదరాబాద్ లక్ష్యం 207
• హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు భారీ స్కోరు చేసింది.
• నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
• విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం బాదాడు.
• డుప్లెసిస్ (24: 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
• రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లు) మెరుపు ఇన్నింగ్స్ అలరించాడు.
• కామెరూన్ గ్రీన్ (37*: 19 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు.
• హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3, నటరాజన్ 2, కమిన్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ పడగొట్టారు.
21:03(IST)
SRH vs RCB: దినేశ్ కార్తిక్ ఔట్.. బెంగళూరు ఆరో వికెట్
• బెంగళూరు ఆరో వికెట్ కోల్పోయింది. దినేశ్ కార్తిక్ (11) ఔటయ్యాడు.
• కమిన్స్ వేసిన 19 ఓవర్ లో మొదటి రెండు బంతులకు కామెరూన్ గ్రీన్ ఫోర్లు బాదాడు.
• నాలుగో బంతికి బౌండరీ సాధించిన కార్తిక్ తర్వాతి బంతికే సమద్కు క్యాచ్ ఇచ్చాడు.
• 19 ఓవర్లకు స్కోరు 194/6. గ్రీన్ (36), స్వప్నిల్ సింగ్ (1) క్రీజులో ఉన్నారు.
20:58(IST)
SRH vs RCB: 118 ఓవర్..12 పరుగులు
• 18 ఓవర్ వేసిన నటరాజన్ 12 పరుగులు ఇచ్చాడు.
• చివరి బంతికి దినేశ్ కార్తిక్ (7) బౌండరీ బాదాడు.
• 18 ఓవర్లకు స్కోరు 179/5, కామెరూన్ గ్రీన్ (27) పరుగులతో ఉన్నాడు.
20:48(IST)
SRH vs RCB: సగం వికెట్లు కోల్పోయిన బెంగళూరు
• మహిపాల్ లామ్రోర్ (7) ఔటయ్యాడు. ఉనద్కత్ వేసిన 16.3 ఓవర్కు కమిన్స్కు క్యాచ్ ఇచ్చాడు.
• దీంతో 161 పరుగుల వద్ద బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది.
• తర్వాత కామెరూన్ గ్రీన్ (23) బౌండరీ బాదాడు. 17 ఓవర్లకు స్కోరు 167/5.
20:45(1ST)
SRH vs RCB: 16 ఓవర్లో మూడు ఫోర్లు బాదిన బెంగళూరు బ్యాటర్లు
• కమిన్స్ వేసిన 16వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి..
• కామెరూన్ గ్రీన్ (15) రెండు ఫోర్లు, మహిపాల్ లామ్రోర్ (7) ఒక బౌండరీ బాదారు.
• 16 ఓవర్లకు స్కోరు 157/4
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
20:38(IST)
SRH vs RCB: విరాట్ కోహ్లి ఔట్.. బెంగళూరు నాలుగో వికెట్
• విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో) ఔటయ్యాడు. ఉనద్కత్ వేసిన 15 ఓవర్ లో ఐదో బంతికి అబ్దుల్ సమద్ కు క్యాచ్ ఇచ్చాడు.
• 15 ఓవర్లకు స్కోరు 142/4 మహిపాల్ లామ్రోర్ (2), కామెరూన్ గ్రీన్ (5) పరుగులతో ఉన్నారు.
20:32(15T)
SRH vs RCB: విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ
• షాబాజ్ అహ్మద్ వేసిన 14 ఓవర్లో నాలుగు సింగిల్స్ వచ్చాయి.
• ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి (510 అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు..14 ఓవర్లకు స్కోరు 136/3. కామెరూన్ గ్రీన్ (3) పరుగులతో ఉన్నాడు.
20:26(IST)
SRH vs RCB: అర్థ శతకం బాది ఔటైన రజత్ పటిదార్
• రజత్ పటిదార్ (51; 20 బంతుల్లో) ఔటయ్యాడు.
• ఉనద్కత్ వేసిన 13 ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసి అర్ధ శతకం అందుకున్న పటిదార్ తర్వాతి బంతికే సమద్కు చిక్కాడు.. 13 ఓవర్లకు స్కోరు 132-3.
