భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1: ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. GK Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc… వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని దేశాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాల్డ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే GK Questions in Telugu పోటీ పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.1990 నుండి వివిధ పోటీ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు.
1. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్య నిర్వహణ అధికారం ఎవరికి ఉండేది.
ఎ) బ్రిటీషు.రాణి/రాజు
బి) ఇంగ్లాండు పార్లమెంటు
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్
Answer: డి) కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్
2. చాలా. సం.లకు మునుపే మనము విధి/అదృష్టముతో నిర్ణీత సమాగమం చేసితిమి అని చెప్పినది.
ఎ) వల్లభ్‌భాయ్‌పటేల్
బి) జవహార్‌లాల్ నెహ్రూ
సి) రాజ్‌గోపాల్
డి) బి.ఆర్. అంబేద్కర్
Answer: బి) జవహార్‌లాల్ నెహ్రూ
3. సెప్టెంబరు, 2 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది.
ఎ) సైమన్ కమీషన్.
బి) క్రిప్స్ మిషన్
సి) వేవెల్ ష్లాన్
డి) క్యాబినెట్ మిషన్ ప్లాన్
Answer: డి) క్యాబినెట్ మిషన్ ప్లాన్
4. స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఎందులో సభ్యుడు.
ఎ) కన్సర్వేటివ్ పార్టీ
బి) లిబరల్ పార్టీ
సి) లేబర్ పార్టీ
డి) అధికార ్రేణి
Answer: సి) లేబర్ పార్టీ
5. బ్రిటీష్‌వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సం.లో ఏర్పాటు చేశారు.
ఎ) 1776
బి) 1775
సి) 1777
డి) 1774
Answer: డి) 1774
6. బ్రిటీషు ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయోపరిమితిని 1878లో 19 సం.లకుతగ్గించింది. మళ్ళీ ఏ సం. నుండి దాన్ని 24 సం. వరకు పెంచారు.
ఎ) 1892
బి) 1905
సి) 1906
డి) 1924
Answer: ఎ) 1892
7. 1779 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని వ్యవహరిస్తారు.
ఎ) ఛార్జర్ చట్టాలు
బి కౌన్సిల్ చట్టాలు
సి) క్రౌన్ చట్టాలు
డి) పైవి ఏవీకాదు
Answer: ఎ) ఛార్జర్ చట్టాలు
8. 1833 ఛార్జర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ క్రింది వాటిలో సరికానిది
ఎ) ఈస్టు ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేసింది.
బి) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది.
సి) కౌన్సిల్ న్యాయచట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇవ్వబడింది.
డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు.
Answer: డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు.
9. క్రింది వాటిలో సరైనది
ఎ) బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్
జనరల్ వారెన్ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగు చట్టం – 1778 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటుకు ప్రతిపాదన
సి) పై రెండు
డి) పై రెండూ కాదు
Answer: సి) పై రెండు
10. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి.
ఎ) రెండు
బి) మూడు
సి) ఐదు
డి) ఆరు
Answer: బి) మూడు
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
11. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ఎ) వాట్సన్
బి) రాబర్ట్ క్లైవ్
సి) డూప్లెక్స్
డి) వారెన్ హేస్టింగ్స్
Answer: బి) రాబర్ట్ క్లైవ్
12. ఏ రోజున ఇండియా పాలనను బ్రిటీష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది?
ఎ) 1-11-1858
బి) 1-11-1857
సి) 1-12-1859
డి) 1-12-1857
Answer: ఎ) 1-11-1858
13. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశం/ అంశాలు
ఎ) రాష్ట్రాల కార్య నిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించింది.
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం
డి) పైవన్నియు
Answer: డి) పైవన్నియు
14. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి కల్పించడానికి ఉద్ధేశించబడింది?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం, 1861
బి) ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం, 1862
సి) ఇండియన్ కాన్సిళ్ళ చట్టం, 1909
డి) గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ చట్టం, 1919
Answer: ఎ) ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం, 1861
15. “గట్టి ‘బ్రేకులు ‘ వుండి ఇంజన్ లేని యంత్రం” అని నెహ్రూ దేనిని అన్నాడు?
