RR vs MI Live Updates
Live: ఐపీఎల్ 2024 38వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ | IPL 2024 38th Match-RR vs MI Live Updates
IPL 2024 38th Match-RR vs MI Live Updates: రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ ఈ రోజు (ఏప్రిల్ 22) జరగనుంది. RR ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది, అయితే ముంబై ఇప్పటికీ పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడానికి కష్టపడుతోంది.
RR vs MI IPL 2024 మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఏప్రిల్ 22 న రాత్రి 7:30 IST వరకు జరుగుతుంది . RR టోర్నమెంట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది మరియు వాటిలో 6 గెలిచింది, మరోవైపు, MI కూడా 7 మ్యాచ్‌లు ఆడింది మరియు వాటిలో 3 మాత్రమే గెలిచింది.
25:14(15T)
RR vs MI: శాంసన్ క్యాచ్ను మిస్ చేసిన టిమ్ డేవిడ్
• హార్దిక్ పాండ్య వేసిన 13 ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
• మూడో బంతికి సంజు శాంసన్ (20) సిక్స్ బాదాడు.
• ఐదో బంతికి శాంసన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను టిమ్ డేవిడ్ అందుకోలేకపోయాడు.
• 13 ఓవర్లకు స్కోరు 123/1 జైస్వాల్ (65) పరుగులతో ఉన్నాడు.
23:09(15T)
RR vs MI:12వ ఓవర్.. మూడు పరుగులే ఇచ్చిన చావ్లా
• పీయూష్ చావ్లా వేసిన 12 ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
• 12 ఓవర్లకు స్కోరు 113/1 సంజు శాంసన్ (12), యశస్వి జైస్వాల్ (63) పరుగులతో ఉన్నారు.
23:05(15T)
RR vs MI: నబీ బౌలింగ్లో శాంసన్, జైస్వాల్ సిక్సర్లు
• మహ్మద్ నబీ వేసిన 11 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.
• మూడో బంతికి యశస్వి జైస్వాల్ (62), ఐదో బంతికి సంజు శాంసన్ (10) సిక్స్ లు బాదారు.
• 11 ఓవర్లకు స్కోరు 110/1
23:03(1ST)
RR vs MI: యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ
• యశస్వి జైస్వాల్ అర్ధ శతకం బాదాడు.
• పీయూష్ చావ్లా వేసిన 10 ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన అతడు తర్వాతి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
• ఇదే ఓవర్ లో చివరి బంతికి జైస్వాల్ భారీ షాట్ ఆడగా.. లాంగాఫ్ లో వధేరా క్యాచ్ అందుకోలేకపోయాడు. అంతేకాదు అది సిక్సర్గా మారింది.
• 10 ఓవర్లకు స్కోరు 95/1 జైస్వాల్ (56), సంజు శాంసన్ (2) పరుగులతో ఉన్నారు.
22:58(1ST)
RR vs MI: అర్ధ శతకానికి చేరువలో యశస్వి జైస్వాల్
• యశస్వి జైస్వాల్ (45) అర్ధ శతకానికి చేరువయ్యాడు.
• నబీ వేసిన తొమ్మిదో ఓవర్లో ఐదో బంతిని స్టాండ్స్లో కి పంపాడు.
• 9 ఓవర్లకు స్కోరు 83/1 శాంసన్ (1) క్రీజులో ఉన్నాడు.
22:52(IST)
RR vs MI: బట్లర్ (35) క్లీన్ బౌల్డ్.. రాజస్థాన్ తొలి వికెట్
• రాజస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (35; 25 బంతుల్లో) ఔటయ్యాడు.
• పీయూష్ చావ్లా వేసిన ఎనిమిదో ఓవర్లో చివరి బంతికి బట్లర్ క్లీన్బోల్డ్ అయ్యాడు.
• 8 ఓవర్లకు స్కోరు 74/1 యశస్వి జైస్వాల్ (37) పరుగులతో ఉన్నాడు.
