Central Govt Plan May Spur Spiritual Tourism in Telangana | టెంపుల్ టూరిస్ట్ హబ్‌గా తెలంగాణ.. కేంద్రం స్పెషల్ ఫోకస్, ఆ ఆలయాలకు మహర్దశ!
Table of Contents:
రాష్ట్రాల్లోని ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ల సమగ్ర అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని ప్రకటించారు. ఆమె ప్రకటనతో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రధానాంశాలు:
- టెంపుల్ టూరిస్ట్ హబ్‌గా తెలంగాణ
- రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాల అభివృద్దిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
- ఆ ఆలయాలకు మహర్దశ
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్‌లో గురవారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా.. పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు లక్షద్వీప్‌తో సహా ఇతర దీవుల్లో పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రా, ఇతర సౌకర్యాల కోసం ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని ప్రకటించారు.
తెలంగాణలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై..
కేంద్రమంత్రి ప్రకటనతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో అరడజనుకుపైగా ప్రసిద్ధ, చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కేంద్రం కనుక అబివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. తెలంగాణ టెంపుల్ టూరిజం హబ్‌గా మారనుంది. రాష్ట్రంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం, వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం, బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం, అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, వరంగల్‌లోని రామప్ప, భద్రకాళి ఆలయాలు ముఖ్యమైనవి.
ఇవే కాకుండా..
ఇవే కాకుండా అనేక ఇతర చిన్న పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పండగ సీజన్లలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు. అయితే కొన్ని ఆలయాల్లో సరైన వసతులు లేవు. యాదాద్రి, భద్రచాలం వంటి ఆలయాలను మినహాయిస్తే.. చాలా ఆలయాల్లో మౌళిక సదుపాయాలు సరిగ్గా లేవు, యాత్రికుల కోసం కాటేజీలు, భోజనశాలలు, మరికొన్ని ప్రాథమిక వసతులు లేకపోవటం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తుంది.
అయితే తాజాగా..
అయితే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు మహర్దశ రానుంది. తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారే ఛాన్స్ ఏర్పిడింది. కేంద్రం చెప్పిన విధంగా పుణ్యక్షేత్రాలను అభివృద్ది చేస్తే.. పర్యాటకంగా అభివృద్ది సాధించటంతో పాటు ఆలయాలకు ఆదాయం పెరుగుతుందని ఎండోమెంట్ అధికారులు అంటున్నారు. పలువురు ఉపాధి పొందటమే కాకుండా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
Central Govt Plan May Spur Spiritual Tourism in Telangana
Central Govt Plan May Spur Spiritual Tourism in Telangana
Central Govt Plan May Spur Spiritual Tourism in Telangana | టెంపుల్ టూరిస్ట్ హబ్‌గా తెలంగాణ.. కేంద్రం స్పెషల్ ఫోకస్, ఆ ఆలయాలకు మహర్దశ!
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి..