Andhra Pradesh Public Service Commission(APPSC) : ఏపీపీఎస్సీ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో(APPCB) గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులను((Analyst Grade-II Posts) భర్తీ చేయనుంది.
AP Pollution Control Board Analyst Grade 2 Jobs Recruitment 2024 in Telugu:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో(APPCB) అనలిస్ట్ గ్రేడ్-2 (Analyst Grade-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటీ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
Table of Contents
ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి.
ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.
AP Pollution Control Board Analyst Grade 2 Jobs Recruitment 2024 Overview:
AP Pollution Control Board Analyst Grade 2 Jobs Recruitment 2024: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్-2 (Analyst Grade-2) ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టుల సంఖ్య:
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(APPCB) లో అనలిస్ట్ గ్రేడ్-2 (Analyst Grade-2) ఖాళీలు మొత్తం 18 పోస్టులను భర్తీచేయనున్నారు.
పోస్ట్ పేరు(Post Name):
కాలుష్య నియంత్రణ మండలి లో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టు( Analyst Grade-II).
విద్యార్హతలు:
బ్యాచిలర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ/ బయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి:
01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు; ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారు కమిషన్ వెబ్‌సైట్‌తో లాగిన్ చేసి(ఆన్‌లైన్ విధానంలో) అప్లయ్ చేసుకోవాలి..
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు రెండు పేపర్స్ తో పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష లో మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటవ పేపర్ లో 150 ప్రశ్నలు,150 మార్కులు కు ఇస్తారు. రెండవ పేపర్ లో 150 ప్రశ్నలు 300 మార్కులు కి ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది. (కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు)
పరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాలపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2(సంబంధిత సబ్జెక్టు): 150 ప్రశ్నలు-350 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు కేటాయించారు. రాతపరీక్షలో కటాఫ్ మార్కులను ఓసీ/స్పోర్ట్స్‌పర్సన్స్/ఎక్స్-సర్వీస్‌మెన్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 మార్కులుగా; బీసీలకు 35 మార్కులుగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
ప్రాక్టికల్ పరీక్షలు:
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఫ్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30గా, బీసీలకు 35గా, ఓసీలకుు 40 మార్కులుగా నిర్ణయించారు.
జీతం:
ఈ అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టుకు నెలకు రూ.48,440 – రూ.1,37,220 జీతం చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.04.2024 (11:59 PM).
AP Pollution Control Board Analyst Grade 2 Jobs Recruitment 2024
మరిన్ని జాబ్స్ లింక్స్ కోసం క్లిక్ చేయండి
APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com
AP Pollution Control Board Analyst Grade 2 Jobs Recruitment 2024 in Telugu
AP DME Assistant Professor Recruitment 2024 – Lsrallinonenews.com
NIACL Mumbai Notification for 300 Assistant Posts-2024 – Lsrallinonenews.com
Hello colleagues, how is everything, and what you desire
to say about this piece of writing, in my view its really
awesome designed for me.
TQ..!!