22:50(IST)
RR vs MI: ఏడో ఓవర్.. బౌండరీ బాదిన యశస్వి జైస్వాల్
• మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత నబీ బౌలింగ్ చేశాడు.
• అతడు వేసిన ఏడో ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి.
• యశస్వి జైస్వాల్ (30) బౌండరీ బాదాడు.
• 7 ఓవర్లకు స్కోరు 68/0. బట్లర్ (30) పరుగులతో ఉన్నాడు.
22:46(IST)
RR vs MI: తిరిగి ప్రారంభమైన మ్యాచ్.. ఓవర్ల కుదింపు లేదు
• వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది.
• ఓవర్ల కుదింపు లేకుండానే మ్యాచ్ జరగనుంది.
22:08(1ST)
RR vs MI: మైదానంలో చినుకులు.. ఆగిపోయిన మ్యాచ్
• మ్యాచ్ జరుగుతున్న స్టేడియం ప్రాంతంలో చినుకులు పడుతున్నాయి.
• దీంతో మ్యాచ్ను ఆపేశారు. ఆటగాళ్లు మైదానాన్ని వీడగా.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు.
• DLS ప్రకారం రాజస్థాన్ 20 పరుగుల ముందంజలో ఉంది.
22:08(IST)
RR vs MI: మైదానంలో చినుకులు.. ఆగిపోయిన మ్యాచ్
• మ్యాచ్ జరుగుతున్న స్టేడియం ప్రాంతంలో చినుకులు పడుతున్నాయి.
• దీంతో మ్యాచ్ను ఆపేశారు. ఆటగాళ్లు మైదానాన్ని వీడగా.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు.
• DLS ప్రకారం రాజస్థాన్ 20 పరుగుల ముందంజలో ఉంది.
22:04(IST)
RR vs MI: ఆరో ఓవర్ లో నాలుగు ఫోర్లు
• రాజస్థాన్ బ్యాటర్ల దూకుడు కొనసాగుతోంది.
• నువాన్ తుషార వేసిన ఆరో ఓవర్లో జోస్ బట్లర్ (28), యశస్వి జైస్వాల్ (31) చెరో రెండు బౌండరీలు బాదారు.
• పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 61/0
21:58(IST)
RR vs MI: దూకుడుగా ఆడుతున్న బట్లర్, జైస్వాల్
• బుమ్రా వేసిన ఐదో ఓవర్ లో తొమ్మిది పరుగులు వచ్చాయి.
• యశస్వి జైస్వాల్ (23), జోస్ బట్లర్ (19) చెరో బౌండరీ బాదారు.
• 5 ఓవర్లకు రాజస్థాన్ 44/0.
21:54(18T)
RR vs MI: దూకుడుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్
• యశస్వి జైస్వాల్ (19) దూకుడుగా ఆడుతున్నాడు.
• కొయెట్జ్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.
• 4 ఓవర్లకు స్కోరు 35/0. బట్లర్ (14) పరుగులతో ఉన్నాడు.
21:48(IST)
RR vs MI: తుషార బౌలింగ్.. ఆరు సింగిల్స్
• నువాన్ తుషార వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ఆరు సింగిల్స్ వచ్చాయి.
• 3 ఓవర్లకు స్కోరు 19/0. జోస్ బట్లర్ (14), యశస్వి జైస్వాల్ (5) పరుగులతో ఉన్నాడు.
21:43(IST)
RR vs MI: పొదుపుగా బౌలింగ్ చేసిన బుమ్రా
• జస్ప్రీత్ బుమ్రా తన తొలి ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అతడు రెండు పరుగులే ఇచ్చాడు.
• 2 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 13/0.
21:38(1ST)
RR vs MI: లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్.. టార్గెట్ 180
• ముంబయి నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బరిలోకి దిగింది.
• హార్దిక్ పాండ్య వేసిన తొలి ఓవర్లో పరుగులు 11 వచ్చాయి.
• నాలుగు, ఐదు బంతులను జోస్ బట్లర్ (10) బౌండరీకి పంపాడు.
