Ram Mandir: 500 ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అసలు అయోధ్య రామ మందిరం ఎలా ఉంది. దాన్ని ఎలా నిర్మించారు. దాని ప్రత్యేకతలు ఏంటి. అయోధ్య రామాలయాన్ని ఎలా నిర్మించారు. ఆలయ లోపలి భాగం ఎలా ఉంది. అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Features of Ayodhya Ram Mandir-Telugu:
అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతోంది. యావత్ భారతావనితోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు ఇవాళ పండగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అంతా రామమయం అయిపోయింది. ఈ క్రమంలోనే అయోధ్య ఆలయ నిర్మాణం గురించి కొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం. అయోధ్యలో కొలువుదీరనున్న బాల రాముడి కోసం.. ఆలయాన్ని సాంప్రదాయ నగర శైలిలో నిర్మించారు. మొత్తం 2.77 ఎకరాల స్థలంలో నిర్మితం అయిన అయోధ్య రామ మందిరంలో 392 పిల్లర్లు, 44 తలుపులు, 5 మండపాలు ఉన్నాయి.
తూర్పు నుంచి పడమర వరకు అయోధ్య రామ మందిరం పొడవు 380 అడుగులు కాగా.. వెడల్పు 250 అడుగులు ఉంది. ఇక 161 అడుగుల ఎత్తుతో ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయ నిర్మాణానికి మొత్తం 392 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇక ఆలయంలో మొత్తం 44 తలుపులు ఉన్నాయి. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్లకు చెందిన చిత్రాలు చెక్కారు. శ్రీ రాముని చిన్ననాటి రూపమైన రామ్ లల్లా విగ్రహాన్ని 3 అంతస్థుల్లో నిర్మిస్తున్న ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ప్రధాన గర్భగుడిలో ఉంచారు.
ఇక అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంది. సింగ్ గేట్ నుంచి 32 మెట్లు ఎక్కి ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవచ్చు. ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఇక రామ మందిరానికి సమీపంలోనే ఒక బావి కూడా ఉంది. దీన్ని సీతా కూప అని పిలుస్తారు. ఇది పురాతన కాలం నాటిదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ సముదాయం నైరుతి భాగంలోని కుబేర్ తిల వద్ద జటాయువు విగ్రహంతో పాటు పురాతన శివుని ఆలయాన్ని పునరుద్ధరించారు.
మరోవైపు.. అయోధ్య రామ మందిర పునాదిని 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీటు-ఆర్‌సీసీతో నిర్మించారు. ఇది కృత్రిమ శిలలా తయారవుతుందని అధికారులు తెలిపారు. ఇంత పెద్ద ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము, సిమెంటు వాడలేదు. తేమ నుంచి నేలను రక్షించడానికి గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. ఆలయ సముదాయంలో నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని ప్రమాదాల రక్షణ కోసం నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కర్మాగారం, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని దేశ సంప్రదాయ, స్వదేశీ సాంకేతికతతో పాటు నగర శైలిలో నిర్మించారు. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.1100 కోట్లు ఖర్చు చేయగా.. ఆలయం మొత్తం పూర్తి కావడానికి మరో రూ.300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.
Features of Ayodhya Ram Mandir-Telugu
Features of Ayodhya Ram Mandir-Telugu
Features of Ayodhya Ram Mandir-Telugu
Table of Contents
Also Read 👇👇👇
Ayodhya Ram Mandir History: A timeline of devotion (lsrallinonenews.com)
Ayodhya Ram Mandir Pics-2024 – Lsrallinonenews.com
Divy Ayodhya App: భక్తుల కోసం @ Ayodhya Ram Mandir-2024 (lsrallinonenews.com)
[…] Features of Ayodhya Ram Mandir-Telugu-2024 (lsrallinonenews.com) […]
[…] వెండి హారాన్ని, హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు 1.265 కిలోల లడ్డూ, 108 అడుగుల పొడవ…, రాముడిపై తమ భక్తిని […]
[…] Features of Ayodhya Ram Mandir-Telugu-2024 (lsrallinonenews.com) […]