Live: ఐపీఎల్ 2024 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ | IPL 2024 40th Match-DC vs GT Live Updates
DC vs GT Live: IPL 2024– 40వ IPL మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(GT) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రెండు జట్లు ఇప్పటికీ స్టాండింగ్స్‌లో అట్టడుగున కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకమని చెప్పొచ్చు. ఇదే సీజన్ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గుజరాత్‌ను వారి సొంత స్టేడియంలో ఓడించింది. ఈ నేపథ్యంలో, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
23:14(IST) DC vs GT: ఉత్కంఠ పోరు.. ఢిల్లీదే విజయం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
23:08(1ST)
DC vs GT: ఉత్కంఠగా మారిన మ్యాచ్
• మ్యాచ్ ఉత్కంఠగా మారింది..
• రషిక్ వేసిన 19 ఓవర్ లో 18 పరుగులు వచ్చాయి.
• సాయి కిశోర్ (13) వరుసగా రెండు సిక్స్లు బాది చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
• 19 ఓవర్లకు స్కోరు 206/8.
• గుజరాత్ విజయానికి చివరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరం.
22:55(15T)
DC vs GT: మిల్లర్ (55) ఔట్.. గుజరాత్ ఏడో వికెట్
• గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ (55, 22 బంతుల్లో) ఔటయ్యాడు.
• ముకేశ్ కుమార్ వేసిన 17.3 ఓవర్కు రషిక్ సలామ్కు క్యాచ్ ఇచ్చాడు. 18 ఓవర్లకు స్కోరు 188/7. రషీద్ ఖాన్ (2), సాయి కిశోర్ (1) పరుగులతో ఉన్నారు.
22:52(IST)
DC vs GT: 21 బంతుల్లోనే డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ
డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడుతున్నాడు.
• నోకియా వేసిన 17 ఓవర్లో మూడు సిక్స్లు, ఓ ఫోర్ బాదాడు.
చివరి బంతికి రెండు పరుగులు చేసి 21 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు.
• 17 ఓవర్లకు స్కోరు 176/6.
22:46(IST)
DC vs GT: తెవాటియా (4) ఔట్.. గుజరాత్ ఆరు వికెట్లు
• గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా (4) ఔటయ్యాడు.
• కుల్స్టాప్ యాదవ్ వేసిన 16 ఓవర్లో మొదటి బంతులకు సింగిల్స్ వచ్చాయి.
• చివరి బంతికి తెవాటియా.. రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు.
• 16 ఓవర్లకు స్కోరు 152/6. డేవిడ్ మిల్లర్ (27) పరుగులతో ఉన్నాడు.
22:40(IST)
DC vs GT: 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 147/5
• 15వ ఓవర్ తొలి బంతికే షారుఖ్ ఖాన్ (8) ఔట్
• క్రీజులోకి వచ్చిన తెవాతియా
• మూడో బంతికి ఫోర్ బాదిన మిల్లర్
ఈ ఓవర్లో వచ్చిన మొత్తం పరుగులు 8.
22:35(IST)
DC vs GT: మరోవికెట్ కోల్పోయిన గుజరాత్.. షారుఖ్ ఖాన్ ఔట్
22:34(IST)
DC vs GT: వరుసగా రెండు ఫోర్లు బాదిన మిల్లర్
• గుజరాత్ లక్ష్యం 36 బంతుల్లో 86
• 14వ ఓవర్ వేసిన ముకేశ్ కుమార్
• ఈ ఓవర్లో వచ్చిన పరుగులు ఇలా.. 1,1,11,4,4
• క్రీజులో మిల్లర్ (18), షారుఖ్ ఖాన్ (8)
22:30(1ST)
DC vs GT: సాయి సుదర్శన్ ఔట్.. 13 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 127/4
• రసిఖ్ వేసిన నాలుగో బంతికి ఔటైన సాయి సుదర్శన్ (65)
• సాయి సుదర్శన్ గాల్లోకి లేపిన బంతిని అందుకున్న అక్షర్ పటేల్
చివరి బంతికి సిక్స్ బాదిన షారుఖ్ ఖాన్
• గుజరాత్ లక్ష్యం 42 బంతుల్లో 98
22:20(IST)
DC vs GT: గుజరాత్కు షాక్.. సాయి సుదర్శన్ ఔట్
22:23(IST)
DC vs GT: 12 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 119/3
• కుల్దీప్ వేసిన తొలి బంతికి ఫోర్ కొట్టిన మిల్లర్
• ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 10
22:15(IST)
DC vs GT: సిక్స్ బాదిన సాయి సుదర్శన్
• అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్ తొలి బంతి ఒమర్జాయ్ ఔట్
• అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్న జేక్ ఫ్రేజర్
• ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 11
22:13/187)
DC vs GT: అక్షర్ అదిరిపోయే క్యాచ్.. సాహా ఔట్
• గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా (39) ఔటయ్యాడు.