• యశస్వి జైస్వాల్ (1) క్రీజులో ఉన్నాడు.
21:17(IST)
RR vs MI:రాణించిన తిలక్ వర్మ. వధేరా.. రాజస్థాన్ టార్గెట్ 180
• రాజస్థాన్లో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి బ్యాటింగ్ ముగిసింది.
• నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
• టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ (6), ఇషాన్ కిషన్ (10) విఫలమయ్యారు.
• తిలక్ వర్మ (65; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకం బాదాడు.
• నేహల్ వధేరా (49, 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు.
• మహ్మద్ నబీ (23; 17 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు..
• రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ (5/18) ఆకట్టుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ 2, అవేశ్ ఖాన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
21:16(IST)
RR vs MI: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ముంబయి
టిమ్ డేవిడ్ (3) ఔటయ్యాడు. సందీప్ శర్మ వేసిన 19.5 ఓవర్కు భారీ షాట్ ఆడి రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చాడు.
21:13(IST)
RR vs MI: కొయెటీ ఔట్.. ముంబయి ఎనిమిదో వికెట్
సందీప్ శర్మ వేసిన 19.2 ఓవర్కు గెరాల్డ్ కౌయెర్జీ (0) హెట్మయర్కు క్యాచ్ ఇచ్చాడు.
21:12(IST)
RR vs MI: తిలక్ వర్మ (65) ఔట్..
ముంబయి ఏడో వికెట్ సందీప్ శర్మ వేసిన 19.1 ఓవర్కు తిలక్ వర్మ (65) ఔటయ్యాడు.
21:11(IST)
RR vs MI:కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్
• అవేశ్ ఖాన్ తన చివరి ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
• ఆరు పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. 19 ఓవర్లకు స్కోరు 176/6.
21:06(IST)
RR vs MI: హార్దిక్ పాండ్య ఔట్.. ముంబయి ఆరో వికెట్
• ముంబయి ఆరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య (10) ఔటయ్యాడు.
అవేశ్ ఖాన్ వేసిన 19 ఓవర్లో రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
21:04(IST)
RR vs MI: 18వ ఓవర్.. 9 పరుగులు
చాహల్ వేసిన 18 ఓవర్ లో ముంబయి బ్యాటర్లు ఎనిమిది పరుగులు రాబట్టారు.
• నాలుగో బంతిని హార్దిక్ పాండ్య (10) బౌండరీకి పంపాడు.
• 18 ఓవర్లకు స్కోరు 170/5. తిలక్ వర్మ (64) పరుగులతో ఉన్నాడు.
20:55(IST)
RR vs MI: నేహల్ వధేరా హాఫ్ సెంచరీ మిస్
• నేహల్ వదేరా (49, 24 బంతుల్లో) అర్థ శతకం ముంగిట ఔటయ్యాడు.
• ట్రెంట్ బౌల్ట్ వేసిన 17 ఓవర్ తొలి బంతికి సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.
ఇదే ఓవర్ లో చివరి బంతికి తిలక్ వర్మ (63) డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్స్ బాదాడు.
• 17 ఓవర్లకు ముంబయి స్కోరు 161/5. హార్దిక్ పాండ్య (2) పరుగులతో ఉన్నాడు.
20:53(IST)
RR vs MI: వరుసగా రెండు సిక్స్లు బాదిన నేహల్ వధేరా
చాహల్ వేసిన 16 ఓవర్లో నేహల్ వధేరా (49) వరుసగా రెండు సిక్సర్లు బాది అర్థ శతకానికి చేరువయ్యాడు.
• 16 ఓవర్లకు స్కోరు 151/4 తిలక్ వర్మ (56) పరుగులతో ఉన్నాడు..
20:45(1ST)
RR vs MI: సిక్సర్తో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ
చాహల్ వేసిన 15.1 ఓవర్కు సిక్సర్ బాది తిలక్ వర్మ అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
RR vs MI: హాఫ్ సెంచరీకి దగ్గర ఉన్న తిలక్ వర్మ
• సందీప్ శర్మ వేసిన 15 ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
• రెండో బంతికి నేహల్ వధేరా (36) ఫోర్ బాదాడు.
