ఐపీఎల్ అన్ని జట్ల పూర్తి షెడ్యూల్ ఇదే | BCCI Announces Full Schedule of IPL 2024
BCCI Announces Full Schedule of IPL 2024: ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. తొలుత 21 మ్యాచ్‌లకే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు మిగతా మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను వెల్లడించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో, ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించనున్నారు. మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనుండగా.. మే 2, మే 8, మే 16, మే 19వ తేదీల్లో సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఆడనుండటం గమనార్హం.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024 కోసం ఇంతకు ముందు 21 మ్యాచ్‌లకే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ సెకండ్ పార్ట్‌ను విదేశాల్లో నిర్వహిస్తారని ప్రచారం జరగ్గా.. స్వదేశంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో, ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించనున్నారు. మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 24న జరిగే క్వాలిఫైయర్-2తోపాటు మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.
పంజాబ్ కింగ్స్‌కు సెకండ్ హోం అయిన ధర్మశాల స్టేడియంలో రెండు మ్యా్చ్‌లు జరగనున్నాయి. మే 5న చెన్నై, మే 9న ఆర్సీబీతో పంజాబ్ ధర్మశాలలో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ తన సెకండ్ హోం గ్రౌండ్ అయిన గువహటిలో రెండు మ్యాచ్‌లను ఆడనుంది. మే 15న పంజాబ్ కింగ్స్, మే 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లను రాజస్థాన్ గువహటిలో ఆడుతుంది.
ఈసారి ఐపీఎల్ టీమ్‌లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతోపాటు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో.. ఒక గ్రూప్‌లోని జట్లు తమ గ్రూపులోని జట్లతో ఒకసారి తలపడితే.. వేరే గ్రూపులోని జట్లతో రెండుసార్లు చొప్పున తలపడతాయి. గ్రూప్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ – Sunrisers Hyderabad
* కోల్‌కతా x సన్‌రైజర్స్ – మార్చి 23, కోల్‌కతా
* సన్‌రైజర్స్ x ముంబై ఇండియన్స్ – మార్చి 27, హైదరాబాద్
* గుజరాత్ x సన్‌రైజర్స్ – మార్చి 31, అహ్మదాబాద్
* సన్‌రైజర్స్ x చెన్నై – ఏప్రిల్ 5, హైదరాబాద్
* పంజాబ్ కింగ్స్ x సన్‌రైజర్స్ – ఏప్రిల్ 9, మొహాలి
* ఆర్సీబీ x సన్‌రైజర్స్ – ఏప్రిల్ 15, బెంగళూరు
* ఢిల్లీ x సన్‌రైజర్స్ – ఏప్రిల్ 20, ఢిల్లీ
* సన్‌రైజర్స్ x ఆర్సీబీ – ఏప్రిల్ 25, హైదరాబాద్* చెన్నై x సన్‌రైజర్స్ – ఏప్రిల్ 28, చెన్నై
* సన్‌రైజర్స్ x రాజస్థాన్ – మే 2, హైదరాబాద్
* సన్‌రైజర్స్ x లక్నో – మే 8, హైదరాబాద్
* సన్‌రైజర్స్ x గుజరాత్ – మే 16, హైదరాబాద్
* సన్‌రైజర్స్ x పంజాబ్ – మే 19, హైదరాబాద్
సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌ల్లో.. మార్చి 31న గుజరాత్‌తో, మే 19న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుండగా.. మిగతా మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
IPL 2024 SCHEDULE….!!! ⭐ pic.twitter.com/M80vWCBE40
— Johns. (@CricCrazyJohns) March 25, 2024
ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ – IPL 2024 Full Schedule:
- మార్చి 22: చెన్నై సూపర్ కింగ్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – వేదిక: చెన్నై
- మార్చి 23: పంజాబ్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – వేదిక: మొహాలి
- మార్చి 23: కోల్‌కతా నైట్ రైడర్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – వేదిక: కోల్‌కతా
- మార్చి 24: రాజస్థాన్ రాయల్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – వేదిక: జైపూర్
- మార్చి 24: గుజరాత్ టైటాన్స్ Vs ముంబయి ఇండియన్స్ – వేదిక: అహ్మదాబాద్
- మార్చి 25: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs పంజాబ్ కింగ్స్ – వేదిక: బెంగళూరు
- మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్ – వేదిక: చెన్నై
- మార్చి 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs ముంబయి ఇండియన్స్ – వేదిక: హైదరాబాద్
