CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple | రేపు మరో 2 గ్యారంటీలు..ఆ రెండు ఇవేనా..?మంత్రి సీతక్క కీలక ప్రకటన
CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple నుంచి మరో రెడు గ్యారంటీలు అమలు చేస్తారని మంత్రి సీతక్క ప్రకటించారు.
Table of Contents
ముఖ్యంష్యాలు:
- ఫిబ్రవరి 2న మరో 2 గ్యారంటీలు
- మంత్రి సీతక్క కీలక ప్రకటన
- ఆ రెండు గ్యారంటీలపై ఉత్కంఠ
సీఎం రేవంత్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 2) కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి మరో రెడు గ్యారంటీలు అమలు చేస్తారని మంత్రి సీతక్క ప్రకటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని.. ప్రజా సంక్షేమమే తమ మెుదటి ప్రాధాన్యమని చెప్పారు. అయితే రేపు సీఎం అమలు చేయనున్న ఆ రెండు గ్యారంటీలు ఏవీ అనేది ఆసక్తిని కలిగిస్తోంది.
ఎన్నికల హామీల్లో భాగంగా..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రస్తుతం రెండు అమలువుతున్నాయి. మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు పథకాలు అమలవుతున్నాయి. ఫిబ్రవరి 2న మరో రెండు గ్యారంటీలు అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి రెండు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి కేస్లాపూర్‌లో
సీఎం రేవంత్‌రెడ్డి కేస్లాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటంతో పాటు ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల స్మారక స్తూపం వద్ద స్మృతివనం పనులు ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు. అయితే రేపు సీఎం ప్రకటించబోయే రెండు గ్యారంటీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ గ్యారంటీలు ప్రకటిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మహిళలకి ప్రతినెల 2,500 నగదు బదిలీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇందరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం పథకాల్లో రెండింటిని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
మహిళలకు ప్రతినెల 2,500 ఇచ్చే పథకానికి ప్రజాపాలనలో 92.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారిని మినహాయిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి వస్తుందనే అంశంపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఆ విధంగా లెక్క వేసినా దాదాపు 50 లక్షల మందికి ఇవ్వాల్సి రావచ్చని సమాచారం. ప్రతినెల ఎంత మొత్తం అవసరం అవుతుందో నిర్ధరణకు వచ్చి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 500కే గ్యాస్ సిలిండర్ కోసం 91.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తే దాదాపు 2,200 కోట్లకి పైగా ప్రభుత్వంపై భారం పడనుంది. ఆ రెండు అమలు చేస్తే మహాలక్ష్మీ పథకంలో పూర్తిగా నెరవేర్చినట్లు అవుతుంది.
అలా కాకుండా ప్రత్యేకంగా..
అలా కాకుండా ప్రత్యేకంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలంటే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేత వంటి పథకాల అమలుకు మెుగ్గు చూపే ఛాన్సు ఉంది. గృహజ్యోతి పథకం దాదాపు 90 లక్షల కుటుంబాలు అప్లయ్ చేసుకున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి అమలుకు సంబంధిత మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు.
CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple
Also Read👇👇
సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న CM రేవంత్.. మళ్లీ అక్కడి నుంచే మెుదలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ పెట్టింది. ఈ ఏఫ్రిల్‌నే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడదలకానుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 26 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ మొదలు పెట్టనున్నారు. అన్ని జిల్లాల్లోనూ సీఎం పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్‌ల ఇన్‌ఛార్జ్ మంత్రులు, అబ్జర్వర్లతో సీఎం వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే సీఎం రేవంత్ తనకు కలిసొచ్చిన, సెంటిమెంట్‌గా భావిస్తున్న ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నహాక సమావేశాలు ప్రారంభించాలని భావిస్తున్నారట. అక్కడ్నుంచి మెుదలు పెడితే ఇక తిరుగుండదనే భావనలో ఆయన ఉన్నారనదే పార్టీ వర్గాల టాక్. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పదవి చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సమావేశాన్ని ఇంద్రవెల్లిలో నిర్వహించారు. 9 ఆగస్టు 2021లో దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సభ పేరిట బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను రేవంత్ ప్రజలకు వివరించారు.
ఆ తర్వాత పీసీసీ హోదాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు, సభలు, సమావేశాలు విజయవంతం కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇంద్రవెల్లిని రేవంత్ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఆ సభతోనే సీఎం హోదాలోనూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభ పెట్టాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారట.
అక్కడ అమరుల స్మారక స్మృతి వనం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా.. సీఎం హోదాలో మెుదటి బహిరంగ సభను అక్కడే నిర్వహించనున్నారు. పీసీసీ చీఫ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఇంద్రవెల్లి ఇచ్చిన మనోస్థైర్యం, సీఎం పదవిలోనూ ఇవ్వాలని రేవంత్ సెంటిమెంట్‌గా ఫీలవుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే మెుదటి బహిరంగ సభను అక్కడ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఈ సభపై ప్రభుత్వ, పార్టీ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి..
Apply for TSRJC CET 2024 Notification (lsrallinonenews.com)
Wipro Recruitment 2024 For Quality Assurance Analyst – Lsrallinonenews.com
CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple
CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple
CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple
[…] […]
[…] రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. […]