• ఐదో బంతికి తిలక్ వర్మ (49) బౌండరీ రాబట్టి అర్ధ శతకానికి చేరువయ్యాడు.
• 15 ఓవర్లకు స్కోరు 131/4.
20:40(IST)
RR vs MI:దూకుడుగా ఆడుతున్న నేహల్ వధేరా
• ముంబయి బ్యాటర్ నేహల్ వధేరా (31, 17 బంతుల్లో) దూకుడు పెంచాడు..
అవేశ్ ఖాన్ వేసిన 14 ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు.
• ఇదే ఓవర్ లో తిలక్ వర్మ (43) బౌండరీ రాబట్టాడు. 14 ఓవర్లకు స్కోరు 120/4
20:55(IST)
RR vs MI: నేహల్ వదేరా హాఫ్ సెంచరీ మిస్
• అశ్విన్ తన చివరి ఓవర్ లో ఆరు పరుగులు ఇచ్చాడు.
• ఈ క్రమంలో 13 ఓవర్లకు ముంబయి స్కోరు 101/4కి చేరింది.
నేహల్ వదేరా (18), తిలక్ వర్మ (37) పరుగులతో ఉన్నారు..
20:32(187)
RR vs MI: చాహల్ బౌలింగ్ లో తిలక్ వర్మ రెండు ఫోర్లు
• యుజ్వేంద్ర చాహల్ వేసిన 12 ఓవర్లో రెండో బంతి, చివరి బంతిని తిలక్ వర్మ (35) బౌండరీకి పంపాడు.
• 12 ఓవర్లకు స్కోరు 95/4 నేహల్ వధేరా (14) పరుగులతో ఉన్నాడు..
20:25(IST)
RR vs MI: నిలకడగా ఆడుతున్న ముంబయి బ్యాటర్లు
• ముంబయి బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.
• అశ్విన్ వేసిన 11వ ఓవర్లో 10 పరుగులు రాబట్టారు.
• చివరి బంతికి నేహల్ వధేరా (13) బౌండరీ సాధించాడు.
• 11 ఓవర్లకు స్కోరు 82/4 తిలక్ వర్మ (25) పరుగులతో ఉన్నాడు.
20:26(15T)
RR vs MI: 10 ఓవర్లు పూర్తి.. ముంబయి స్కోరు ఎంతంటే?
• అవేశ్ ఖాన్ వేసిన 10 ఓవర్ లో ఆరు పరుగులు వచ్చాయి.
• 10 ఓవర్లకు ముంబయి స్కోరు 72/4 తిలక్ వర్మ (21), నేహల్ వదేరా (7) పరుగులతో ఉన్నారు
20:20(1ST)
RR vs MI: తిలక్ వర్మ సిక్సర్.. 9 ఓవర్లో 10 రన్స
• అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి..
• రెండో బంతికి తిలక్ వర్మ (17) స్టాండ్లోకి పంపాడు.
• తర్వాత నాలుగు సింగిల్స్ వచ్చాయి..
• 9 ఓవర్లకు స్కోరు 66/4 నేహల్ వధేరా (6) పరుగులతో ఉన్నారు.
20:10(IST)
RR vs MI: చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చాహల్
• ఐపీఎల్ యుజేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు.
• ముంబయితో జరుగుతున్న మ్యాచ్లో మహ్మద్ నబీ (23)ని ఔట్ చేసి ఐపీఎల్లో 200వ వికెట్ను పూర్తి చేసుకున్నాడు.
• ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడు చాహలే.
• 7.3 ఓవరకు నబీ చాహల్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
• 8 ఓవర్లకు ముంబయి స్కోరు 56/4 నేహల్ వదేరా (4), తిలక్ వర్మ (9) పరుగులతో ఉన్నారు
20:09(1ST)
RR vs MI: ఏడో ఓవర్.. ఐదు పరుగులు
• అశ్విన్ ఏడో ఓవర్ కట్టుదిట్టంగా వేసి ఐదు పరుగులే ఇచ్చాడు.