20:23(IST)
SRH vs RCB: 12 ఓవర్లో ఆరు సింగిల్స్ ఇచ్చిన కమిన్స్
కమిన్స్ 12 ఓవర్లో ఆరు సింగిల్స్ ఇచ్చాడు.
• 12 ఓవర్లకు బెంగళూరు స్కోరు 127/2. కోహ్లి (46), పటిదార్ (49) పరుగులతో ఉన్నారు.
20:19(1ST)
SRH vs RCB: సిక్సర్లతో విరుచుకుపడ్డ పటిదార్
• రజత్ పటిదార్ ఒక్కసారిగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మయాంక్ మార్కండే వేసిన 11 ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు.
• ఈ ఓవర్ లో మొత్తం 27 పరుగులు వచ్చాయి.
• 11 ఓవర్లకు స్కోరు 121/2 రజత్ పటిదార్ (46), కోహ్లి (30) పరుగులతో ఉన్నారు.
20:14(IST)
SRH vs RCB: 10 ఓవర్లు పూర్తి.. అర్ధ శతకానికి చేరువలో కోహ్లి
• జయేవ్ ఉనద్కత్ వేసిన 10వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మూడో బంతికి రజత్ పటిదార్ (21) బౌండరీ రాబట్టాడు.
• 10 ఓవర్లకు స్కోరు 94/2. విరాట్ కోహ్లి (42) అర్థ శతకానికి చేరువలో ఉన్నాడు.
20:08(IST)
SRH vs RCB: నిలకడగా ఆడుతున్న కోహ్లి, పటిదార్
• బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లి, రజత్ పటిదార్ నిలకడగా ఆడుతున్నారు.
• షాబాజ్ అహ్మద్ వేసిన ఎనిమిదో ఓవర్లో 8 పరుగులు, మార్కండే వేసిన తర్వాతి ఓవర్లో 11 పరుగులు రాబట్టారు.
• 9 ఓవర్లకు స్కోరు 84/2. పటిదార్ (15), కోహ్లి (38) పరుగులతో ఉన్నారు.
20:00(1ST)
SRH vs RCB: రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
• బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ (6) ఔటయ్యాడు.
• మయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్లో మొదటి ఐదు బంతులలో నాలుగు సింగిల్స్ వచ్చాయి.
చివరి బంతికి జాక్స్ క్లీన్్బల్డ్ అయ్యాడు. 7 ఓవర్లకు స్కోరు 05/2
20:00(IST)
SRH vs RCB రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
• బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ (6) ఔటయ్యాడు.
• మయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్లో చివరి బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు.
• 7 ఓవర్లకు స్కోరు 05/2
19:57(IST)
SRH vs RCB: నటరాజన్ బౌలింగ్లో సిక్సర్ బాదిన కోహ్లి
• నటరాజన్ వేసిన ఆరో ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి.
• మూడో బంతికి విరాట్ కోహ్లి (32) సిక్సర్ బాదాడు.
• 6 ఓవర్లకు స్కోరు 61/1 విల్ జాక్స్ (4) పరుగులతో ఉన్నాడు.
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
19:53(IST)
SRH vs RCB: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన షాబాజ్ అహ్మద్
• షాబాజ్ అహ్మద్ తన తొలి ఓవర్ కట్టుదిట్టంగా వేశాడు.
• ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసి రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు.
• 5 ఓవర్లకు స్కోరు 51/1 విల్ జాక్స్ (2), కోహ్లి (24) పరుగులతో ఉన్నారు.
19:48(IST)
SRH vs RCB: డుప్లెసిస్ ఔట్.. బెంగళూరు ఫస్ట్ వికెట్
• దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్ (25; 12 బంతుల్లో) ఔటయ్యాడు.
• నటరాజన్ వేసిన 3.5 ఓవర్కు మయాంక్ మార్కండేకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 48 పరుగుల వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది.
19:44(IST)
SRH vs RCB: దంచికొడుతున్న బెంగళూరు ఓపెనర్లు
బెంగళూరు. ఓపెనర్లు దంచికొడుతున్నారు.