ఎ) కాబినెట్ ష్లాన్
బి) మౌంట్ బాటన్ ష్లాన్
సి) వేవెల్ ష్లాన్
డి) 1935- భారత ప్రభుత్వ చట్టం
Answer: డి) 1935- భారత ప్రభుత్వ చట్టం
16. మతతత్వ నియోజక వర్గాల పితామహుడిగా ఎవరి పిలుస్తారు?
ఎ) లార్డ్ మింటో
బి) లార్డ్ బెంటింక్
సి) వారెన్ హేస్టింగ్స్
డి) రాబర్ట్ క్లైవ్
Answer: ఎ) లార్డ్ మింటో
17. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడినది?
ఎ) ఛార్జర్ చట్టం, 1833
బి) ఛార్జర్ చట్టం, 1853
సి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892
Answer: బి) ఛార్జర్ చట్టం, 1853
18. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం
ఎ) సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం
బి) రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం
సి) బ్రిటీష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి
డి) ఆ కాలంలో చెలరేగిన మతకల్లోలాలను నివారించుటకై ప్రణాళిక .
Answer: సి) బ్రిటీష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి
19. ఈ క్రింది వానిలో ఏది ఉడ్స్ డిస్పాచ్ (తాకీదు) 1854 సిఫారసు కానిది?
ఎ) సాంకేతిక విద్య, మహిళా విద్య కొరకు స్కూల్స్ ఏర్పాటు చేయడం
బి) ప్రైవేటు భాగస్వామ్యం కొరకు గ్రాంట్లు ఇవ్వడం
సి) విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు
డి) బొంబాయి, బెంగాల్ మర్తియు మద్రాస్‌లలో ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటు
Answer: సి) విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు
20. ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు.
ఎ) ఇండియన్ కౌన్సిల్స్ చట్టము, 1892
బి) భారత ప్రభుత్వ చట్టము, 1909
సి) భారత ప్రభుత్వ చట్టము, 1919
డి) గాంధి-ఇర్విన్ ఒడంబడిక
Answer: సి) భారత ప్రభుత్వ చట్టము, 1919
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
21. 1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రి మండలిలో న్యాయ శాఖ మంత్రి
ఎ) వి.ఎన్స్ గాడ్గిల్
బి) రాజేంద్ర ప్రసాద్
సి) జాన్ మథాయ్
డి) బి.ఆర్. అంబేద్కర్
Answer: డి) బి.ఆర్. అంబేద్కర్
22. క్రింది వానిలోని ఒక అంశమును భారత రాజ్యాంగం గవర్నమెంటు ఆఫ్ ఇండియా ఆక్ట్ 1935 నుండి స్వీకరించలేదు?
ఎ) గవర్నర్ ఆఫీసు
బి) అత్యవసర పరిస్థితుల్లో వాడవలసిన అధికారాలు
సి) సమాఖ్య విధానం
డి) చట్టబద్ధమైన పరిపాలన
Answer: డి) చట్టబద్ధమైన పరిపాలన
భారత రాజ్యాంగం – పరిణామ క్రమం (Evolution of Indian Constitution Practice Bits in Telugu)
23) రాజ్యాంగ వాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త.
ఎ) అరిస్టాటిల్
బి) రూసో
సి) చార్లెస్ డార్విన్
డి) ప్లేటో
Answer: ఎ) అరిస్టాటిల్
24) ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యంగా వర్ణిస్తారు.
ఎ) పిట్ ఇండియా చట్టం – 1784
బి) రెగ్యులేటింగ్ చట్టం – 1773
సి) చార్టర్ చట్టం 1813
డి) చార్టర్ చట్టం – 1853
Answer: బి) రెగ్యులేటింగ్ చట్టం – 1773
25) దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వపాలనకు నాంది ప్రస్తావన జరిగింది.
ఎ) రెగ్యులేటింగ్ చట్టం – 1773
బి) ఛార్జర్ చట్టం – 1853
సి) కౌన్సిల్ చట్టం – 1858
డి) పిట్ ఇండియా చట్టం – 1784
Answer: డి) పిట్ ఇండియా చట్టం – 1784
26) భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించిన చట్టం
ఎ) 1813
బి) 1861
సి) 1909
డి) 1919
Answer: ఎ) 1813
27) గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్ జారిచేసే అవకాశాన్ని కల్పించిన చట్టం
ఎ) 1909
బి) 1919
సి) 1935
డి) 1861
Answer: డి) 1861
28) మత ప్రాతిపదికన మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం.
