Best Penny Stocks-2024 : ఐదు రోజుల్లోనే 65 శాతం పెరిగిన పెన్నీ స్టాక్ .. ముకేశ్ అంబానీ రూ. 3,300 కోట్ల పెట్టుబడితో పైపైకి దూసుకెళ్తున్న షేరు ధర..
Table of Contents
Best Penny Stocks-2024:
టెక్స్ టైల్ స్టాక్ ఐదు రోజులుగా అదరగొడుతోంది. రిలయన్స్ ఇంస్ట్రీస్ రూ. 3,300 కోట్ల పెట్టుబడితో ఐదు సెషన్లలోనే 65 శాతం పెరిగి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.
Alok Industries-అలోక్ ఇండస్ట్రీస్:
ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3,300 కోట్ల పెట్టుబడి ప్రకటించిన తర్వాత టెక్స్ టైల్ స్టాక్ అలోక్ ఇండస్ట్రీస్ ధర గణనీయంగా పెరిగింది. కేవలం ఐదు రోజుల్లోనే షేరు ధర 65 శాతం పెరిగి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం స్టాక్ కొత్త శిఖరాలకు చేరింది. 2024 జనవరి 2న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అలోక్ ఇండస్ట్రీస్ కు నిధుల ఇన్ఫ్యూషన్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు ఊ బుల్లిష్ మొదలైంది. 2023 డిసెంబరు 23న షేర్‌హోల్డర్లు ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా 3,300,00,00,000 (9%) నాన్ కన్వర్టబుల్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్‌లను ఒక్కొక్కటి రూ. 1 చొప్పున జారీ చేయడం ద్వారా అలోక్ ఇండస్ట్రీస్‌లో ముఖ్యమైన వాటాను రిలయన్స్ పొందింది.
ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకులు ఇప్పుడు అలోక్ ఇండస్ట్రీస్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్‌లో స్టాండ్ అవుట్ పెర్ఫార్మర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఒక్కో షేరు ధర రూ. 27.53 వద్ద ప్రారంభమై, రూ. 27.14 వద్దే ముగిసింది. స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూ అప్ ట్రెండ్ ను కొనసాగించింది.
రోజూవారీ ట్రేడింగ్ సెషన్‌లో అలోక్ ఇండస్ట్రీస్ రూ.27.4 కనిష్ట స్థాయి నుంచి రూ. 32.56 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 16,107.24 కోట్లుగా ఉంది. ఇది ఇన్వెస్టర్ల నుంచి కొత్తగా వచ్చిన విశ్వాసం, ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.
ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ. 32.56 గా ఉంది. 52 వారాల కనిష్టం రూ. 10.07 గా ఉంది. ఇది స్టాక్ అస్థిర ప్రయాణాన్ని హైలైట్ చేస్తుంది. ప్రస్తుత పెరుగుదల గణనీయమైన రికవరీ, మరింత వృద్ధికి సంభావ్యతను సూచిస్తుంది. బీఎస్ఈలో ట్రేడింగ్ పరిమాణం ఆకర్షణీయమైన 3.88 కోట్ల షేర్లకు చేరుకుంది. ఇది అలోక్ ఇండస్ట్రీస్ పై ఉన్న ఆసక్తి, కార్యాచరణను తెలియజేస్తోంది.
Penny Stocks : Maagh Advertising and Marketing Services Ltd-మాగ్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్:
మీడియా రంగానికి పెన్నీ స్టాక్ మాగ్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ గత వారం రూ. 165 వద్ద ట్రేడ్ అయింది. అయితే ఫిబ్రవరి 5 నుంచి ఈ షేరు రూ. 15 కంటే తక్కువ ధరకు ట్రేడవుతోంది. దీనికి కారణం కంపెనీ స్టాక్ 1:10 నిష్పత్తిలో స్టాక్ ను స్ప్లిట్ చేసింది. అలాగే 1:4 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా చెల్లించింది. దీంతో షేర ధర భారీగా తగ్గింది. అయితే మార్కెట్ క్యాప్ పై ఎలాంటి ప్రభావం లేదు. స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూకి సర్దుబాటు చేయడానికి ఈక్విటీ షేర్ల కేటాయింపును కంపెనీ బోర్డు కొద్ది రోజుల క్రితమే ఆమోదించింది.
ఫిబ్రవరి 6న కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫిబ్రవరి 5 వరకు రూ. 10 ముఖ విలువ కలిగి ఉన్న ఒక్కో షేరును కలిగి ఉన్నవారి డీమ్యాట్ ఖాతాల్లో అవి 10 షేర్లుగా మారాయి. అంటే రూ. 10 ముఖ విలువ కలిగిన స్టాక్ ను రూ. 1 ముఖ విలువతో 10 షేర్లుగా కంపెనీ విభజించింది. ఫిబ్రవరి 6న వీటిని కేటాయించింది.
Best Penny Stocks-2024:లిస్టెడ్ కంపెనీలు సాధారణంగా ఇప్పటికే యాజమాన్యంలోని షేర్లను స్టాక్ స్ప్లిట్ ద్వారా చాలా చిన్న షేర్లుగా ప్రకటిస్తాయి. షేర్లను చిన్న పరిమాణాలుగా విభజించడం ద్వారా లిక్విడిటీని మెరుగుపరచడం కోసం ఇలా చేస్తాయి. షేర్ల ముఖ విలువ విభజన నిష్పత్తికి అనులోమానుపాతంలో తగ్గుతుంది. అయితే, కంపెనీ షేర్ క్యాపిటల్, నిల్వలపై ఎలాంటి ప్రభావం ఉండదు. స్టాక్ స్ప్లిట్‌లో స్టాక్ ధర విలువ తగ్గినప్పటికీ, నిర్దిష్ట స్టాక్ పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్ల సంఖ్య పెరుగుతుంది.