- మార్చి 28: రాజస్థాన్ రాయల్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – వేదిక: జైపూర్
- మార్చి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs కోల్‌కతా నైట్‌రైడర్స్ – వేదిక: బెంగళూరు
- మార్చి 30: లక్నో సూపర్ జెయింట్స్ Vs పంజాబ్ కింగ్స్ – వేదిక: లక్నో
- మార్చి 31: గుజరాత్ టైటాన్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – వేదిక: అహ్మదాబాద్
- మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – వేదిక: వైజాగ్
- ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ Vs రాజస్థాన్ రాయల్స్ – వేదిక: ముంబయి
- ఏప్రిల్ 02: రాయల్ ఛాలెంజర్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – వేదిక: బెంగళూరు
- ఏప్రిల్ 03: ఢిల్లీ క్యాపిటల్స్ Vs కోల్‌కతా నైట్ రైడర్స్ – వేదిక: వైజాగ్
- ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్ Vs పంజాబ్ కింగ్స్ – వేదిక: అహ్మదాబాద్
- ఏప్రిల్ 05: హైదరాబాద్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – వేదిక: హైదరాబాద్
- ఏప్రిల్ 06: రాజస్థాన్ రాయల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – వేదిక: జైపూర్ఏ
- ప్రిల్ 07: ముంబయి ఇండియన్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – వేదిక: ముంబయి
- ఏప్రిల్ 07: లక్నో సూపర్ జెయింట్స్ Vs గుజరాత్ టైటాన్స్ – వేదిక: లక్నో
- ఏప్రిల్ 8: చెన్నై vs కోల్‌కతా – చెన్నై (వేదిక)
- ఏప్రిల్ 9: పంజాబ్ vs సన్‌రైజర్స్ – మొహాలీ
- ఏప్రిల్ 10: రాజస్థాన్ vs గుజరాత్ – జైపూర్ఏ
- ప్రిల్ 11: ముంబై vs ఆర్సీబీ – ముంబై
- ఏప్రిల్ 12: లక్నో vs ఢిల్లీ – లక్నో
- ఏప్రిల్ 13: పంజాబ్ vs రాజస్థాన్ – మొహాలీ
- ఏప్రిల్ 14: కోల్‌కతా vs లక్నో – కోల్‌కతా
- ఏప్రిల్ 14: ముంబై vs చెన్నై – ముంబై
- ఏప్రిల్ 15: ఆర్సీబీ vs సన్‌రైజర్స్ – బెంగళూరు
- ఏప్రిల్ 16: గుజరాత్ vs ఢిల్లీ – అహ్మదాబాద్ఏ
- ప్రిల్ 17: కోల్‌కతా vs రాజస్థాన్ – కోల్‌కతా
- ఏప్రిల్ 18: పంజాబ్ vs ముంబై – మొహాలీ
- ఏప్రిల్ 19: లక్నో vs చెన్నై – లక్నో
- ఏప్రిల్ 20: ఢిల్లీ vs సన్‌రైజర్స్ – ఢిల్లీ
- ఏప్రిల్ 21: కోల్‌కతా vs ఆర్సీబీ – కోల్‌కతా
- ఏప్రిల్ 21: పంజాబ్ vs గుజరాత్ – మొహాలీ
- ఏప్రిల్ 22: రాజస్థాన్ vs ముంబై – జైపూర్
- ఏప్రిల్ 23: చెన్నై vs లక్నో – చెన్నై
- ఏప్రిల్ 24: ఢిల్లీ vs గుజరాత్ – ఢిల్లీ
- ఏప్రిల్ 25: సన్‌రైజర్స్ vs ఆర్సీబీ – హైదరాబాద్ఏ
- ప్రిల్ 26: కోల్‌కతా vs పంజాబ్ – కోల్‌కతా
- ఏప్రిల్ 27: ఢిల్లీ vs ముంబై – ఢిల్లీ
- ఏప్రిల్ 27: లక్నో vs రాజస్థాన్ – లక్నో
- ఏప్రిల్ 28: గుజరాత్ vs ఆర్సీబీ – అహ్మదాబాద్ఏ
- ప్రిల్ 28: చెన్నై vs సన్‌రైజర్స్ – చెన్నై
- ఏప్రిల్ 29: కోల్‌కతా vs ఢిల్లీ – కోల్‌కతా
- ఏప్రిల్ 30: లక్నో vs ముంబై – లక్నో
- మే 1: చెన్నై vs పంజాబ్ – చెన్నై
- మే 2: సన్‌రైజర్స్ vs రాజస్థాన్ – హైదరాబాద్మే
- 3: ముంబై vs కోల్‌కతా – ముంబై
- మే 4: ఆర్సీబీ vs గుజరాత్ – బెంగళూరు
- మే 5: పంజాబ్ vs చెన్నై – ధర్మశాల
- మే 5: లక్నో vs కోల్‌కతా – లక్నో
- మే 6: ముంబై vs సన్‌రైజర్స్ – ముంబై
- మే 7: ఢిల్లీ vs రాజస్థాన్ – ఢిల్లీ
- మే 8: సన్‌రైజర్స్ vs లక్నో – హైదరాబాద్మే
- 9: పంజాబ్ vs ఆర్సీబీ – ధర్మశాల
- మే 10: గుజరాత్ vs చెన్నై – అహ్మదాబాద్మే
- 11: కోల్‌కతా vs ముంబై – కోల్‌కతా
- మే 12: చెన్నై vs రాజస్థాన్ – చెన్నై
- మే 12: ఆర్సీబీ vs ఢిల్లీ – బెంగళూరు
- మే 13: గుజరాత్ vs కోల్‌కతా – అహ్మదాబాద్మే
- 14: ఢిల్లీ vs లక్నో – ఢిల్లీ
- మే 15: రాజస్థాన్ vs పంజాబ్ – గువహటి
- మే 16: సన్‌రైజర్స్ vs గుజరాత్ – హైదరాబాద్మే
- మే 17: ముంబై vs లక్నో – ముంబై
- మే 18: ఆర్సీబీ vs సీఎస్కే – బెంగళూరు
- మే 19: సన్‌రైజర్స్ vs పంజాబ్ -హైదరాబాద్మే
- మే 19: రాజస్థాన్ vs కోల్‌కతా – గువహటి
- మే 21: క్వాలిఫైయర్ 1 – అహ్మదాబాద్
- మే 22: ఎలిమినేటర్ – అహ్మదాబాద్
- మే 24: క్వాలిఫైయర్ 2 – చెన్నై
- మే 26: ఫైనల్ – చెన్నై
BCCI Announces Full Schedule of IPL 2024 # BCCI Announces Full Schedule of IPL 2024
IPL 2024 Live Streaming ##IPL 2024 Live Streaming