DGP Mahender Reddy Appointed as TSPSC Chairman | TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి
Table of Contents
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు.
DGP Mahender Reddy Appointed as TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. రెండురోజుల కిందట టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా చైర్మన్ నియమితులైన మహేందర్‌రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు.
టీఎస్‌పీఎస్‌పీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా..
కమిషన్ సభ్యులుగా నియమితులైన వారు 62 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. 1962లో డిసెంబర్3న జన్మించిన మహేందర్‌రెడ్డికి ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. ఇంకో 11 నెలలు ఆయనకు 62 సంవత్సరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.
మహేందర్ రెడ్డి గురించి క్లుప్తంగా..
About Mahender Reddy:1986 బ్యాచికి చెందిన మహేందర్రెడ్డి స్వస్థలం ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఏకోపాధ్యాయ పాఠశాలలోనే చదువుకున్నారు. రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. ఐదేళ్లపాటు జాతీయ పోలీసు అకాడమీలో బాధ్యతలు నిర్వహించిన ఆయన చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ కమిషనరేట్కు మొదటి కమిషనర్గా నియమితులయ్యారు.
ఇక్కడ ఆయన పోలీసుశాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మూడేళ్లపాటు సుదీర్ఘంగా సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత గ్రేహౌండ్స్, పోలీసు కంప్యూటర్స్ విభాగాల్లో విధులు నిర్వహించారు. కీలకమైన నిఘా విభాగాధిపతిగానూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కమిషనర్ గా నియమితులయ్యారు. స్నేహపూర్వక పోలీసింగ్ పేరుతో అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడంలో విశేష కృషిచేశారు. అనంతరం 2017 నవంబర్ లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Announced Padma Awards-2024 Full List – Lsrallinonenews.com
Republic Day 2024: History importance significance and why we celebrate it. – Lsrallinonenews.com
Social Stock Exchange-2024: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! – LSR Updates
[…] DGP Mahender Reddy Appointed as TSPSC Chairman-2024 | TSPSC ఛైర్మన్‌గా మాజ… […]
[…] DGP Mahender Reddy Appointed as TSPSC Chairman-2024 | TSPSC ఛైర్మన్‌గా మాజ… […]