4,50,02,500 (నాలుగు కోట్ల యాభై లక్షల రెండు వేల ఐదు వందల) ఈక్విటీ షేర్ల కేటాయింపును కూడా బోర్డు ఆమోదించినట్లు మాగ్ తెలిపింది. రూ. 1 ముఖ విలువతో ప్రతి నాలుగు షేర్లకు ఒక షేరును బోనస్ గా అందిందినట్లు తెలిపింది. అంటే స్టాక్ స్ప్లిట్ తర్వాత ఈ బోనస్ షేర్లను కూడా జారీ చేసింది. దీనికి కూడా రికార్డు తేదీ ఫిబ్రవరి 5 గానే ఉంది. అంటే ఆ తేదీ వరకు ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు జమ అయ్యాయి. స్టాక్ స్ప్లిట్ లాగానే, బోనస్ షేర్లు కూడా లిస్టెడ్ కంపెనీలు నిర్వహించే కార్పొరేట్ చర్యలు.
బోనస్ షేర్లు ప్రస్తుతం ఉన్న వాటాదారులకు మాత్రమే నిర్దిష్ట నిష్పత్తిలో ఉచితంగా జారీ చేయబడతాయి. ఈ కార్పొరేట్ చర్య కింద కంపెనీ ఈక్విటీ షేర్ల ప్రస్తుత ముఖ విలువతో కొత్త షేర్లు జారీ చేస్తుంది.
ఫిబ్రవరి 7న బీఎస్ఈలో ఈ స్టాక్ ధర 3.10 శాతం పెరిగి రూ.14.95 వద్ది స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 336.39 కోట్లుగా ఉంది. అలాగే బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో ఈ స్టాక్ సరి కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ. 15.20 ని తాకింది. స్టాక్ స్ప్లిట్ కారణంగా ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.1.12 గా ఉంది. ప్రస్తుతందాని కనిష్ట స్థాయిల నుంచి 1,234.82 శాతం లాభపడింది.
Penny Stock- Sarveshwar Foods-సర్వేశ్వర్ ఫుడ్స్:
చాలా పెన్నీ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి కోవకే చెందిన రూ. 10 విలువ గల ఎఫ్ఎంసీజీ(FMG) సెక్టార్ కంపెనీ సర్వేశ్వర్ ఫుడ్స్ స్టాక్ అదరగొడుతోంది. గత రెండు రోజులుగా దాదాపు 10 శాతం పెరుగుతూ అప్పర్ సర్క్యూట్ కొడుతోంది. మంగళవారం నాటి ట్రేడింగ్ లో 9.6 శాతం పెరిగి మార్కెట్ ముగిసే సమయానికి 9.70 శాతం వద్ద ముగిసింది. ఇవాళ ఇప్పటికే 4 శాతానికిపైగా పెరిగి రూ. 10.10 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ స్టాక్ కొనుగోలు చేసిన వారికి లక్ కలిసొచ్చిందని చెప్పవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
సర్వేశ్వర్ ఫుడ్స్ కంపెనీ గతేడాది 2023 ద్వితీయార్ధంలో షేర్ల విభజన చేపట్టింది. 1:10 నిష్పత్తిలో విభజించింది. అంటే ఒక షేరును 10 షేర్లుగా మార్చింది. ఆ తర్వాత ఒక షేరు ఉన్న వారికి 2 షేర్లు బోనస్ అందించింది. దీంతో ఆరు నెలలకు ముందు ఈ కంపెనీలో ఒక షేరు కలిగి ఉన్న వారికి ఏకంగా 20 షేర్లు డీమ్యాట్ ఖాతాలోకి చేరినట్లయింది. ఈ సర్దుబాట్ల కారణంగా సర్వేశ్వర్ షేరు ధర రూ. 10 కంటే తక్కువకు చేరింది. గత నెల రోజుల్లోనే ఈ కంపెనీ స్టాక్ ఏకంగా 68 శాతం మేర పెరిగింది. అలాగే గత 5 ఏళ్లలో చూసుకుంటే 319 శాతం పెరిగింది. దీని ప్రకారం చూసుకుంటే రూ. 50 వేల పెట్టుబడి ఇప్పుడు రూ.2 లక్షలకుపైగా ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటె ఇది ఎక్కువ రాబడి అని చెప్పవచ్చు.
Best Penny Stocks-2024:USFDA సర్టిఫై చేసిన సర్వేశ్వర్ ఫుడ్స్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ బాస్మతి, ఇతర బియ్యం ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహిస్తోంది. వాల్ నట్స్, రాజ్మా, యాపిల్, బ్లాక్ మోరెల్స్, కాలా జీరా వంటి ఇతర ప్రామాణికమైన హిమాలయన్ డిలైట్ల సేకరణ కోసం మరో రెండు ఎస్ఎఫ్ఓల్ చౌపల్స్ ఏర్పాటు చేసింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో చూసుకుంటే సర్వేశ్వర్ ఫుడ్స్ రూ. 10. 15 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో రూ. 10 కి పడిపోయి మళ్లీ పుంజుకుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 15. 69 గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 4 వద్ద ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 982. 21 కోట్లుగా ఉంది.
Best Penny Stocks-2024 | Alok Industries | Maagh Advertising and Marketing Services Ltd | Sarveshwar Foods
Best Penny Stocks-2024 # Best Penny Stocks-2024 #
Multibagger Stock-2024 : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన (lsrallinonenews.com)
Jana Small Finance Bank(SFB) Limited IPO Details with GMP-2024 – Lsrallinonenews.com
Capital Small Finance Bank(SFB) Limited IPO Details With GMP-2024 – Lsrallinonenews.com