• కుల్స్టాప్ యాదవ్ వేసిన 9.4 ఓవర్కు గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకోవడంతో సాహా వెనుదిరిగాడు.
• 10 ఓవర్లకు స్కోరు 98/2 చివరి బంతికి రెండు పరుగులు సాధించి సాయి సుదర్శన్ (50) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
22:12(1ST)
DC vs GT: అర్ధ శతకానికి చేరువతో అక్షర్ పటేల్
• అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో సాయి సుదర్శన్ (46) వరుసగా రెండు ఫోర్లు బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు.
• 9 ఓవర్లకు స్కోరు 92/1. వృద్ధిమాన్ సాహా (38) పరుగులతో ఉన్నాడు..
22:07(1ST)
DC vs GT: ఎనిమిదో ఓవర్ లో 8 పరుగులు
• కుల్దీప్ యాదవ్ వేసిన ఎనిమిదో ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
• రెండో బంతికి సాయి సుదర్శన్ ఫోర్ బాదాడు.
• 8 ఓవర్లకు స్కోరు 79/1 సాయి సుదర్శన్ (34), వృద్ధిమాన్ సాహా (37) పరుగులతో ఉన్నారు.
22:02(187)
DC vs GT: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్
• అక్షర్ పటేల్ తన తొలి ఓవర్ కట్టుదిట్టంగా వేశాడు.
• ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసి నాలుగు పరుగులు ఇచ్చాడు…
• 7 ఓవర్లకు స్కోరు 71/1. వృద్ధిమాన్ సాహా (36), సాయి సుదర్శన్ (28) పరుగులతో ఉన్నారు.
21:58(187)
DC vs GT: పవర్ ప్లే పూర్తి.. గుజరాత్ 67/1
ముకేశ్ కుమార్ వేసిన ఆరో ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి.
• పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 67/1 వృద్ధిమాన్ సాహా (33), సాయి సుదర్శన్ (27) పరుగులతో ఉన్నారు.
21:53(IST)
DC vs GT: దూకుడుగా ఆడుతున్న గుజరాత్ బ్యాటర్లు
• 225 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ దూకుడుగా ఆడుతోంది.
• రషిక్ వేసిన ఐదో ఓవర్ లో 10 పరుగులు రాబట్టింది.
• వృద్ధిమాన్ సాహా (31), సాయి సుదర్శన్ (22) చెరో బౌండరీ బాదారు.
• 5 ఓవర్లకు స్కోరు 80/1
21:45(IST)
DC vs GT: 4 ఓవర్లకే గుజరాత్ స్కోరు 50
• నోకియా వేసిన నాలుగో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి.
• సాయి సుదర్శన్ (17) రెండు ఫోర్లు బాదాడు.
• 4 ఓవర్లకు స్కోరు 50/1 వృద్ధిమాన్ సాహా (26) పరుగులతో ఉన్నాడు.
21:44(IST)
DC vs GT: దూకుడుగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహా
• ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.
• వృద్ధిమాన్ సాహా (26; 10 బంతుల్లో) రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు.
• 3 ఓవర్లకు స్కోరు 41/1. సాయి సుదర్శన్ (8) పరుగులతో ఉన్నాడు.
21:40(187)
DC vs GT: సుదర్శన్ సిక్స్.. సాహా ఫోర్
శుభ్మన్ గిల్ ఔటైన తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ (7) ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు.
• రెండో ఓవర్లో చివరి బంతిని వృద్ధిమాన్ సాహా (10) బౌండరీకి పంపాడు..
• 2 ఓవర్లకు స్కోరు 24/1
21:35(IST)
DC vs GT: గుజరాత్కు షాక్.. శుభమన్ గిల్ ఔట్
• గుజరాత్కు షాక్ తగిలింది. శుభ్మన్ గిల్ (6) ఔటయ్యాడు.