ఎ) 1909
బి) 1919
సి) 1985
డి) పైవేవీ కాదు
Answer: ఎ) 1909
29) దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభాపద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు.
ఎ) 1958
బి) 1909
సి) 1919
డి) 1935
Answer: సి) 1919
30) రాష్ట్రాలలో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం
ఎ) 1935
బి) 1919
సి) 1909
డి) పైవేవీ కావు
Answer: ఎ) 1935
31) భారత ప్రభుత్వ చట్టం – 1935లోని సరికాని అంశం.
ఎ) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు
బి) సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన
సి) ఆర్.బి.ఐ. ఏర్పాటు
డి) సార్వజనీన ఓటుహక్కు
Answer: డి) సార్వజనీన ఓటుహక్కు
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
32) ఈ క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చు చేశారు.
ఎ) 1833
బి) 1813
సి) 1861
డి) 1858
Answer: ఎ) 1833
33) రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం
ఎ) 1909
బి) 1919
సి) 1985
డి) 1955
Answer: బి) 1919
34) భారతదేశంలో మత ప్రాతివదిక, ప్రాతినిధ్య పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు.
ఎ) లార్డ్ కర్జన్
బి) లార్డ్ విలియం బెంటింక్
సి) లార్డ్ మింటో
డి) ఛెమ్స్‌ఫర్డ్
Answer: సి) లార్డ్ మింటో
35) సైమన్ కమీషన్ ముఖ్య ఉద్దేశము
ఎ) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం
బి) రాజ్యాంగపరిషత్తు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడం
సి) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం
డి) పైవన్నీ
Answer: ఎ) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం
36) కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం
ఎ) హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చే ప్రతిపాదన
బి) మైనారిటీల ప్రాతినిధ్య పథకం
సి) బలహీనుల వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్య పరిపాలన
డి) పైవన్ని
Answer: డి) పైవన్ని
37) ఈ క్రింది ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్భా స్వాతంత్ర్యాలను మాగ్నా కార్టాగా పేర్కొంటారు.
ఎ) వేవెల్ ప్రతిపాదన
చి) క్రిప్సు ప్రతిపాదన
సి) క్యాబినెట్ రాయబార ప్రతిపాదన
డి) విక్టోరియా రాణి ప్రకటన
Answer: డి) విక్టోరియా రాణి ప్రకటన
38) మహాత్మాగాంధి హాజరయిన రౌండ్ టేబుల్ సమావేశము
ఎ) ఒకటవ రౌండ్ టేబుల్ సమావేశం
బి) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
సి) మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
డి) పైవేవీ కావు.
Answer: బి) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
39) భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతనపత్రంగా వర్ణించినది
ఎ)కె.టి.షా’
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) మహాత్మా గాంధీ
డి) సరూర్ పటేల్
Answer: బి) జవహర్లాల్ నెహ్రూ
40) ఈ క్రింది ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటయింది.
ఎ) క్యాబినెట్ ప్రతిపాదనలు
బి) మౌంట్ బాటన్ ప్రతిపాదనలు
సి) క్రిప్స్ ప్రతిపాదనలు
డి) పైవేవీ కావు
Answer: ఎ) క్యాబినెట్ ప్రతిపాదనలు
41) తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరము
ఎ) 1946 సెప్టెంబర్ 2
బి) 1946 అక్టోబర్ 2
సి 1946 నవంబర్ 1
డి) 1947 నవంబర్ 1
Answer: ఎ) 1946 సెప్టెంబర్ 2
42) బ్రిటీషు పార్లమెంటు భారత స్వతంత్ర్య చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది.
ఎ) 1947 ఆగస్టు 15
బి). 1947 జూన్ 18
సి) 1947 జులై 18
డి 1947 ఏప్రిల్ 18
Answer: సి) 1947 జులై 18
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
Also Read 👇👇
Current Affairs Multiple Choice Questions (Quiz) – March 2024 Part-1 – Lsrallinonenews.com
TSPSC Group-1 Preliminary Exam-2023 General Studies & Mental Ability Questions with Answers Part-4 – Lsrallinonenews.com #Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1 #Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1 #Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1 #Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
భారత రాజ్యాంగం -Constitution of India in Telugu