AP Govt to Release YSR Cheyutha Scheme Funds on March 7th in Anakapalle: ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొద్దిరోజులుగా పెండింగ్ పడుతున్న నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయాల్సి ఉంది.. కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే తాజాాగా ప్రభుత్వం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అనకాపల్లిలో చేయూత పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
Table of Contents
ముఖ్యాంశాలు :
- ఏపీలో మహిళలకు తీపి కబురు
- చేయూత నిధులపై స్పష్టత
- ఒక్కో అకౌంట్‌లో రూ.18,750
AP Govt to Release YSR Cheyutha Scheme Funds on March 7th in Anakapalle
ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలకు ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్సార్ చేయూత పథకం నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలోనే డబ్బుల్ని విడుదల చేయాల్సి ఉంది.. కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. వైఎస్సార్ చేయూత పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చి 7న అనకాపల్లిలో బటన్ నొక్కి విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న.. SC,ST,OBC మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేస్తోంది.. ఇలా నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది జగన్ సర్కార్.
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం..
ఏపీకి చెందిన SC,ST,OBC, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళ వయస్సు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డు, రైస్ (రేషన్) కార్డ్, బ్యాంకు అకౌంట్ ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.10వేలు, పట్టణ ప్రాంతాల వారికైతే రూ.12వేలు మించి ఉండకూడదు. కుటుంబ మొత్తానికి మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులు. అలాగే కుటుంబానికి సంబంధించిన కరెంటు మీటర్ వినియోగం 6 నెలల సరాసరి 300 యూనిట్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం..Application Process
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు పట్టణ ప్రాంతంలో ఉంటే.. వారి ఇంటి స్థలం 750 చదరపు గజాల మించి ఉండకూడదు. అలాగే కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయపన్ను చెల్లించకూడదు.. కుటుంబంలో ఎవరూ కూడా నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉండరాదు. అప్లికేషన్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ పత్రం (InCome Certificate), బ్యాంకు పాస్ బుక్(Bank Passbook), రేషన్ కార్డు(Ration Card), OTP Authentication, Bio eKYC, Iris Authentication చేసుకోవాలి. వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకొనుటకు అవకాశం ఉంటుంది. పైన తెలిపిన ధ్రువపత్రాల జిరాక్స్ లతో వాలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
మొబైల్ అప్లికేషన్ ద్వారా..
వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి ప్రారంభమవుతుంది. వాలంటీర్లు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ అధికారికి అందజేస్తారు. ఆ తర్వాత వాటిని నవశకం పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. అనంతరం లబ్ధిదారుల వివరాలు సిక్స్ స్టెప్ validationలో పాస్ అయిన వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
వెన్నెల కిషోర్ చారి 111 మూవీ రివ్యూ | Chaari 111 Movie Review in Telugu-2024 – LSR Updates
TS Mega DSC Notification 2024 Out for 11062 SGT, PET, SA Posts, Apply Online – Lsrallinonenews.com
AP Govt to Release YSR Cheyutha Scheme Funds on March 7th in Anakapalle
PM Modi Introduces 4 Astronauts for Gaganyaan Mission 2024 – Lsrallinonenews.com
SSC Selection Post Phase 12 Recruitment 2024 Out for 2049 Posts, Apply Now – Lsrallinonenews.com
AP Govt to Release YSR Cheyutha Scheme Funds on March 7th in Anakapalle