• నోకియా వేసిన 13 ఓవర్కు మిడాఫ్ అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చాడు.
21:33(1ST)
DC vs GT: లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. తొలి ఓవర్లో 9 రన్స్
• దిల్లీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ బరిలోకి దిగింది.
• ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులు వచ్చాయి.
• వృద్ధిమాన్ సాహా (6), శుభ్మన్ గిల్ (2) పరుగులతో ఉన్నారు.
21:12(15T)
DC vs GT: దంచికొట్టిన రిషభ్ పంత్.. గుజరాత్ టార్గెట్ 225
• గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్లో దిల్లీ భారీ స్కోరు చేసింది.
• నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
• రిషబ్ పంత్ (88*; 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్ లు) చెలరేగి ఆడాడు.
• అక్షర్ పటేల్ (66; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడాడు.
• ట్రిస్టన్ స్టబ్స్ (26, 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు.
• చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ 53 పరుగులు రాబట్టడం విశేషం.
• గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3, నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
• ఒకదశలో దిల్లీ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
• పంత్, అక్షర్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్ది తర్వాత జోరు పెంచారు. దీంతో దిల్లీ భారీ స్కోరు చేసింది.
21:05(IST)
DC vs GT: దంచికొడుతున్న ట్రిస్టన్ స్టబ్స్
• ట్రిస్టన్ స్టబ్స్ (26; 7 బంతుల్లో) క్రీజులోకి రావడంతోనే దంచికొడుతున్నాడు.
• సాయి కిశోర్ వేసిన 10 ఓవర్ తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా.. తర్వాత స్టబ్స్ వరుసగా 4, 0, 4, 6, 19 ఓవర్లకు స్కోరు 193/4. రిషబ్ పంత్ (58) పరుగులతో ఉన్నాడు..
20:57(IST)
DC vs GT: సిక్సర్తో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ
• రిషబ్ పంత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
• మోహిత్ శర్మ వేసిన 18 ఓవర్లో నాలుగో బంతికి సిక్స్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
• ఇదే ఓవర్ లో స్టబ్స్ (5) బౌండరీ బాదాడు. 18 ఓవర్లకు స్కోరు 171/4 పంత్ (57) పరుగులతో ఉన్నాడు..
20:55(IST)
DC vs GT: వరుసగా రెండు సెక్స్లు.. వెంటనే ఔట్
• దిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ (66) ఔటయ్యాడు.
• నూర్ అహ్మద్ వేసిన 17 ఓవర్ లో నాలుగు, ఐదు బంతులకు సిక్స్లు బాదిన అక్షర్.. తర్వాతి బంతికే సాయి కిశోర్కు క్యాచ్ ఇచ్చాడు.
• 17 ఓవర్లకు స్కోరు 157/4. రిషబ్ పంత్ (48) అర్థ శతకానికి చేరువయ్యాడు.
20:46(IST)
DC vs GT: ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రిషభ్ పంత్
• రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు.
• మోహిత్ శర్మ వేసిన 16వ ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు బాదాడు.
• 10 ఓవర్లకు దిల్లీ స్కోరు 143/3, పంత్ (47), అక్షర్ పటేల్ (53) పరుగులతో ఉన్నారు.
20:42(1ST)
DC vs GT: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర్ పటేల్
• అక్షర్ పటేల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
• రషీద్ ఖాన్ వేసిన 15 ఓవర్లో చివరి బంతికి ఫోర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
• 15 ఓవర్లకు స్కోరు 127/3. రిషబ్ పంత్ (34) పరుగులతో ఉన్నాడు.
20:39(1ST)
DC vs GT: అర్ధ శతకానికి చేరువ అక్షర్ పటేల్
• అక్షర్ పటేల్ (45) అర్ధ శతకానికి చేరువయ్యాడు.
• షారూక్ ఖాన్ వేసిన 14 ఓవర్లో చివరి బంతికి అక్షర్ సిక్స్ బాదాడు.
• 14 ఓవర్లకు స్కోరు 120/3, రిషబ్ పంత్ (32) పరుగులతో ఉన్నాడు.
20:36(1ST)
DC vs GT: 13 ఓవర్ లో ఆరు పరుగులు
• రషీద్ ఖాన్ వేసిన 13 ఓవర్ లో ఆరు పరుగులు వచ్చాయి.
• రెండో బంతికి అక్షర్ పటేల్ (38) బౌండరీ బాదాడు.
