Indiramma Indlu Scheme Applications Filtering through Artificial Intelligence in Telangana
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు లెటేస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ అఫ్లికేషన్లు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఫిల్టర్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Table of Contents
ప్రధానాంశాలు:
- పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
- లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ
- ఏఐ టెక్నాలజీ ద్వారా అప్లికేషన్ల ఫిల్టర్
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ జర్నీ, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమా పరిధి రూ.10 లక్షలకు పెంచారు. ఫిబ్రవరిలో మరో రెండు హామీలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా పాలన పేరిట అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద…
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని; స్థలం లేనివారికి స్థలం కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కాంగెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 84 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం వచ్చిన అప్లికేషన్లు, రెండింటి కోసం వచ్చిన అఫ్లికేషన్లను వేరుచేస్తున్నారు. కొంతమంది వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్లయ్ చేశారో తెలుసుకునేందుకు లెటేస్ట్ టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఆ తరవాత ఆయా దరఖాస్తుదారులను సంప్రదించి వారు కోరుకున్న చోట ఆమోదం తెలిపి.. మిగిలిన దరఖాస్తులను రిజెక్ట్ చేయనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఇక ఒక్కో కుటుంబంలో…
ఇక ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెళ్లిళ్ల తరవాత ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపజేయరని తెలిసింది. అఫ్లికేషన్లు ఫిల్టర్ చేసిన అనంతరం గ్రామసభలు నిర్వహించి.. అర్హులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి.. ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రణాళికను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది.
హైదరాబాద్: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందు కోసం గృహ నిర్మాణం శాఖ అధికారులు మూడు రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ మూడు డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ప్రభుత్వం ఏదో ఒక దానిని ఎంపిక చేస్తుందా? లేక మూడు డిజైన్లను ఎంపిక చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
[…] […]
[…] […]
[…] జాబ్ క్యాలెండర్.. […]
[…] అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం […]