ఎయిర్ ఇండియా, మహీంద్రా, జీఎంఆర్ తో ఎయిర్బస్ ఒప్పందాలు పైలెట్ల శిక్షణ, విడిభాగాల ఉత్పత్తి, విమానాల నిర్వహణ సిబ్బందికి శిక్షణ.. తదితర విభాగాల్లో మనదేశానికి చెందిన అగ్రశ్రేణి సంస్థలతో, ఐరోపా కేంద్రంగా విమానాల తయారీ కార్యకలాపాలు చేపట్టే ఎయిర్బస్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
హైదరాబాద్: పైలెట్ల శిక్షణ, విడిభాగాల ఉత్పత్తి, విమానాల నిర్వహణ సిబ్బందికి శిక్షణ.. తదితర విభాగాల్లో మనదేశానికి చెందిన అగ్రశ్రేణి సంస్థలతో, ఐరోపా కేంద్రంగా విమానాల తయారీ కార్యకలాపాలు చేపట్టే ఎయిర్బస్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్లో గురువారం ‘వింగ్స్ ఇండియా’ సదస్సులో భాగంగా ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఎయిర్బస్ వెల్లడించింది. ‘భారత్లో తయారీ’ కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ, విడిభాగాలు పొందేందుకు అవసరమైన ఒప్పందాలను భారతీయ సంస్థలతో కుదుర్చుకోవడంతో పాటు, ఇందుకవసరమైన శిక్షణ సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు ఎయిర్బస్ ఇండియా, సౌత్ ఏషియా ఎండీ రెమి మిలార్డ్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశం నుంచి ఏటా 750 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6225 కోట్ల) విలువైన విమానాల విడిభాగాలను ఎయిర్బస్ కొనుగోలు చేస్తోంది. టీఏఎస్ఎల్, మహీంద్రా ఏరోస్పేస్ స్ట్రక్చర్స్తో తాజాగా కుదిరిన ఒప్పందాల వల్ల ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. మానవ వనరుల లభ్యతను పెంపొందించేందుకు, శిక్షణ కేంద్రాలపై నిధులు వెచ్చిస్తున్నట్లు ఎయిర్బస్ వెల్లడించింది.
ఎయిరిండియా కొత్త ఏ350 విమానాన్ని ప్రారంభిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా. చిత్రంలో వీకే సింగ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీటర్ అల్బెర్స్, రెమి మిలార్డ్ తదితరులు
గురుగ్రామ్ పైలెట్ల శిక్షణ కేంద్రం
ఎయిర్బస్, టాటా గ్రూపు సంస్థ అయిన ఎయిర్ ఇండియా కలిసి, 50: 50 శాతం వాటా భాగస్వామ్యంతో గురుగ్రామ్లో పైలెట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ‘టాటా ఎయిర్బస్ శిక్షణ కేంద్రం పేరుతో 3,900 చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. పూర్తిస్థాయి ఫ్లైట్ సిమ్యులేటర్లు 10, ఫ్లైట్ ట్రైనింగ్ తరగతి గదులు, హాలు, ఇతర సదుపాయాలు ఇందులో ఉంటాయి. వచ్చే ఏడాదికి ఈ కేంద్రం సిద్ధమవుతుంది. ఈ కేంద్రం నుంచి వచ్చే పదేళ్లలో దాదాపు 5,000 మంది పైలెట్లు ఎయిర్బస్ ఏ320, ఏ350 విమానాల శిక్షణను పొందే అవకాశం ఉంది. మనదేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ, ఐరోపా నియంత్రణ సంస్థ ఈఏఎస్ఏ గుర్తింపు ఉన్న శిక్షణ కోర్సులను ఈ కేంద్రం నిర్వహిస్తుంది.
విడిభాగాల సరఫరా కోసం
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), మహీంద్రా ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో విమానాల విడిభాగాల సరఫరా కోసం ఎయిర్బస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం టీఏఎస్ఎల్, మహీంద్రా ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్బస్ ఏ320 నియో, ఏ330 నియో. ఏ350 విమానాలకు అవసరమైన మెటాలిక్ డిటేయిల్ పార్ట్స్, కొన్ని ఇతర విడిభాగాలు, అసెంబ్లీస్ ను ఎయిర్బస్కు అందిస్తాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఎయిర్బస్కు పలు రకాల విడిభాగాలు సరఫరా చేస్తున్నాయి.
జీఎంఆర్ ఏరోటెక్నిక్ తో ఎయిర్బస్
విమానాల నిర్వహణ ఇంజినీర్లకు శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఎయిర్బస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోటెక్నిక్ సదుపాయంలో ఇంజినీర్లకు శిక్షణ కోర్సులు నిర్వహిస్తారు. తనవంతుగా ఎయిర్బస్, ట్రైనింగ్ హ్యాండ్ బుక్స్, పరీక్షల సమాచారాన్ని అందిస్తుంది. ఎయిర్బస్ శిక్షణ కోర్సుల మెటీరియల్ను ఆన్లైన్లో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఎయిర్బస్ కాంపిటెన్స్ ట్రైనింగ్ (ఏసీటీ) ఫర్ అకాడమీ ప్యాకేజ్ను కూడా అందుబాటులోకి తెస్తుంది. జీఎంఆర్ ఇన్స్ట్రక్టర్లకు కూడా ఎయిర్బస్ ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తుంది.
ఏ350 తొలి విమానం ప్రారంభం
భారతీయ ప్రయాణికులకు ఎయిర్బస్ ఎ350 విమానం సరికొత్త అంతర్జాతీయ ప్రయాణ అనుభూతిని అందుబాటులోకి తెస్తుందని ఎయిర్బస్ ఇండియా ఎండీ అన్నారు. ఎయిరిండియాకు సంస్థ అందించిన ఈ విమానాన్ని విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా గురువారం ఇక్కడ ప్రారంభించారు. గత డిసెంబరులో భారత్కు చేరిన ఈ విమాన వాణిజ్య కార్యకలాపాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
Table of Contents
Also read 👇👇👇
HDFC Bank share price extends decline; plunges over 10% (lsrallinonenews.com)
Ambani Industries: 24 గంటల్లో కథ మారిపోయింది.. రెండు కంపెనీ (lsrallinonenews.com)
Indian Cricket Team On Verge Of Beating Pakistan To T20I (lsrallinonenews.com)
Divy Ayodhya App: భక్తుల కోసం @ Ayodhya Ram Mandir-2024 (lsrallinonenews.com)
Operation Cactus: ‘ఆపరేషన్ కాక్టస్ @ Maldives-2024 LSR-News (lsrallinonenews.com)
[…] […]
[…] […]