ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. మధ్యాహ్నం నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేసినట్టు సమాచారం. పీఎం నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే.. సోదాల్లో భాగంగా.. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వాంగ్మాలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ఇప్పటికే కవిత నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కీలక నేతలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని.. ఆందోళన చేస్తున్నారు. మోదీకి , ఈడీ అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అయితే.. కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇదే రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ప్రీప్లాన్డ్‌గానే.. సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంటును కూడా వెంట తీసుకొచ్చిన అధికారులు.. ముందుగానే 8:45 ఫ్లైట్ కోసం కవితకు కూడా టికెట్ కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారు అని ఈడీ అధికారులతో హరీశ్ రావు, కేటీఆర్.. వాగ్వాదానికి దిగారు.
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మల్కాజ్‌గిరిలో.. మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో కవిత ఇంటిపై సోదాలు చేయటం, ఐదు గంటల సోదాల అనంతరం అరెస్ట్ చేయటం సర్వత్రా సంచలనంగా మారింది.
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించినట్టు సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీలో కవితకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావించిన పలువురిని.. అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్టుగా అధికారులు తెలిపారు.
ఇప్పటికే.. ఈ కేసు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు.. అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. అయితే.. ఇప్పటికే ఈడీ ఎదుట రెండు మార్లు కవిత విచారణకు హాజరుకాగా.. ఆ తర్వాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీం ఈ నెల 19కు వాయిదా వేసింది.
Also Read:
MLC కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం..
Delhi Liquor Scam Case: లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాగా.. కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు నాలుగు బృందాలు ఏర్పడి.. ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. కవితతో పాటు.. ఆమె భర్త వ్యాపాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ సోదాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
MLC Kavitha Delhi Liquor Scam ED Raids:
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పటికే పలుమార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనూ.. ఈడీ నోటీసులు ఇవ్వగా విచారణకు కూడా హాజరయ్యారు. అంతకు ముందు సీబీఐ అధికారులు కూడా.. కవిత నివాసానికి వచ్చి విచారణ చేశారు. కాగా.. ఆ తర్వాత కూడా విచారణకు హాజరవ్వాలని.. ఈడీ, సీబీఐ నోటీసులివ్వగా.. ఆమె నిరాకరించారు. మహిళ అని కూడా చూడకుండా.. రాత్రి సమయాల్లో కూడా విచారణ చేపట్టడాన్ని ఖండిస్తూ.. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుప్రీంలో కొనసాగుతుండటంతో.. ధర్మాసనం నుంచి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు తాను విచారణకు రాలేనని చెప్పేశారు. ఇటీవల ఇచ్చిన నోటీసులకు సమాధానంగా.. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడ్డాయని.. తాను బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉండటంతో.. బిజీగా ఉంటానని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణకు రావటం వీలుపడదని.. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక పాత్ర పోషించారని.. ఈ పాలసీలో ఆమెకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధమున్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే.. కవిత పీఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. వాళ్లు ఇచ్చిన ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేయగా.. అందులో కవిత పేరును అధికారులు చేర్చారు. వారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకునే… కవితను విచారణకు పిలుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా.. ఆమె విచారణకు రాకపోవటంతో.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో సోదాలు చేసేందుకు ఈడీ, ఐటీ అధికారులే స్వయంగా వచ్చేశారు. దీంతో.. ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.
అయితే.. ఇప్పటికే అధికారం కోల్పోయి.. ఈ ఎన్నికల్లో అయినా మెజార్టీ సీట్లు సాధించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా.. గులాబీ నేతలు ఒక్కొక్కరిగా కారు దిగుతూ గులాబీ అధినేత కేసీఆర్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టూ.. ఇప్పటికే పార్టీని ఎలా గట్టెక్కించాలన్న టెన్షన్‌లో ఉన్న కేసీఆర్‌కు.. కవిత ఇంటిపై ఈటీ, ఐటీ సోదాలతో మరో తలనొప్పి వచ్చి పడ్డట్టయింది.
MLC Kavitha Delhi Liquor Scam ED Raids
ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case-2024
ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case
ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case
ED Arrests BRS MLC Kalvakuntla Kavitha after raids in connection with Delhi liquor Scam case
[…] […]