• 13 ఓవర్లకు స్కోరు 111/3. రిషబ్ పంత్ (31) పరుగులతో ఉన్నాడు.
20:33/187)
DC vs GT: పంత్ రెండు ఫోర్లు.. 100 దాటిన స్కోరు
• మోహిత్ శర్మ వేసిన 12 ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి రిషబ్ పంత్ (30) బౌండరీ బాదాడు. తర్వాత నాలుగు సింగిల్స్ వచ్చాయి.
• చివరి బంతికి పంత్ మళ్లీ బౌండరీ రాబట్టాడు.
• 12 ఓవర్లకు స్కోరు 105/3. అక్షర్ పటేల్ (33) పరుగులతో ఉన్నాడు.
20:27(187)
DC vs GT:జోరు పెంచుతున్న దిల్లీ బ్యాటర్లు
• దిల్లీ బ్యాటర్లు రిషబ్ పంత్ (20), అక్షర్ పటేల్ (31) జోరు పెంచుతున్నారు..
• నూర్ అహ్మద్ వేసిన 11 ఓవర్లో పంత్ సిక్స్ బాదగా.. అక్షర్ ఫోర్ కొట్టాడు.
• 11 ఓవర్లకు స్కోరు 93/3.
20:23(187)
DC vs GT: 10 ఓవర్లు పూర్తి.. నిలకడగా ఆడుతున్న పంత్, అక్షర్
• రిషబ్ పంత్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతున్నారు.
• రషీద్ ఖాన్ వేసిన పదో ఓవర్లో చెరో బౌండరీ బాదారు.
• 10 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 80/3. పంత్ (12), అక్షర్ (26) పరుగులతో ఉన్నారు.
20:18(IST)
DC vs GT:తొమ్మిది ఓవర్లు పూర్తి… ఢిల్లీ 68/3
• నూర్ అహ్మద్ వేసిన తొమ్మిదో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి.
• తొలి బంతిని రిషబ్ పంత్ (7) బౌండరీకి పంపాడు..9 ఓవర్లకు స్కోరు 68/3.
20:14(IST)
DC vs GT: రషీద్ ఖాన్ బౌలింగ్లో అక్షర్ సిక్సర్
• రషీద్ ఖాన్ వేసిన ఎనిమిదో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
• ఐదో బంతికి అక్షర్ పటేల్ (17) సిక్సర్ బాదాడు.
• 8 ఓవర్లకు స్కోరు 59/3. రిషబ్ పంత్ (1) క్రీజులో ఉన్నాడు.
20:10(IST)
DC vs GT: నెమ్మదిగా ఆడుతున్న దిల్లీ బ్యాటర్లు
• వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు.
• అజ్మతుల్లా వేసిన ఏడో ఓవర్ లో ఐదు పరుగులు రాగా.. నాలుగో బంతిని అక్షర్ పటేల్ (8) బౌండరీకి తరలించాడు. 7 ఓవర్లకు స్కోరు 49/3.
20:03(IST)
DC vs GT: షై హోప్ (5) ఔట్.. దిల్లీ మూడో వికెట్
• దిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. పై హోప్ (5) ఔటయ్యాడు.
• సందీప్ వారియర్ వేసిన 5.4 ఓవర్కు రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు.
• పవర్ ప్లే ముగిసేసరికి దిల్లీ స్కోరు 44/3.
• రిషబ్ పంత్ (0), అక్షర్ పటేల్ (4) పరుగులతో ఉన్నారు.
20:03(IST)
DC vs GT: 5 ఓవర్లకు దిల్లీ స్కోరు 43/2
• అజ్మతుల్లా వేసిన ఐదో ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి.
• తొలి బంతి డాట్ కాగా.. తర్వాత మూడు సింగిల్స్ వచ్చాయి. ఐదో బంతికి షై హోప్ (5) బౌండరీ రాబట్టాడు. 5 ఓవర్లకు స్కోరు 43/2 అక్షర్ పటేల్ (3) పరుగులతో ఉన్నాడు.
19:54(IST)
DC vs GT: నూర్ అహ్మద్ సూపర్ క్యాచ్.. పృథ్వీ షా ఔట్
• దిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా (11) ఔటయ్యాడు.
• సందీప్ వారియర్ వేసిన నాలుగో ఓవర్లో ఐదో బంతికి ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి మంచి డైవ్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో పృథ్వీ షా వెనుదిరిగాడు.
