Google Has Renamed Bard AI as ‘Gemini’ Find Out About The New Features in Telugu: Ai ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(Ai) సాయంతో వాడే టూల్ గూగుల్ బార్డ్. గత ఏడాదే ఇది టెక్ కంపెనీ నుంచి ప్రారంభించబడింది. అయితే దీని పేరును గూగుల్ జెమినిగా మార్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌ను ఎలా వాడుతున్నారో అదే విధంగా జెమిని టూల్‌ను డిఫాల్ట్ అసిస్టెంట్‌గా వాడుకోవచ్చని ఆ కంపెనీ ప్రకటించింది.
Table of Contents
Google Has Renamed Bard AI as ‘Gemini’ Find Out About The New Features in Telugu
Google Ai చాట్GPTకి పోటీగా Google Gemini మరింత అధునాత AI టెక్నాలజీ సేవలను అందిస్తుందని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ ప్రకటించింది. ఈ చాట్ బాట్‌లో Ai సేవలు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా “Ok Google” అని చెప్పడం ద్వారా Gemini Ai అసిస్టెంటుగా మొదలుపెట్టొచ్చు. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల స్క్రీన్లపై ఓవర్‌లేగా పని చేస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అంటే Google Gemini యూజర్లు ప్రస్తుతం ఫోన్లో ఏయే పనులు చేయొచ్చు.. ఏ యాప్స్ రన్ అవుతున్నాయి.. లేదా వారు ఏ కథనాలను చదువుతున్నారు.. వేటిని చూస్తున్నారనే విషయాలను ‘‘ట్రాక్’’ చేయొచ్చు.
కాబట్టి మీకు ఏదైనా విషయంపై సందేహాలుగా వెంటనే Geminiని అడగొచ్చు. అంతేకాదు మీ ఇంట్లో ఉండే ఏదైనా మొక్కను ఫోటో తీసి, అది ఎలాంటి మొక్క, దాన్ని ఎలా పెంచాలి.. ఏ విధంగా దాన్ని సంరక్షించాలనే వివరాలను Google Geminiని అడగొచ్చు. ఈ మొక్కకు సంబంధించి నిర్వహణ, పోషణ, నీటిపారుదల షెడ్యూల్, ఉత్తమ కాంతి కోసం మొక్కను ఎక్కడ ఉంచాలి వంటి వివరాలను డెవలప్ చేయడానికి అవసరమైన ఎరువుల వివరాలను సైతం మీకు Gemini మీకు తెలియజేస్తుంది.
రాబోయే రోజుల్లో..
యాపిల్ యూజర్ల కోసం రాబోయే రోజుల్లో Google AI గూగుల్ యాప్‌కి సపోర్ట్ చేయనుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లు USలోని ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంతో సహా ఇతర దేశాలకు ఎప్పుడు వస్తుందనే వివరాలను గూగుల్ ఇంకా వెల్లడించలేదు.
గూగుల్ బార్డ్, జెమిని మధ్య తేడాలేంటి?
ఈ చాట్‌బాట్‌లో ఉపయోగించిన ఉచిత, జెమినీ ప్రో మోడల్ Google బార్డ్ Ai అనేక సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక నుంచి అవి అందుబాటులో ఉండవు. ఎందుకంటే Google Gemini ఒక అధునాతన ఉత్పాదక Ai టూల్. దీన్ని వినియోగించుకోవడానికి యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
గూగుల్ జెమిని ఫ్రీగా ఎలా వాడాలి?
జెమిని అడ్వాన్స్ ప్రో మోడల్‌ను రెండు నెలల పాటు పూర్తి ఉచితంగా వాడుకోవచ్చని తెలుస్తోంది. ఈ నెలల పాటు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. జెమిని ప్రోలో ఉన్న లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను యూజర్లు ఉచితంగా వాడుకోవచ్చు.
2 నెలల తర్వాత ఎంత చెల్లించాలంటే..
Google Gemini ఫీచర్‌ను వాడుకునేందుకు నెలకు సుమారు రూ.1,950 స్థిర చందాను చెల్లించాల్సి ఉంటుందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, గూగుల్ యాప్, ఐఫోన్ యూజర్ల కోసం Ai అసిస్టెటంట్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే ప్రమోషనల్ ఆఫర్ కింద జెమిని అడ్వాన్స్‌ను 2 నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను Google One Ai ప్రీమియం ప్లాన్ అంటారు. వినియోగదారులందరూ Google One నుంచి కొనుగోలు చేయాలి.
ఏయే ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి?
Google జెమిని అడ్వాన్స్‌కు సబ్ స్క్రిప్షన్ పొందిన యూజర్లు 2TB Google One క్లౌండ్ స్టోరేజీతో పాటు అద్భుతమైన Ai ప్రయోజనాలు పొందుతారు. గూగుల్ క్లెయిమ్ చేసినట్లుగా, జెమిని అనేక కొత్త ఫీచర్లను జోడించింది. అందుకే దీనికి జెమిని అడ్వాన్స్ అల్ట్రా 1.0 అని పేరు పెట్టారు. గూగుల్ జెమినిలో మొత్తం మూడు వర్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి అల్ట్రా, ప్రో, నానో. ఈ మూడు వర్షన్లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. జెమిని కోడింగ్, లాజికల్ రీజనింగ్, టెక్ట్స్ కోడ్, ఆడియో, వీడియో, ఫోటోలతో పాటు క్లిష్టమైన పనులను ఇది చాలా సులభంగా చేయగలదు. జెమిని యూజర్లు ప్రాంప్ట్‌లు లేదా సూచనల ఆధారంగా కచ్చితమైన సమాధానాలు ఇవ్వగలదు. ఈ టూల్ మీకు ట్యూటర్‌గా కూడా పని చేస్తుంది.
Google Has Renamed Bard AI as ‘Gemini’ Find Out About The New Features in Telugu
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Google Has Renamed Bard AI as ‘Gemini’ Find Out About The New Features in Telugu
Google Has Renamed Bard AI as ‘Gemini’ Find Out About The New Features in Telugu