...
HomeAP NewsMultibagger Stock-2024 : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన....

Multibagger Stock-2024 : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన….

Multibagger Stock : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. 94 నుంచి రూ. 11,370 కి పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం….

కరోనా తర్వాత స్టాక్క మార్కెట్లో కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. కొన్ని స్టాక్స్ ఇచ్చిన మల్టీబ్యాగర్ రాబడులతో పెట్టుబడిదారులు సంపద వందల రెట్లు పెరిగింది. ఇలాంటి స్టాక్ లలో ఒకటి ఎస్జీ మార్ట్ లిమిటెడ్. ఈ స్టాక్ కేవలం మూడు సంవత్సరాలలో తన వాటాదారులకు ఏకంగా 12,000 శాతం రిటర్నలు అందించి ఔరా అనిపించిది. స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,341.61 కోట్లుగా ఉంది. శుక్రవారం ట్రేడింగ్ లో ఈ స్టాక్ 2 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకి రూ. 11,371 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం కూడా ఇదే కావడం గమనార్హం.

ఊహించని లాభాలు..

Multibagger Stock : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. 94 నుంచి రూ. 11,370 కి పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం....
Multibagger Stock : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. 94 నుంచి రూ. 11,370 కి పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం….

బీఎస్ఈ డేటా ప్రకారం 2021 జనవరిలో రూ. 94 గా ఉన్న ఈ స్టాక్ ధర కేవలం మూడేళ్లలోనే రూ. 11,371 కి చేరి రికార్డు స్థాయిలో లాభాలను అందించింది. ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే మూడేళ్ల క్రితం ఈస్టాక్ లో రూ. 10,000 పెట్టుబడి ఉంటే ఇప్పుడది రూ. 12.10 లక్షలు అయి ఉండేది. అంటే 12,000 శాతం మల్టీబాగర్ రాబడులను ఈ స్టాక్ అందించింది.

Multibagger Stock భారీగా పెరిగిన లాభాలు..

సంస్థ ఆర్థికాంశాలను పరిశీలిస్తే, నిర్వహణ ఆదాయాలు, పన్ను అనంతర లాభాలు వంటి ప్రధాన వ్యాపార సూచికలు ఇటీవలి త్రైమాసిక కాలంలో తీవ్ర కదలికలను చూపించాయి. రెండో త్రైమాసికంలో సమయంలో రూ. 506 కోట్లుగా కంపెనీ రెవెన్యూ మూడో త్రైమాసికంలో రూ. 748 కోట్లకు చేరుకుంది. నికర లాభం రూ. 8 కోట్ల నుండి రూ. 17 కోట్లకు చేరి రెట్టింపు అయింది.

గతంలో..

వార్షిక ప్రాతిపదికన తక్కువ పనితీరు కారణంగా ప్రాథమిక లాభదాయకత కొలమానాలు 2021-22 సమయంలో ఈక్విటీపై రాబడి (RoE) 2.51 శాతం నుంచి 2022-23 సమయంలో 1.61 శాతానికి తగ్గడంతో క్షీణతను నివేదించింది. అంతేకాకుండా. ఇదే కాలంలో మూలధనంపై రాబడి (RoCE) 3.43 శాతం నుంచి 2.19 శాతానికి తగ్గింది

కంపెనీ గురించి..

2023 సెప్టెంబర్ త్రైమాసికం షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, కంపెనీ ప్రమోటర్లు 75 శాతం వాటాను కలిగి ఉన్నారు. పబ్లిక్ (రిటైల్) పెట్టుబడిదారులు కంపెనీలో మిగిలిన 25 శాతం వాటాను కలిగి ఉన్నారు. SG మార్ట్ లిమిటెడ్ ను గతంలో కిన్‌టెక్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ గా పిలచేవారు. 1985లో ఈ కంపెనీని స్థాపించారు. పవన, సౌరశక్తి పరిష్కారాలను అందించే వ్యాపారంలో అలాగే వివిధ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్‌స్ట్రక్షన్ (EPC) ప్రాజెక్ట్‌ల అమలులో నిమగ్నమై ఉంది.

Also follow below Links:👇👇👇👇👇

https://lsrallinonenews.com/https-lsrallinonenews-com-tcs-shares-jump/

https://lsrallinonenews.com/sony-zee-merger-termination-news-is-baseless/

https://t.me/lsrallinonejobs

https://lsrallinonenews.com/zee-entertainment-stock-plunges-10-as-reports-say-sony-plans-to-call-off-merger/

BSE Sensex – Live Sensex and Stock Values (bseindia.com)

NSE – National Stock Exchange of India Ltd: Live Share/Stock Market News & Updates, Quotes- Nseindia.com

ALL IN ONE NEWS
ALL IN ONE NEWShttp://lsrallinonenews.com
LSR All-in-One News brings you the latest updates, insightful analysis, and diverse perspectives on a wide range of topics. Explore a world of news, from global affairs to tech trends, lifestyle, science, and beyond. Stay informed, inspired, and connected with our comprehensive coverage, thought-provoking articles, and in-depth features. LSR All-in-One News is your go-to source for staying ahead in a rapidly evolving world. Dive into the news that matters to you, all in one place.”
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

chaitanya on Hello world!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.