• 4 ఓవర్లకు స్కోరు 36/4 షై హోప్ (0), అక్షర్ పటేల్ (1) క్రీజులో ఉన్నారు..
19:48(IST)
DC vs GT:దిల్లీ తొలి వికెట్ కోల్పోయింది.
• దూకుడుగా ఆడుతున్న జేక్ ప్రేజర్ (23; 14 బంతుల్లో) ఔటయ్యాడు.
• సందీప్ వారియర్ వేసిన నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడి డీప్ స్క్వేర్గ్లో నూర్ అహ్మదు చిక్కాడు.
19:47(IST)
DC vs GT: దూకుడుగా ఆడుతున్న జేక్ ఫ్రేజర్
• దిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ (23) దూకుడుగా ఆడుతున్నాడు..
• అజ్మతుల్లా వేసిన మూడో ఓవర్లో చివరి బంతికి సిక్స్ బాదాడు.
• ఇదే ఓవర్లో రెండో బంతికి పృథ్వీ షా (10) బౌండరీ సాధించాడు. 3 ఓవర్లకు స్కోరు 34/0.
18:41(IST)
DC vs GT: వరుసగా సిక్స్. ఫోర్ బాదిన జేక్ ఫ్రేజర్
• సందీప్ వారియర్ వేసిన రెండో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి.
• ఐదో బంతికి సిక్సర్ బాదిన జేక్ ప్రేజర్ (16).. తర్వాతి బంతిని బౌండరీకి పంపాడు.
• 2 ఓవర్లకు స్కోరు 22/0. పృథ్వీ షా (5) పరుగులతో ఉన్నాడు..
19:36(1ST)
DC vs GT: తొలి ఓవర్ లో రెండు ఫోర్లు బాదిన ఓపెనర్లు
• అజ్మతుల్లా వేసిన తొలి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
• తొలి బంతికి పృథ్వీ షా (5), నాలుగో బంతికి జేక్ ఫ్రేజర్ (5) బౌండరీలు బాదారు.
19:31(IST)
DC vs GT: ప్రారంభమైన మ్యాచ్.. దిల్లీ బ్యాటింగ్
• దిల్లీ, గుజరాత్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది..
• టాస్ ఓడి దిల్లీ బ్యాటింగ్ కు దిగింది.
• అజ్మతుల్లా ఒమర్జాయ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
13:18(IST)
DC vs GT: గుజరాత్ తుది జట్టులో ఉన్నది వీరే
వృద్ధిమాన్ సాహా, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.
ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: బిఆర్ శరత్, సాయి సుదర్శన్, మనవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.
19:15(IST)
DC vs GT: దిల్లీ తుది జట్టులో ఉన్నది వీరే
పృథ్వీ షా, జేక్ ప్రేజర్, అభిషేక్ పొరెల్, షై హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్స్టాప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు; సుమిత్ కుమార్, రషిక్ సలామ్ దార్, కుమార్ కుశాగ్ర, ప్రవీణ్ దూబె, లలిత్ యాదవ్.
19:07(15T)
DC vs GT: శుభ్మన్ గిల్ @ 100 వ మ్యాచ్.
గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఐపీఎల్ కెరీర్లో ఇది 100వ మ్యాచ్.
19:03(IST)
DC vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. దిల్లీ ఫస్ట్ బ్యాటింగ్
• మరికాసేపట్లో దిల్లీ, గుజరాత్ జట్లు తలపడనున్నాయి.
• టాస్ గెలిచిన గుజరాత్.. ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
IPL 2024 40th Match-DC vs GT Live Updates
IPL 2024 40th Match-DC vs GT Live Updates #IPL 2024 40th Match-DC vs GT Live Updates #IPL 2024 40th Match-DC vs GT Live Updates IPL 2024 40th Match-DC vs GT Live Updates
IPL 2024 40th Match-DC vs GT Live Updates
IPL 2024 40th Match-DC vs GT Live Updates #IPL 2024 40th Match-DC vs GT Live Updates #IPL 2024 40th Match-DC vs GT Live Updates IPL 2024 40th Match-DC vs GT Live Updates
IPL 2024 40th Match-DC vs GT Live Updates
IPL 2024 40th Match-DC vs GT Live Updates #IPL 2024 40th Match-DC vs GT Live Updates #IPL 2024 40th Match-DC vs GT Live Updates IPL 2024 40th Match-DC vs GT Live Updates