Airtel 49 Recharge Offer Unlimited Data Plan Know Full Details In Telugu: ఎయిర్‌టెల్ యూజర్లకు ఆ కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు రోజుకు 6GB డేటా ఇచ్చేది.. ఇకపై దాన్ని 20GB వరకు పెంచింది. అంతేకాదు రూ.49తో రీఛార్జ్ చేస్తే ఒకరోజు అన్‌లిమిటెడ్ డేటాను పొందొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే చూసెయ్యండి.
Table of Contents
ముఖ్యాంశాలు:
- రూ.99తో 2 డేస్ అన్‌లిమిటెడ్ డేటా..
- అధికారికంగా ప్రకటించిన ఎయిర్‌టెల్
- జియోకు గట్టి పోటీ ఇవ్వడానికే..!
Airtel 49 Recharge Offer Unlimited Data Plan Know Full Details In Telugu:
Airtel 49 Recharge Offer మీరు మీ స్మార్ట్‌ఫోన్లో ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటారా? ఏదైనా సినిమాలు లేదా ఇతర వీడియోలు చూడటంతో డేటా త్వరగా అయిపోతుందని బాధపడ్తున్నారా? ఈ సమయంలో అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్ తక్కువ బడ్జెట్లో కావాలని చూస్తున్నారా? అలాంటి వారి కోసమే ఎయిర్‌టెల్ కంపెనీ అదిరిపోయే ఆఫర్‌తో వచ్చేసింది. ఎయిర్‌టెల్ యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పాత రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చేసింది. కొత్తగా ప్రకటించిన రీఛార్జ్ ప్లాన్లో ఒక దానిలో పెద్ద మార్పే చేసింది.
ఈ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా యూజర్లు ప్రతిరోజూ అన్‌లిమిటెడ్ డేటాను పొందొచ్చు. రూ.49తో రీఛార్జ్ చేసుకున్న వారు డేటా వాడకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మీరు ఇంట్లో కూర్చోని లేదా ఇంకా ఎక్కడైనా మీ డేటాను సులభంగా వాడుకోవచ్చు. 20GB వరకు అన్‌లిమిటెడ్ డేటా అందజేయనుంది. ఆ తర్వాత కూడా ఇంటర్నెట్ పని చేస్తుంది. కాకపోతే నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. ప్లాన్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది.
యూజర్ల సంఖ్య పెంచుకునేందుకు..
ఇంతకుముందు ఒకరోజుకు కేవలం 6GB డేటా లిమిట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు దీన్ని మూడు రెట్లకు పైగా పెంచింది. డేటా వినియోగంలో తమ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఎయిర్‌టెల్ కంపెనీ ఈ మార్పులు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్న యూజర్లు రోజువారీ డేటా కోటా పూర్తయినప్పుడు ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ కావాలనుకునే యూజర్లు తప్పనిసరిగా యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్ కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఇది అదనపు డేటా అవసరమైన వారికి మాత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
రూ.99తో రీఛార్జ్ చేస్తే..
అంతేకాదు ఎయిర్‌టెల్ కంపెనీ మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.99తో రీఛార్జ్ చేసుకుంటే రెండు రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటాను తీసుకొచ్చింది. తక్కువ డబ్బుతో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి కంపెనీ ఇలాంటి ఆఫర్లు ఇస్తోంది. ఈ రీఛార్జ్ ప్యాక్ కావాలనుకునే వారు తమ ఫోన్లో Airtel Thanks యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో రీఛార్జ్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకుని ఈ డేటా ఆఫర్ పొందొచ్చు. అలాగే Airtel 5Gని యాక్టివేట్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడి నుంచి సెల్యూలార్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేసి, ఆపై ఎయిర్‌టెల్ సిమ్‌పై క్లిక్ చేసి 5G నెట్వర్క్‌పై క్లిక్ చేయాలి.
ఇతర సర్వీసులు..
భారతీ ఎయిర్‌టెల్ న్యూఢిల్లీలో ఒక భారతీయ మల్టీ నేషనల్ టెలి కమ్యూనికేన్ సర్వీస్ కంపెనీ. ఇది దక్షిణ ఆసియా, ఆఫ్రికాతో సహా 18 దేశాలతో పాటు అనేక దీవులలో పని చేస్తుంది. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 5G, 4G, LTE లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తోంది. వీటితో పాటు ఫిక్సడ్ లైన్ బ్రాడ్ బ్యాండ్, వాయిస్ సేవలను అందిస్తోంది. జియోకి గట్టి పోటీ ఇవ్వడానికే దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 5G మూడు వేలకు పైగా నగరాల్లో ప్రారంభించింది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
PM Surya Ghar Muft Bijli Yojana 2024: Apply Online, Benefits, Eligibility – Lsrallinonenews.com
Airtel 49 Recharge Offer Unlimited Data Plan Know Full Details In Telugu
AP TRT Recruitment-2024 for 4,579 SA/SGT Posts – Lsrallinonenews.com
Multibagger Shares-1000% profit in 3 years..! – Lsrallinonenews.com
Airtel 49 Recharge Offer Unlimited Data Plan Know Full Details In Telugu
Hello There. I discovered your blog using msn. That is a very smartly written article.
I’ll make sure to bookmark it and come back to learn more
of your helpful information. Thanks for the post.
I’ll definitely comeback.
Rhank You!!