• కమిన్స్ వేసిన మూడో ఓవర్ లో 19 పరుగులు రాబట్టారు.
• మొదటి రెండు బంతులను విరాట్ కోహ్లి (18) బౌండరీకి పంపాడు.
• నాలుగో బంతికి డుప్లెసిస్ (25) సిక్చర్ బాది చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.
• 3 ఓవర్లకు స్కోరు 43/0.
19:39(1ST)
SRH vs RCB: డుప్లెసిస్ దూకుడు.. ఒకే ఓవర్ లో మూడు ఫోర్లు
• బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (15) దూకుడుగా ఆడుతున్నాడు.
• భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్ లో అతడు మూడు ఫోర్లు బాదాడు.
• 2 ఓవర్లకు బెంగళూరు స్కోరు 24/0. కోహ్లి (9) పరుగులతో ఉన్నాడు
19:35(IST)
SRH vs RCB: ప్రారంభమైన మ్యాచ్.. ఫస్ట్ బాలికే కోహ్లి ఫోర్
• టాస్ గెలిచి బెంగళూరు బ్యాటింగ్కు దిగింది. అభిషేక్ శర్మ తొలి ఓవర్ వేశాడు.
• ఇన్నింగ్స్ మొదటి బంతినే విరాట్ కోహ్లి (8) బౌండరీకి పంపాడు.
• తర్వాత నాలుగు సింగిల్స్ వచ్చాయి. చివరి బంతికి కోహ్లి రెండు రన్స్ చేశాడు. డుప్లెసిస్ (2) పరుగులతో ఉన్నాడు.
19:15(157)
SRH vs RCB: ఇరు జట్ల సబట్యూట్లు వీరే
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్ ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.
బెంగళూరు: సుయాశ్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్, హిమాన్షు శర్మ, విజయ్కుమార్ వైశాఖ్, స్వప్నిల్ సింగ్.
19:12(IST)
SRH vs RCB: బెంగళూరు తుది జట్టులో ఉన్నది వీరే
విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, కర్ల్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
19:10(IST)
SRH vs RCB: హైదరాబాద్ తుది జట్టు ఇదే
అభిషేక్ శర్మ, ఐదెన్ మార్ క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, నటరాజన్.
19:01(IST)
SRH vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
• మరికాసేపట్లో ఉప్పల్లోని రాజీవ్ంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది.
టాస్ గెలిచి బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.
18:45(IST)
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. అభిమానుల సందడి
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. దీంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది.
18:40(IST)
SRH vs RCB: ఆర్సీబీకి స్పెషల్ మ్యాచ్
• ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకిది 250వ మ్యాచ్.
• 250 మ్యాచ్లు ఆడిన రెండో జట్టుగా బెంగళూరు రికార్డు సృష్టించనుంది.
• ముంబయి (255) మ్యాచ్లు తొలి స్థానంలో ఉంది.
18:38(IST)
SRH vs RCB: ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు
• బెంగళూరు ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా ఆరు మ్యాచ్లో ఓడి డీలా పడిన ఆ జట్టు విజయం కోసం ఎదురుచూస్తోంది.
• కోల్కతాతో జరిగిన గత మ్యాచ్లో బెంగళూరు గెలుపు అంచుల వరకు వచ్చి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
17:50(1ST)
SRH vs RCB రెండో స్థానంపై కన్నేసిన హైదరాబాద్
• ఈ సీజన్ లో హైదరాబాద్ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లల్లో గెలిచింది.
• గత నాలుగు మ్యాచ్ ల్లోనూ జయకేతనం ఎగరేసిన కమిన్స్ సేన.. వరుసగా ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లాలని చూస్తోంది.
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu ##IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్) , అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, నటరాజన్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్ (వికెట్ కీపర్), ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, జె సుబ్రమణియన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోడ్, కర్ణ్ శర్మ, మనోజ్ భండాగరేజీ , విజయ్‌కుమార్ విశాక్, ఆకాష్‌దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రంజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu
IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu #IPL 2024 41st Match- SRH vs RCB Live Updates in Telugu