• 7 ఓవర్లకు స్కోరు 50/3. మహ్మద్ నబీ (22), తిలక్ వర్మ (8) పరుగులతో ఉన్నారు.
20:04(IST)
RR vs MI: వరుసగా 6, 4, 4.. పవర్ ప్లే పూర్తి
• అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.
• తొలి బంతికి మహ్మద్ నబీ రెండు పరుగులు రాబట్టాడు.
• తర్వాత వరుసగా 6, 4, 4 బాదేశాడు. తర్వాత రెండు సింగిల్స్ వచ్చాయి.
• పవర్ ప్లే ముగిసేసరికి ముంబయి స్కోరు 45/3. తిలక్ వర్మ (6), నబీ (20) పరుగులతో ఉన్నారు..
20:00(IST)
RR vs MI: ఆచితూచి ఆడుతున్న ముంబయి బ్యాటర్లు
• ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబయి బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు.
• ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్ లో ఆరు పరుగులు వచ్చాయి.
• 5 ఓవర్లకు స్కోరు 27/3 మహ్మద్ నబీ (3), తిలక్ వర్మ (5) క్రీజులో ఉన్నారు.
19:51(IST)
RR vs MI: ముంబయికి బిగ్ షాక్.. సూర్యకుమార్ ఔట్
ముంబయి మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (10) ఔటయ్యాడు..
15:45(IST)
RR vs MI: రెండు ఫోర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్
• ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్ లో 11 పరుగులు వచ్చాయి.
• సూర్యకుమార్ యాదవ్ (10) రెండు ఫోర్లు బాదాడు.
3 ఓవర్లకు స్కోరు 20/2.
15:41(IST)
RR vs MI: ముంబయి రెండో వికెట్.. ఇషాన్ కిషన్ ఔట్
ముంబయికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే. పెవిలియన్ చేరాడు.
• సందీప్ శర్మ వేసిన 13 ఓవర్కు వికెట్ కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చాడు..
• తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. రాజస్థాన్ డీఆర్ఎస్ తీసుకుంది.
• సమీక్షలో ఇషాన్ ఔట్ అని తేలింది.
• 2 ఓవర్లకు ముంబయి 9/2 తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (1) క్రీజులో ఉన్నారు.
15:36(IST)
RR vs MI: ముంబయికి షాక్.. రోహిత్ శర్మ ఔట్
• ముంబయికి తొలి ఓవర్లోనే షాక్.. రోహిత్ శర్మ (6) ఔట్
• ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్ లో రెండో బంతికి ఫోర్ బాదిన రోహిత్.. ఐదో బంతికి సంజు శాంసను క్యాచ్ ఇచ్చాడు..
19:30(IST)
RR vs MI: హార్దిక్ పాండ్యకు స్పెషల్ మ్యాచ్..
హార్దిక్ పాండ్యకు ముంబయి తరపున ఇది 100వ మ్యాచ్.
19:20(IST)
RR vs MI: ముంబయి తుది జట్టులో ఉన్నది వీరే
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వదేరా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కౌయెట్టీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: నువాన్ తుషార, ఆకాశ్ మధ్వాల్, నమన్ ధీర్, శామ్స్ ములాని, డెవాల్డ్ బ్రెవిస్.
19:16(IST)
RR vs MI: రాజస్థాన్ రాయల్స్ (RR) తుది జట్టులో ఉన్నది వీరే
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మయర్, రోవ్ మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: జోస్ బట్లర్, కేశవ్ మహరాజ్, శుభమ్ దూబె, నవదీప్ సైని, టామ్ కోహ్లర్.
19:03(IST)
RR vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి
మరికాసేపట్లో రాజస్థాన్లో జరిగే మ్యాచ్లో ముంబయి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Rajasthan vs Mumbai Live
IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live UpdatesIPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates
IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates #IPL 2024 38th Match-RR vs MI Live Updates